6, నవంబర్ 2015, శుక్రవారం

రాముడికి నమస్కారం







        ఉ. అతడిని రామచంద్రుడని
              యందురు కేవల ధర్మవిగ్రహుం
        డతడని విశ్వసింతురు
              మహాత్ము డనాది యనంతు డచ్యుతుం
        డతడని నమ్మియుందురు
              నిరామయు డీశ్వరు డార్తరక్షణా
        వ్రతు డత డందు రాతని
              కవశ్యము నేను నమస్కరించెదన్