27, ఫిబ్రవరి 2018, మంగళవారం
ఆంధ్రప్రభ చింతన పేజీలో శ్యామలీయం.
ఆంధ్రప్రభవారు శ్యామలీయం నుండి ప్రచురిస్తున్నారు.
ఆసక్తిగల పాఠకుల సౌకర్యం కోసం ఈ టపాలో ఆ ఈ-పేపర్ పేజీల లింకులు ఇస్తున్నాను.
1. 20వ తారీఖున గజేంద్రమోక్షం గురించి ప్రచురించారు.
2. ఈ నాటి చింతన పేజీలో సంపత్కరి గురించి ప్రచురించారు.
ఈ టపాను శ్యామలీయం అని కాక నా పేరుతోనే ప్రకటిస్తున్నారని గమనించ ప్రార్థన.
25, ఫిబ్రవరి 2018, ఆదివారం
చాలానే ప్రత్యేకసీమలు కావాలి ప్లీజ్.
ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఎదురు దాడి చేస్తున్నారు.
ఎవరిమీదా అంటే ఆంద్రులమీద అనే చెప్పాలి.
గత ఎన్నికలలో అరచేతిలో స్వర్గం చూపించారు నమ్మశక్యం కానంత మంచి మంచి వాగ్దానాలతో.
కాంగ్రెసువాళ్ళు ఐదేళ్ళిస్తాం ప్రత్యేకహోదా అంటే మన వెంకయ్య నాయుడు గారు కాదు పదేళ్ళివ్వండి అని ప్రాధేయపడి ఎంతమంచి వాడూ అని అనిపించుకున్నాడు.
తీరా కాంగ్రెసు వాళ్ళు అలా కుదరదు కేవలం ఐదేళ్ళే ఇస్తాం అంటే పోనివ్వండి, మే అధికారంలోకి వచ్చి దాని పదిహేనేళ్ళు చేస్తాం అని వెంకయ్యగారు గొప్పగా చెప్పటం అందరికీ అప్పట్లో ఎంతో కర్ణామృతంగా అనిపించింది.
అందరూ ఎంతో సంతోషించారు మోదీ ప్రభంజనంతో బీజీపే గద్దెకెక్కగానే.
తీరా ఆ బీజేపీ కాస్తా అట్టుతిరగేసి అసలు ప్రత్యేకహోదా ఇవ్వటం కుదరదంటే కుదరదూ అని కుండబద్దలు కొట్టినప్పుడు కాని బీజేపీ నిజస్వరూపం బయటపడలేదు!
ఆంధ్రాకు ఇవ్వలేకపోవటమే కాదు ముందుముందు ఏరాష్టానికీ ఇవ్వటమూ కుదరదూ, అసలు ఇప్పుడు ఆ హోదా ఉన్న రాష్ట్రాలకూ అది పొడిగించటం కుదరదూ అన్నారు.
ఆంధ్రా జనం కాబోలు అనుకున్నారు.
పోలవరం ప్రాజెక్టును కేంద్రమే దగ్గరుండి సహాయం చేసి కడుతుందని నమ్మబలికి, తొలి బడ్జెట్‍లో ముష్టి వందకోట్లు కేటాయించినప్పుడే వీళ్ళ రంగు బయటపడింది. నీ యిల్లు నేనే కట్టిస్తానూ నాఖర్చుతో- ఇదిగో ఈ పదినోటు నా మొదటి విడత అన్నట్లు మాట్లాడినప్పుడే వీళ్ళ దొంగవేషం ఆంద్రులకు తెలిసింది.
అన్నీ పచ్చి అబధ్దాలు.
బయటపడినా కేంద్రం దొంగాటకం, ఎలాగో అలాగ బ్రతిమాలి పని జరిపించుకోవా లనుకున్న ప్రయత్నాలు ఫలించలేదు!
తెలుగురాష్ట్రాన్ని పరమకిరాతకంగా విభజించిన డ్రామాలో ఆ కాంగ్రెసు వాళ్ళూ ఈ బీజీపే వాళ్ళూ కూడా సమపాపులే.
అసలెందుకు బీజేపీ వారు విడగొట్టటంకోసం తొడగొట్టారూ అంటే వారిదీ కాంగ్రెసుమార్కు వాదనే. వారికి తెలంగాణాలో ఏదో అమోఘమైన అధికారం సంపాదించగల అవకాశం పుష్కలంగా ఉందన్న పిచ్చిభ్రమ ఉండేది. అంతే.
ఎంత అరిచిగీపెట్టినా బీజేపీకి ఆంధ్రాలో అధికారం అనేది కల్ల. గగనకుసుమం కన్నా అబధ్ధం. అది నిజం. ఎప్పటికీ అంతేను.
ఎలాగూ మనకు అధికారం అప్పగించని ప్రాంతానికి ఎందుకు చేయాలీ సాయం అన్న హీనబుధ్ధి ఈ బీజేపీది.
దేశానికి చిన్నచిన్న రాష్ట్రాలే శ్రేయస్కరం అని ఈ బీజేపీ వాళ్ళెప్పుడో తీర్మానం చేసేసుకున్నారట. అందుకని తెలుగురాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సిందే అని వాళ్ళు పట్టుబట్టారు అప్పట్లో.
మరి ఇంకాకొన్ని చిన్నరాష్ట్రాల డిమాండ్లు దేశంలో ఉన్నాయి కదా?
ఇంకొక్క చిన్న రాష్ట్రం ఊసైనా ఎత్తారా ఈ నాలుగేళ్ళల్లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ వాళ్ళూ అని?
నాలుగేళ్ళపాటు బ్రతిమాలటం బామాలటంతోనే తిప్పలుపడుతున్న ఆంద్రులు ఓపికచచ్చి బీజేపీమీద విరుచుకు పడుతున్నారంటే అది వాళ్ళ తప్పా?
తప్పే నంటున్నాయి ఒకట్రెండు చిల్లర పార్టీలు కూడా.
ఇరుకున బడ్డ బీజేపీకి అర్జెంటుగా ఒక అస్త్రం కావలసి వచ్చింది.
ఉందిగా ఒకప్పుడు పనిచేసిన చిన్నరాష్ట్రం మిన్నరాష్ట్రం అన్న నినాదం.
అది మళ్ళీ ముందుకు తెచ్చారు.
ఇప్పుడు అక్షరాలా ఘనతవహించిన బీజేపీ వారికి రాయలసీమ కష్టం గుర్తుకు వచ్చింది.
ప్రత్యేక రాయలసీమ అన్న నినాదం తెరమీదకు తెస్తున్నారు.
అంటే ఆంధ్రప్రదేశము చాలా పెద్ద ప్రదేశమూ, దాన్ని రెండు ముక్కలు చేయాలీ అన్నమాట.
మరి ఉత్తరప్రదేశము పెద్దప్రదేశమూ దాన్ని నాలుగుముక్కలు చేయాలీ అన్న మాటొకటి నానుతోంది కదా. అది ఎందుకు ప్రస్తావించరూ అని!
తెలుగుప్రజలారా!
ఆనందించండి. తెలుగువారికి ఇన్నాళ్ళకు రెండు రాష్ట్రాలు వస్తున్నాయని ఆనందించమని అప్పట్లో అన్నారు గుర్తుందా?
ఇప్పుడు ఇంకా అనందించండి.
బీజేపీ వారు తలచుకుంటే తెలుగురాష్టాలు రెండు కాదు మూడవుతాయి.
అద్భుతం కదూ!
అందుకని బీజేపీ వారికి నా విన్నపం ఒకటి చేస్తున్నాను.
అయ్యా ఆ రాయలసీమ రాష్ట్రం అనేది ఇవ్వటం గురించిన ఆలోచన ఉంటే వెంటనే ఇవ్వండీ దయచేసి. మరొక ముప్పై యేళ్ళో అరవైయేళ్ళో నాన్చి మళ్ళా సర్వం వారికే ఇచ్చే మరొక దిక్కు మాలిన విభజన కన్నా అది ఎంతో నయం. ప్రతిసారీ మమ్మల్ని దోపిడీ గాళ్ళూ అని ఎవరెవరో అరిచి ఆనక సర్వసంపన్నులుగా వాళ్ళూ అతిబీదవాళ్ళుగా మేమూ మిగిలే చిత్రాతి చిత్రమైన విభజన వద్దనే వద్దు.
కాని అయ్యా బీజేపీ వారూ, మీకు ఇంకా తెలుగునేల మీద సరిగ్గా అవగాహన కుదరటం లేదని నా అనుమానం.
కోనసీమ అని ఒకటుంది. అది స్వాతంత్రం వచ్చినతరువాత కూడా అభివృధ్ధి అనేదానికి కాంతిసంవత్సరాల దూరంలోనే ఉండిపోయింది.
ఆ మా కోనసీమకు కూడా ప్రత్యేకరాష్ట్రం ప్రసాదించండి దయచేసి.
పల్నాటిసీమ అన్న పేరు విన్నారా? లేదా? మా తెలుగు కవుల్లో శ్రీనాధుడు అని ఒకాయన ఒక పద్యంలో పల్లనాటిసీమ పల్లెటూళ్ళు అన్నాడు. అదీ అభివృధ్ధికి ఆట్టే నోచుకున్నది కాదని విన్నారా?
దానికీ ఒక ప్రత్యేకరాష్ట్రం ప్రసాదించండి.
అన్నట్లు 77లో పెద్ద ఉప్పెన వచ్చి ఆ ప్రళయంలో అనేకవేల మంది జనం చచ్చిపోయిన మా తెలుగు ప్రాంతం ఒకటి దివిసీమ అన్నది ఉన్నది. అక్కడా అభివృధ్ధి అనేది లేదని తీర్మానించేయరూ దయచేసి. దివిసీమ రాష్ట్రం కూడా ఇచ్చేస్తే ఎంతో బాగుంటుంది.
చిన్నరాష్ట్రాల నమూనాలో మీరు ఎంత చిన్న రాష్ట్రం ఐతే అది మరీ చిన్న రాష్ట్రం అన్న ఏ తర్కాన్నీ ప్రస్తావించలేదని భావిస్తున్నాను. కాబట్టి మీరు మరికొన్ని నెలల్లో గద్దె దిగటం జరిగేలోగా, తెలుగునేలమీద వీలైనన్ని రాష్ట్రాలను ఏర్పాటుచేయండి.
మీ మేలు ఇప్పటికే మరువరానిదీ మరువలేనిదీ అన్నట్లుంది.
అది ఆచంద్రతారార్కం అయ్యేలా చేసుకోండి మీ శాయశక్తులూ ఒడ్డి.
అది మీకు అసాధ్యం అనుకోము. మీకు సహాయం చేయటానికి మా అనైక్యతాపూర్ణమైన తెలుగునేలమీద బోలెడన్ని చిల్లరమల్లర రాజకీయపార్టీలున్నాయి.
ఐనా ఒక్కటి గుర్తుంచుకోండి. ఇంగ్లీషులో ఒక సామెత ఉంది Nothing recedes like success అని. మీ అధికారమూ శాశ్వతం కాదు, మీ ఉనికీ శాశ్వతం కాదు. మీరు బొక్కబోర్లా పడేలోగానే ఏర్పాటు చేయాలి మరి తెలుగునేలను మరిన్ని రాష్ట్రాలుగా!
కేంద్రంలో ఏ దిక్కుమాలిన పార్టీ అధికారంలో ఉన్నా చిన్నచిన్న రాష్ట్రాలుగా విడిపోయి కొట్టుకుంటున్నప్పుడు ఆ రాష్ట్రాలలో దేనికీ కేంద్రాన్ని ఇబ్బందిపెట్టేంత ధైర్యసాహసాలుండవు. మీ చిన్న రాష్ట్రాల పాటవెనుక ఉన్న ఉద్దేశం ఇదే అని అందరికీ తెలుసును.
కాని మిగతా చోట్ల మీరు మీ రాష్ట్రాల పునర్విభజనలను చేయలేకపోయారూ అంటే అక్కడ మీ పప్పు లెందుకు ఉడకలేదో పాపం. యధాప్రకారం తెలుగునేల మాత్రం మీ హాయిగొలిపే కత్తివాదరదెబ్బలకు ఎదురుచూస్తూ ఉన్నదని మరువకండి.

శ్రీదేవి బొమ్మను ప్రింటు కొడుతుందా మీ కంప్యూటరూ?
నటీమణి శ్రీదేవి గారి గురించి ఎవ్వరూ ఎవరికీ ప్రత్యేకంగా పరిచయవాక్యాలు చెప్పనవసరం లేదు.
పసిపిల్లగానే సినీతారగా మారిన శ్రీదేవి ఆసేతుశీతాచలమూ అభిమానప్రేక్షకలోకాన్ని సంపాదించున్నారు.
ఆవిడ బోనీకపూర్ వంటి వయోధికుణ్ణి పెళ్ళిచేసుకోవటం అప్పట్లో ఒక సంచలనం ఐతే ఇలా హఠాత్తుగా వెళ్ళిపోవటం ఇప్పుడు గొప్ప సంచలన వార్త. పత్రికల్లో రేపు వార్తలూ వివరాలూ వస్తాయి కానీ ఈరోజున టీవీ ఛానెళ్ళన్నీ హోరెత్తించేస్తున్నాయి.
ఆవిడతో నాకేవిధమైన పరిచయమూ లేదు.
నాకెవరూ అభిమాన నటీనటులూ లేరు.
ఐనా ఆవిడకు సంబందించిన ఒక విశేషం మాత్రం చెప్పగలను. అది ఆవిడ పైన మనదేశంలో ఉన్న విపరీతమైన అభిమానానికి సంబంధించినది.
ఒకప్పుడు అంటే మూడు దశాబ్దుల క్రితం వరకూ ఇసిఐయల్ సంస్థ కంప్యూటర్లను తయారు చేస్తూ ఉండేది. అప్పట్లో నేను ఆ సంస్థలో పని చేస్తూ ఉండేవాడిని.
అప్పట్లో మా సంస్థను కొనుగోలు దారు సంస్థల తరపు పెద్దలు తరచూ సందర్శించుతూ ఉండేవారు. వారికి మా కంప్యూటర్లను గురించిన వివరాలు మేము వివరించి వారి అవసరాలకు అవి ఎలా సరిపోతాయో అన్నది వారికి నచ్చచెపుతూ ఉండే వాళ్ళం.
అప్పట్లో ఇప్పటిలాగా కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేవి లేవు.
కొందరు కుర్రవాళ్ళు వాళ్ళకు చేతనైన కసరత్తులతో బొమ్మలు వేస్తూ ఉండేవారు.
మీకు పాతకాలం నాటి టైప్ మిషన్లు గుర్తున్నాయా?
ఐతే అప్పట్లో కొందరు ఆ మిషన్ల మీద X అక్షరంతోనో లేదా దానితోపాటు కీబోర్డుమీద ఉన్నమరికొన్ని అక్షరాల సాయంతోనూ వేంకటేశ్వరస్వామి బొమ్మనో మరొక బొమ్మనో వేయటం కూడా గుర్తుండాలి మీలో కొందరికైనా.
అప్పట్లో కంప్యూటర్ మీద ఇప్పటిలాగా A4 సైజు కాగితాలమీద ప్రింట్ చేయటం అనేది లేదు. లైన్ ప్రింటర్లు అని ఉండేవి. లైనుకు 132 అక్షరల దాకా ప్రింటు చేస్తూ పేజీకి అరవైపైన లైన్లు ప్రింటు చేసుకొనే సదుపాయం ఉండేది. పైగా అప్పట్లో వాటిపై అన్నీ ఇంగ్లీషు అక్షరాలే అదీ పెద్దబడి మాత్రమే. అంటే అన్నీ A B C....Z తప్ప a b c .. z వగైరాలు లేనేలే వన్నమాట. ఈ అక్షరాలు కాక కొన్ని గుర్తులు అంటే కామాలూ కోలన్లూ సెమీకోలన్లూ ఫుల్‍స్టాప్ వగైరాలు మాత్రం ఉండేవి.
కొందరు ఉత్సాహవంతలైన కుర్రాళ్ళు అ పరిమితమైన వాటితోటే లైన్ ప్రింటర్ కాగితంపైన వెంకటేశ్వరస్వామి బొమ్మ వేయగలిగారు. మరికొందరు దేవుళ్ళ బొమ్మలూ వేసారు వినాయకుడూ వంటివి.
మా సంస్థకు కష్టమర్ల తాలూకు పెద్దలు వస్తూ ఉండేవారని చెప్పాను కదా కంప్యూటర్ల సామర్థ్యాలను స్వయంగా తెలుసుకుందుకు.
అలాంటి కష్టమర్లు కంప్యూటరుకు అనుసంధానించి ఉన్న పరికరాల సామర్థ్యమూ వేగమూ గురించీ తప్పక అడిగి తెలుసుకునే వారు. లైవ్‍గా చూపించమనీ అడిగే వారు. అలాగే ఆ లైన్ ప్రింటర్ వేగం కూడా ఆలోచించే వారు. అంటే నిముషానికి ఎన్ని లైన్లు ప్రింట్ చేయగలదూ అన్నట్లు. అప్పట్లో సాధారణంగా నిముషానికి 300 లేదా 600 లైన్లు ప్రింటుకొట్టేవి ఆ ప్రింటర్లు. మరీ ఆధునికమైనవీ బాగా ఖరీదనవీ నిముషానికి 1200 లైన్లూ ప్రింటుకొట్టేవి. అప్పట్లో అది మహావేగం అన్నమాట.
అలాంటి ఒక కష్టమరుకు ప్రింటరును చూపుతున్నాడు మా ఇంజనీర్లలో ఒకబ్బాయి.
వేంకటేశ్వరస్వామి బొమ్మను వేగంగా ప్రింటుకొట్టి చూపాడు.
ఆ కష్టమరు తెగ ముచ్చటపడిపోయాడు.
శ్రీదేవి బొమ్మను ప్రింటు కొడుతుందా మీ కంప్యూటరూ? అలాగైతే వెంటనే ఆర్డరిస్తాను అన్నాడు.
ఈ సంఘటనను మేము చాలాసార్లు గుర్తుచేసుకొని నవ్వుకొనే వాళ్ళం అప్పట్లో.

24, ఫిబ్రవరి 2018, శనివారం
మన హనుమన్న యెంతో మంచివాడు
మన హనుమన్న యెంతో మంచివాడు భక్త
జనుల కుపకారములు సలుపువాడు
రామపాదభక్తురాలు రమణీమణి సీతమ్మ
కామాంధుడు రావణుచే కటకట బడుచుండ
స్వామి వార్త లెఱిగించి సంతోష పరచెను
స్వామికి సీతమ్మవారి జాడతెలియ జేసెను
మేటి రామభక్తుడు సౌమిత్రి మూర్ఛ జెందినపుడు
ధాటిగా ద్రోణగిరీంద్రమును పెకలించి తెచ్చి
చాటినాడు తన యుక్తిని శక్తిని మహనీయుడు
గాటమైన రాముని కౌగిలిలో మురిసినాడు
రామభక్తులందరకు రక్షకుడై యనిశమును
సామీరి సంచరించు ప్రేమతో నెల్లెడల
కామాది వికారములు తామసుల కృత్యములు
మోమాట మేమి లేక మొత్తి తరిమి వేయును
23, ఫిబ్రవరి 2018, శుక్రవారం
హాయిగా శ్రీరామభజన చేయగ రారే
హాయిగా శ్రీరామభజన చేయగ రారే
ఓ యమ్మలక్కలార ఓ అయ్యలారా
మీకు నాకు నందరకును మేలు గూర్చువాడు
సాకేతపతి కాక లోకమం దింకెవ్వడు
శ్రీకరుడును శుభకరుడును శ్రీరాము డొక్కడే
కాక వేరొక్క డనగ కలడా యెందైన గాని
దేవతలు సేవించు నట్టి దివ్యమైన నామము
జీవితము నిలబెట్టు నట్టి క్షేమకరమౌ నామము
భావమందు నిలిపి మీరు భజన గట్టిగ చేయరే
శ్రీవిభుని కరుణ మీరు చేకొని తరియించరే
ధ్యేయమైతే మీకు మోక్షము తెలియుడు శ్రీరాముడే
యీయ గలడయ్య దాని నితరులు లీయలేరు
తీయని శ్రీరామనామము దీక్షగైకొని పాడరే
పాయని ధృఢభక్తిగలిగి భజన మీరు చేయరే
రామభక్తి కుదరక రాదు మోక్షము
రామచరిత మెఱుగక రామవిభుని కొలువక
రామభక్తి కుదరక రాదు మోక్షము
కామదాసులకు నెపుడు కష్టములే కలుగును
భూమిమీద మరలమరల పుట్టిచావ వలయును
స్వామి యొకడున్నాడను జ్ఞానము లేకుండును
ఏమయ్యా యిట్టి బ్రతుకు లేల కోరవలయును
రామభక్తి కుదిరెనా రావు వారి కెట్టి వ్యధలును
భూమిమీద మరలమరల పుట్టిచచ్చు పనిలేదు
స్వామిదయ చేత మోక్షసామ్రాజ్య మబ్భును
ఏమయ్యా యెవరికైన నింకేమి కావలయును
కామిత మా మోక్షమని గట్టిగా నమ్మినచో
నీమనసును రామునిపై నిలిపి యుంచవలయును
స్వామి భక్తులందరకు సమకూరును మోక్షము
ఏమయ్యా యింతకన్న నేమి చెప్ప వలయును
21, ఫిబ్రవరి 2018, బుధవారం
ఈ రాముడే దైవ మెల్లవారికి
ఈ రాముడే దైవ మెల్లవారికి
చేరి కొలువగా రాదు వే రెవరిని
తొలుత ప్రతిజీవుడును పలుతిత్తుల దూరి
యలసి సొలసి తుదకు పొందు నయ్య నరదేహము
కలుగు నొక కొంత స్పృహ కష్టపెట్టు మాయ
తొలగించు కొనుటకై తోచు దేవుని వేడ
ప్రకృతి వీని వెడల నీక ప్రలోభములు చూపు
వికసించు వీని బుధ్ధి రకరకముల దైవములు
ప్రకటించు వరముల పాలుచేయ చూచు
ముకుతాడు వేయు దైవములను వేడరాదు
సూటిగా స్వస్వరూప జ్ఞానమిచ్చు రాముని
మేటి దైవరాయని గాటముగా నమ్మిన
చాటుపడు ప్రకృతిమాయ సందేహము లేదు
చేటుకాలమంతరించి సిధ్ధించు మోక్షము
ఏమేమో అడుగువాడ నేమాత్రము కాను
ఏమేమో యడుగువాడ నేమాత్రము గాను శ్రీ
రామ నీ సాన్నిధ్యమె నా మనోరథము
శ్రీమంతుడ వీవని సీతమ్మ పతి వని
కామితార్థప్రదుడ వని కరుణాసముద్రుడ వని
యేమేమో విన్నాను యెంతో పరవశించాను
నా మొఱాలకించి నీవు న న్నేలుకొన వలయు
ఏమో నే నిప్పటికే యెన్ని జన్మ లెత్తితి నో
స్వామీ యికమీద నెన్ని జన్మ లెత్తు వాడనో
యే మాత్రము సుఖములేని యీ జన్మ లెందుకు
నా మీద దయయుంచి న న్నేలుకొన వలయు
శరణమనుచు నెట్టివాడు చరణంబులు పట్టిన
దరిజేర్చు నట్టి గొప్ప ధర్మప్రభు డనగ నీవు
నిరుమానకృపారాశి నీవాడ నైతి నింక
పరమాత్మ నీ సన్నిధి వరముగా నీ వలయు

19, ఫిబ్రవరి 2018, సోమవారం
ఎంతో చదివి యొంతో చూచి
ఎంతో చదివి యెంతో చూచి యెంతో చేసి యోగ్యుడై
యింతవా డంతవా డితడే ననిపించుకొని
ఎవడెవడా చదువులకు సారమెఱుగు చున్నాడు
కువలయమున తన యునికి గూర్చి యెఱుగు చున్నాడు
భవముదాటు విధ మేదని పరితపించు చున్నాడు
చివరి వరకు విరాగియై జీవించు చున్నాడు
భువి నెవడు తన యునికి మూల మెఱుగు చున్నాడు
భువి నెవడు తన రాకపోక లెఱుగు చున్నాడు
భువి నెవడే బంధములను పోద్రోచు చున్నాడు
వివరింపగ నందరివలె వెడలి పోవు చున్నాడు
జనులార కోటి కొకడె చదువులకు సారమైన
యినకులపతి తత్త్వ మొక్కింత యెఱుగు చున్నాడు
ఘనుడువాడె స్వస్వరూప జ్ఞానమొందుచున్నాడు
కనుక రామభక్తులై గడచు డయ్య భవమును

17, ఫిబ్రవరి 2018, శనివారం
మన సీతారాము లెంతో మంచివారండీ
అనయము మన వెన్ను కాచు అమ్మానాన్నలండీ
మన సీతారాము లెంతో మంచివారండీ
ఒడిదుడుకుల బ్రతుకులతో నూగిసలాడే
బడుగుజీవులమని బాధపడుదురండీ
చెడునడతలు మానరని ఛీకొట్టరండీ
అడుగడుగున మనబాగున కాత్రపడుదురండీ
ఘోరభవారణ్యమందు చోరుడు మారుని నమ్మి
దారితప్పు మనపైన దయచూపుదు రండీ
తీరైన ధోరణికి త్రిప్పజూతురండీ
పేరుపేరున నిరతము పిలుచుచుందు రండీ
మంచిచెడులు తెలుపువారు మనకు వేరెవరండీ
అంచితమగు వారి మాట లాలకించండీ
ఇంచుక యోచించిరేని యిట్టే బోధపడునండీ
మంచిబిడ్డ లగుటయే మనకు మంచిదండీ
జేజేలు జేజేలు శ్రీరామచంద్ర నీకు
జేజేలు జేజేలు శ్రీరామచంద్ర నీకు
జేజేలు త్రిభువనసుస్థితికారక
పాలితాఖిలలోకజాల సద్గుణవిశాల
కాలకాల నుతశీల జేజేలు
కాలావధిలేని నీ ఘనమైన చరిత స
ఛ్ఛీలము గరపు మాకు జేజేలు
రావణాధ్యసురనాశ రామ రాజకులవిభూష
జీవలోక పరితోష జేజేలు
దేవదేవ మహోదార భావాంబర సంచార
సేవకజనసంపోష జేజేలు
ఆజానుబాహుడా అరవిందనేత్రుడా
శ్రీజానకీవిభుడ జేజేలు
రాజితసత్కీర్తి నిన్ను రోజంత పనవిపనవి
నాజిహ్వ మురియురా జేజేలు
15, ఫిబ్రవరి 2018, గురువారం
హరిపై కీర్తన లల్లుట తప్ప
హరిపై కీర్తన లల్లుట తప్ప
మరి వేరే పని మనకెందులకు
శ్రీహరి సద్గుణచింతన తప్ప
ఐహికచింతన లెందుకు మనకు
ఊహలనైన శ్రీహరి తప్ప
మోహబుధ్ధుల పొందెందులకు
పొరి హరిభక్తుల పొరుగే తప్ప
పరపురుషులతో పాటెందులకు
మురహరి సన్నిథి మురియుట తప్ప
మరి యొక కోరిక మనకెందులకు
నరవరుడగు రఘునాథుని తప్ప
పరులను పొగడే పని యెందులకు
హరిభక్తులమై యలరుట తప్ప
మరియొక బ్రతుకు మనకెందులకు
మరి వేరే పని మనకెందులకు
శ్రీహరి సద్గుణచింతన తప్ప
ఐహికచింతన లెందుకు మనకు
ఊహలనైన శ్రీహరి తప్ప
మోహబుధ్ధుల పొందెందులకు
పొరి హరిభక్తుల పొరుగే తప్ప
పరపురుషులతో పాటెందులకు
మురహరి సన్నిథి మురియుట తప్ప
మరి యొక కోరిక మనకెందులకు
పరులను పొగడే పని యెందులకు
హరిభక్తులమై యలరుట తప్ప
మరియొక బ్రతుకు మనకెందులకు
రామభక్తుని కోర్కె రామబంటు తీర్చును
రామభక్తుని కోర్కె రామబంటు తీర్చు
మోమాటమేల నీ వేమడిగిన నిచ్చు
మధురానుభవసంపద లడుగ వచ్చు
నిధినిక్షేపములను నీవడుగ వచ్చు
విధినెదిరించ ధీవిభవమడుగ వచ్చు
విధిగా హనుమన్న వేమారు లవియిచ్చు
హనుమన్న యీయలేని దవని పైన లేదు
కనుక రామభక్తుడ మనవి చేసుకోవయ్య
తనివిదీర రాముని తలచి మరియు వేళల
పనవి లౌకికములను పలుచన కానేల
ఒక్క మోక్షము తక్క చక్కగా సర్వమును
నిక్కువముగ తానిచ్చు నీకు హనుమన్న
చక్కగా శ్రీరామచంద్రమూర్తి యొక్కడె
అక్కజంబైన యా మోక్ష మందిచు నీకు
ఎంత చిన్నమంత్రమౌ ఎంత సులభమంత్రమో
ఎంత చిన్నమంత్రమౌ ఎంత సులభమంత్రమో
ఎంత మంచిమంత్రమో ఎంత గొప్పమంత్రమో
అంతులేని సుఖశాంతుల కాకర మగు మంత్రము
చింతలేని జీవనమును చేకూర్చే మంత్రము
పంతగించి కలిచెడుగుల కంతు జూచు మంత్రము
అంతకంతకు మహిమ నతిశయించు మంత్రము
మదమోహకామములను మట్టుపెట్టు మంత్రము
హృదయము నిర్మలముచేయు నింపైన మంత్రము
చదువు లన్నింటి కదే సారమైన మంత్రము
ముదమార కొలిచితే మోక్షమిచ్చు మంత్రము
అదే యోగివరులు కొలచు నట్టి దివ్యమంత్రము
అదే యుపాసించదగిన యందమైన మంత్రము
అదే రామభక్త జనుల కన్నము పానీయము
అదే రామమంత్రము - అదే రామమంత్రము
14, ఫిబ్రవరి 2018, బుధవారం
నీ కృపయే చాలును
నీ కృపయే చాలును నీరేజదళ నేత్ర
నాకైన నలువకైన నారాయణ రామ
పాపకులభూషణుని పడకజేసుకొంటివి
పాపాత్ముని నన్ను నీ భక్తునిగ గొంటివి
తాపోపశమనక్రియాదక్షమైన నీ కరుణ
నాపైన కురియనీ నారాయణా రామ
కుక్షిస్థాఖిలభువన పక్షిరాజవాహన
అక్షీణప్రేమామృత మందించు తండ్రి
అక్షరపరబ్రహ్మ మగు నీవు కాక
రక్షకు లింకెవరు నాకు రామనారాయణ
పలుజన్మ లెత్తితిని బాధలెన్నొ పడితిని
తెలివి తెచ్చుకొంటిని తెలిసి నిను చేరితిని
కలిగిన యీ తెలివిడిని కరగిపోనీయక
సలుపవే రక్ష రామచంద్ర నారాయణ
శివశివ శివశివ అన్నావా
శివశివ శివశివ అన్నావా చేతులు రెండూ జోడించావా
భువనేశ్వర ఓ భవనాశంకర పాహి పాహి అని అన్నావా
శంకరకైంకర్యమునకు మనసును సంతోషముగా నిచ్చావా
వంకరటింకర బుధ్ధుల హేతువాదుల మాటలు వినకుండ
శంకలన్నిటిని దూరము పెట్టి శంకరజపము చేసావా
శంకరజపము చేసావా జన్మానికి ఒక శివరాత్రి యని
జన్మానికి శివరాత్రియని సంబరముగ శివలీలలను
తన్మయత్వమున చిత్తములో తలచితలచి పులకించావా
మన్మథగురుడు జపియించే శివమంత్రము మనసున నించావా
తన్మే మనః శివసంకల్పమస్తని తలపున హరుని నించావా
రాముడు కొలిచిన శివదేవుని ఆరాధనమున తరియించావా
ఆముక్కంటికి పరమప్రీతిగా ఆత్మార్పణము చేసావా
కామవిరోధికి ప్రీతికరముగా కామాదులను విడచావా
ఏమయ్యా ఇంకేమయ్యా శివరాముల కృపనీ కబ్బెనయా
13, ఫిబ్రవరి 2018, మంగళవారం
జీవన్ముక్తి నారాయణకృపచే నగును
ఇది భగవంతుని యాజ్ఞ యిది శ్రీరాముని యాజ్ఞ
హృదయము నిర్మలమైతే కాని యీయబడదు ముక్తి
జీవభావమును చెందిన చిత్కళ జీవభావమును విడువకను
యేవిధమైన ప్రయత్నములైన నీషణ్మాత్రము ఫలించవు
సావాసము యీ ప్రకృతితో కొనసాగుచు నుండెడు నన్నాళ్ళు
జీవుడు సర్వకళామయుడైన దేవుని తత్త్వము గ్రహించడు
దుర్భరమగు యీ ప్రకృతిమాయకు దొఱకి భ్రమించే జీవునకు
గర్భనరకముల మాటిమాటికి గడుపక తీరనిదై యుండు
నర్భకు లట్టి జీవులందరకు హరియొక్కడె దిక్కై జ్ఞానా
విర్భావమునకు దారిచూపును వేరొక దిక్కనగ లేదు
తిరిగి తిరిగి యీ పృకృతిలోన తెలివి కలిగిన జీవునకు
పరిణతమై వైరాగ్యము జీవభావము దగ్ధబీజమగు
పరమనిర్మలహృదయుడు వాడు పరబ్రహ్మమే తానగును
నరులారా యీ జీవన్ముక్తి నారాయణకృపచే నగును
వెఱచి పఱచునె రామవిభుని సేవకుడు
తఱచై శ్రీరామకృప తలగాచి యుండగ
వెఱచి పఱచునె రామవిభుని సేవకుడు
నిదురనైనను వాడు నీరేజనేత్రుని
సదమలనామమే జపియింప
హృదయాళువగువాని హృదయాలయంబున
విదితంబుగ రామవిభు డుండగను
సాకేతవిభు ధర్మసామ్రాజ్యమై యొప్పి
లోకముండుట బుధ్ధిలో నెఱిగి
శోకమోహరహిత సుస్థితి గొనియుండ
చేకొన రఘుపతి చిరునగవులను
కలి టక్కులేమియు వానికడ పనిచేయవు
కలవరపఱుచ లేడు కాలుడును
బలవంతులైన దుర్ఫలులైన హరికృప
కలిగియుండిరేని కలుగ దే భయమును
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంటేను
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంటేను చిత్తశాంతి చేకూరేను ఆ
శ్రీరామ చంద్రుని దయచేత నీ చింతలన్ని దూరమయ్యేను
ఆ రామచంద్రుని దయ యుంటే అందరాని ఫల మేముంది
ఆ రామచంద్రుని చల్లని నీడ అందిచని సుఖ మేముంది
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంటూ చిందులు వేసే భక్తికి
ఔరర ముల్లోకాల లోపల ఒదిగి యుండని దేముంది
శ్రీరాముని గాథ చెవులార వింటే చెదరని పాప మేముంది
శ్రీరాముని పూజ చేతులారగ చేయ చెందని పుణ్య మేముంది
శ్రీరాముని నిత్యసంస్మరణంబున జీవితమున కొద వేముంది
శ్రీరాముని కన్య మెఱుగని వానికి చేరువగా మోక్షమే యుంది
శ్రీరామ శ్రీరామ యనువారంతా శ్రీరామ సేవకు లైనటులే
శ్రీరామభక్తుల సేవించు వారలు శ్రీరామ సేవకు లైనటులే
శ్రీరామపూజను తిలకించు వారెల్ల శ్రీరామ సేవకు డైనటులే
శ్రీరామసేవకు లగువారు యముని ఛీకొట్టి పొమ్మని యన్నటులే
12, ఫిబ్రవరి 2018, సోమవారం
రాజకీయ నాయకుల్లో రకాలు.
ఒకసారి బుధ్ధభగవానుడి దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది.
ఆమె వచ్చింది అనటం కన్నా ఆమె బంధువులు ఆమెను నయానో భయానో ఒప్పించి తీసుకొని వచ్చారని చెప్పటం సబబుగా ఉంటుంది.
బుధ్ధుడి సముఖం లభించింది.
ఏమిటి విషయం అన్నాడు బుధ్ధుడు వారు తననుండి ఏదో ఆశిస్తున్నారని గ్రహించి.
స్వామీ, ఈ అమ్మాయికి కొంచెం మంచి ఉపదేశం చేయండి. ఈమె పెడసరపు ప్రవర్తనతో అందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు నిత్యమూ. ఇరుగుపొరుగుతో సఖ్యతకు ఆసక్తి చూపదు. బంధువులకు గౌరవమర్యాదలు ఇవ్వదు. ఇంక భర్త ఐతే ఆతడి యాతన చెప్పనలవి కాదు - అన్నింటికీ ఎడ్డెమంటే తెడ్డెమనే. అసలు అతడు నోరు ఎత్తితే చాలు దులపరింపులూ చీదరింపులూ ను. మీరు ఈమెకు కాస్త మంచిబుధ్ధి ఉపదేశిస్తారని మీ దగ్గరకు ఎంతో ఆశతో వచ్చాం అన్నారు ఆమెను తీసుకొని వచ్చిన పెద్దమనుషులు.
బుద్దుడు కొంచెం సేపు మౌనంగా ఉన్నాడు.
చివరకు ఇలా అన్నాడు.
అమ్మాయీ, పురుషుడికి భార్యలు ఏడు రకాలుగా ఉంటారు.
ఒకామె తల్లి వంటిది, అనునిత్యమూ కంటి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలని తాపత్రయపడుతూ ఉంటుంది. తాను లేకుంటే ఏమైపోతాడో అని ఆదుర్దాపడుతూ ఉంటుంది.
ఒకామె సోదరి వంటిది, ఎంతో ఆత్మీయతతో అతడికి అవసరమైన ప్రేమాభిమానాలు అందిస్తూ అతడి అభ్యున్నతిని కోరుతూ ఉంటుంది.
మరొకామె స్నేహితురాలి వంటిది, అతడిని అభిమానిస్తూ అవసరమైన సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటుంది.
ఒకామె పరిచయస్థురాలి వంటిది, అవసరార్థం మాత్రమే అతడి ప్రక్కన ఉంటుంది కాని తన జీవితం తనది అతడి జీవితం అతడిదిగా అంటీ ముట్టనట్లు ఉంటుందంతే.
ఒకామె దొంగ వంటిది, అతడికి ఉన్న సమస్తమూ తనకి ఎలా చెందేలా చేసుకోవాలా అన్న తపన తప్ప మరేమీ ఉందదు. అవసరమైన పక్షంలో అతడిని మోసగించి ఐనా తన కోర్కెలు తీర్చుకోవాలని తాపత్రయ పడుతూ ఉంటుంది.
ఇంకొకామె హంతకురాలి వంటిది, తన విలాసాలు తనవే కాని భర్త అడ్డు రావటాని వీల్లేదు. వచ్చాడా చచ్చాడే అన్నమాట,
ఇంకా ఒకతె దాసి వంటిది. ఈమె భర్తను ఉన్నతస్థానంలో నిలపటానికి నిత్యం తపిస్తూ ఉంటుంది. తనగౌరవమర్యాదలు అతడి గౌరవమర్యాదలతో ముడిపడి ఉన్నాయని భావించి సర్వాత్మనా అతడికి అవరమైన సేవలను అందిస్తూ ఆతని జీవితానికి చుక్కానిలా ఉంటుంది.
ఇప్పుడు ఆలోచించుకొని చెప్పు. నీవు నీ భర్తకు ఎటువంటి భార్యగా ఉండాలనుకుంటున్నావు అన్నాడు బుధ్ధుడు.
బుధ్ధభగవానుడి ఉపదేశానికి ఆమె వినయంగా బదులు చెప్పింది.
స్వామీ, ఇకనుండి నేను నా భర్తకు దాసిగా ఉండాలనుకుంటున్నాను అని.
ఈ కథ ఎందుకు చెప్పుకున్నామంటే ప్రస్తుత కాలంలో మనరాజకీయనాయకుల వ్యవహారశైలి చూస్తూ పోతుంటే వారిలో ఉన్న రకాలను గురించి చెప్పుకోవటం అవసరం అనిపించి.
రాజకీయనాయకుల్లో కూడా ఏడు రకాల వాళ్ళున్నారు. ఒకరకం ప్రభువులు, ఒకరకం మంత్రులు, ఒకరకం సేనానులు, కొందరు సెలెబ్రిటీలు, ఒకరకం వారు వారసులు, ఒకరకం ఒకరకం రాజసేవకులు, ఒకరకం ప్రజాసేవకులు.
ప్రభువుల రకం రాజకీయులు తాము ప్రజల నెత్తిన రాజులమన్న అహంతో ఉంటారు. ఓట్లేసి గెలిపించిన జనం అంతా తాము వేలు ఎలా ఆడిస్తే తదనుగుణంగా ఆడవలససి అర్భకులే కాని వాళ్ళకు తమను ప్రశ్నించే హక్కు ఎక్కడిదీ అని భావిస్తూ ఉంటారు.
మంత్రుల రకం రాజకీయులు ఏవేవో వ్యూహాలు పన్నుతూ, అవన్నీ తమ స్వార్థం కోసమే ఐనా అంతా ప్రజలమంచికే అని నిత్యం నమ్మబలుకుతూ తమలో తాము గుడుసుళ్ళుపడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒరిగించేది ఏమీ లేదని ఎవరన్నా జనంలో వాళ్ళంట్టే వాళ్ళంతా ప్రగతిద్రోహులూ ప్రజాద్రోహులూ అంటూ అందరినీ నమ్మించాలని మేతావుల్లాగా ఏవోవే చెబుతుంటారు.
సేనాపతులరకం వాళ్ళు అన్నింటికీ రణోత్సాహంతో రంకెలు వేస్తుంటారు. ప్రభువులూ మంత్రులూ వాళ్ళను చక్కగా వాడుకుంటూ ఉంటారు. వీళ్ళు సాధించి చచ్చేది ఆట్టే లేకపోయినా జనబహుళ్యంలో గందరగోళం మటుక్కు చక్కగా సృష్టించగలరు.
సెలెబ్రిటీలు అని ఒక తమషాజాతి మనుష్యులు కూడా రాజకీయులుగా వేషాలు వేస్తూ ఉంటారు. ఏదో ఒకరంగంలో పేరు వచ్చినంత మాత్రాన రాజకీయులు కావటం కుదరదు కాని జనం తమ వెంట పడేలా హంగామా చేయగల చాకచక్యం ఉన్నవాళ్ళుంటారు. ఒక పెద్ద తెరతారకున్న అసంఖ్యాక అబిమానజనం వాళ్ళకు రాజకీయబల ఇవ్వవచ్చును. ఒకపెద్ద క్రీడాకారుడిని ఉన్న ప్రజాభిమానాన్ని ప్రభువులో మంత్రులో రాజకీయవేషం వేయటానికి ఉపయోగించ వచ్చును. తమాషా ఏమిటంటే రాజకీయాల గురించి కాని నిజంగా ప్రజాపాలన ప్రజాశ్రేయస్సు వంటి వాటి గురించి కాని ఓనమాలు కూడా రాకపోయినా ఈ సెలెబ్రిటీలు రాజకీయరంగప్రవేశం చేసి చిందులు వేస్తూంటారు. ఖర్మ ఖర్మ.
వారసులు అని ఒక జాతి రాజకీయులు ఉంటారు. వీళ్ళు సెలెబ్రిటీల్లో ఒక ప్రతేకమైన రకం. వీళ్ళకు కుటుంబ వారసత్వంగా రాజకీయ నాయకత్వం ఆటోమేటిగ్గా బదిలీ ఐపోతుంది. వీళ్ళలో పరమశుంఠలైనా సరే తప్పనిసరిగా అన్నలూ, మహానాయకులూ వంటి బిరుదలతోనే జనం నెత్తిన కూర్చుంటారు.
రాజసేవకులు సేనానులకన్న కొంచెంగా తక్కువ. వీళ్ళు సేనానుల వెనుక తిరగటం ద్వారా సేనానులో మంత్రులో ఐపోదాం అని కలలు కంటూ కాలక్షేపం చేస్తుంటారు. ఈ సంతలో చింతకాయల్ని పైతరగతి రాజకీయులు పట్టించుకోరు కాని పట్టించుకుంటున్నట్లు నటిస్తారు కాని ఆమాత్రానికే వీళ్ళంతా ఆనందంతో వాళ్ళకు అరవచాకిరీ చేస్తూ పోతుంటారు. వీళ్ళవల్ల ఎవ్వరికీ ఏమీ ప్రయోజనం లేదు. ఇంక ప్రజలకేం ఒరిగిస్తారు. తరచూ జనం వీళ్ళని జోకర్లుగా లెక్కించుతూ ఉంటారరు.
ప్రజాసేవకులూ ఉంటారు రాజకీయనాయకుల్లో. ఐతే వీళ్ళని కాగడా వేసి వెదుక్కోవలసిందే. ఇలాంటి వాళ్ళకు మిగతా రాజకీయులు పుట్టగతులు లేకుండా చేస్తూ ఉంటారు. ఐనా వీళ్ళల్లో కొందరు మొండిగా జనంలో ఉండి జనం కోసం పోరాడుతూనే ఉంటారు వ్యవస్థతో అవస్థలు పడుతూనే. పాపం వీళ్ళలో మితవాదుల్ని మేధావులనీ అతివాదుల్ని తీవ్రవాదులనీ మిగతా రాజకీయులు ప్రక్కకు తోసేస్తుంటే కాలం మాత్రం వీలైన చోట్ల వీళ్ళకి న్యాయం చేస్తుంది లెండి.
ఏ రాజకీయ నాయకుణ్ణీ మీరు వీటిలో ఏరకం అని అడక్కండి. అందరూ ప్రజాసేవకులమనే అంటారు.
బుధ్ధుడు ఒకమ్మాయికి విడమరచి చెప్పి నువ్వెలా ఉంటావూ అంటే ఆమె సరైన విధానం ఎంచుకున్నది. బాగుంది. మన రాజకీయనాయకులకు బుధ్ధి చెప్పగల వాడు ఎవరూ ఉన్నట్లు లేదు.
2, ఫిబ్రవరి 2018, శుక్రవారం
పాహిరామప్రభో: కూడని దారుల బోవు చుండి నీ పంచకు నెట్లు చేరితిని
ఉ. మంచిది నీవు దేవుడవు మానవమాత్రుడ నల్పసత్వుడన్
కొంచెపు వాడ నేను మరి కూడని దారుల బోవు చుండి నీ
పంచకు నెట్లు చేరితి నవశ్యము నీ కడగంటి చూపు న
న్నించుక సోకి కాక రమణీయగుణార్ణవ రామ రాఘవా
ఏ ఏ గుణాల యందు మనస్సు నిత్యం రమిస్తూ వాటి తత్త్వాన్ని ఒంట బట్టించుకొంటే జన్మ ధన్యమౌతుందో అట్టి గుణాలు రమణీయాలు అనబడతాయి.
అలాంటి గుణాలకు ఓ రామచంద్రప్రభూ నువ్వు నిలయానివి.
పరమస్వాదుజలసంపూర్ణాలైన నదులన్నీ వచ్చి సముద్రంలో కలుస్తాయి.
పరమమైన సద్గుణాలన్నీ వచ్చి పురుషోత్తముడవైన నీలో సంగమించాయి.
నువ్వే గుణార్ణవుడవు.
అన్ని గుణాల్లోనూ దయాగుణం అన్నది ఉందే అది మహా దొడ్డది.
మంచి వాళ్ళు సాటి మంచివాళ్లను గుర్తించి ఆదరించటంలో విశేషం ఏమి లేదు. అది లోకసహజమే.
ధనవంతులు సాటిధనవంతులతో స్నేహం చేయటంలో విడ్డూరం ఏమీ ఉండదు. వాళ్ళంతా ఎలాగూ ఒక జట్టే అని లోకానికి తెలుసును.
విద్యావంతులు సాటి విద్యావంతులను ఆదరించటం లోకసహజమే.
గొప్పవాళ్ళు సాటి గొప్పవాళ్లతో సఖ్యంగా ఉండటం నిత్యం చూసే వ్యవహారమే,
యోగ్యులను గురించి ఆదరించటం సాధుపుంగవులు తప్పక చేయవలసినదే. చేసేదే.
సత్కార్యాచరణ కలవాళ్ళను లోకంలో సత్పురుషులూ సత్కార్యనిరతులూ నెత్తిన పెట్టుకోవటంలో వింత లేదు కదా.
కానీ, నేను అన్ని విధాలా అల్పుడను.
విద్యావంతుడనా, సత్కార్యనిరతుడనా మరే కారణంగా నైనా లోకంలో మంచివాడు అనిపించుకుందుకు కొంచెమైనా అర్హత కలవాడనా? కాదే!
మరి నన్ను ఎవరాదరిస్తారు. ఐనా ఎందుకు ఆదరిస్తారు? ఏమి చూసి ఆదరించాలీ మరి?
గౌరవం పొందటానికి అర్హతకలవాళ్ళు ఏదో విధంగా మంచిదారుల్లో నడుస్తూ సాటి మంచివాళ్ళ ఆదరం పొందగలరు కాని నాబోటి వాడు ఏమి గౌరవం పొందగలడూ అని!
నేను పోయే దంతా తప్పుడు దారుల్లోనే అని నాకే తెలిసి సిగ్గు కలుగుతూ ఉంటుందే.
ఇతరులకు ఎంత చీదరగా ఉంటుందీ!
ఐనా సరే ఆశ్చర్యాల్లో ఆశ్చర్యం ఒకటి గమనించాను.
నీ పాదాలవద్ద చోటు అడిగేందుకు అస్సలు అర్హత అన్నదే లేని వాణ్ణి నేను. ఏముఖం పెట్టుకొని అడగగలను!
అదీకాక ఎప్పుడైనా లోగడ అలా నీ వద్ద కొంచెం ప్రాధేయపడాలన్న ఊహే కలగనే లేదే మూర్ఖుడనైన నాకు.
నా బుధ్ధి యొక్క సత్త్వం ఎంత అల్పమో తెలుస్తూనే ఉంది కదా.
నా కన్నా కొంచెపు వాడు మరొక డుండడేమో.
ఐనా సరే నేను నీ పంచను చేరానే - నాకే తెలియకుండా!
మహామహులు దేవదానవోత్తములూ, పరమర్షులూ నిత్యం ధ్యానించి ఏ పదం కోరి తపిస్తున్నారో అది నీవు నాబోటి వాడికి ఎలా అనుగ్రహిస్తున్నావో బోధపడకుండా ఉంది.
కొంచెం కొంచెంగా అర్థమైనది ఇది. అన్ని గుణాల్లోనూ దయాగుణం అన్నది ఉందే అది మహా దొడ్డది.
రమ్యగుణార్ణవుడవు నీవు.
నీ దయాగుణం ఇంతింతని చెప్పతరమా.
నా యోగ్యతను అదేలే నా అయోగ్యతను లెక్కించకుండా నీ దయాదృష్టి కొంచెం నావైపు రానిచ్చావు.
ఇంకేం నన్ను నీవాడిని చేసుకున్నావు.
నీవు దేవుడవు కదా.
నీకు అసాధ్యం అంటూ ఉంటుందా.
పరమ మూర్ఖుణ్ణీ మహా అయోగ్యుణ్ణీ ఇప్పుడు పూర్తిగా నీ మార్గంలోనికి వచ్చేసాను. అనందమే అనందం.
ఎలా నీపంచన చేరానా అన్నది అటుంచి నీ పంచన ఉన్నానన్నదే ముఖ్యం కదా.
ఇంక ఎక్కడికీ పోను.
పాహి రామప్రభో.
దయుంచు.
1, ఫిబ్రవరి 2018, గురువారం
పాహిరామప్రభో శ్రీరఘురామ నాదయిన చిత్తము నిన్ను భజించు
ఉ. శ్రీరఘురామ నాదయిన చిత్తము నిన్ను భజించు నన్యులన్
చేరి భజించు తప్పెపుడు చేయదు చేయదు చేయదెన్నడున్
తామసులైన మానవుల దాల్చగ నేల మనంబునన్ పరం
ధామ నిలింపులైన తమ దాసులె గావున నిన్నె గొల్చెదన్
పాహి రామప్రభో.
నీవు జగద్విభుడవు.
నీకు సమానులైన వారూ లేరు, నీకంటే అధికులూ లేరు.
అందుచేత నా చిత్తం ఉందే అది నిరంతరం నిన్నే భజించుతూ ఉంటుంది.
దానికి బుధ్ధి ఉంది కాబట్టి, వేరే ఎవ్వరినీ భజించే పొరపాటు పనిని ఎన్నడూ చేయదు.
చేయదు. చేయదు కాక చేయదు. చేయదంటే చేయదయ్యా.
ఈ లోకంలో అందరూ తమతమ అవసరాల కోసం ఎవరెవర్నో భజిస్తూ ఉంటారు కదా. నువ్వూ ఈలోకంలో పడి ఉన్నవాడివే కదా అనవచ్చును. దానికేం.
మా మనుష్యుల సంగతి అంటావా మాలో అందరూ తామసబుధ్ధి కలవారు కదా.
నిత్యం నేనూ నావాళ్ళూ అనుకుంటూ చరించటం అనే ఈ తామసబుధ్ధి కలవాళ్ళను సేవించటం ఏమిటీ దరిద్రం. వాళ్ళు ఏమిస్తారూ వాళ్ళిచ్చేది ఎందుకు పనికివస్తుందీ. వాటిల్లో ఏమి కూడా పట్టుకొని పోతానూ అని.
నిత్యం పుడుతూ గిడితూ తామసికమైన జీవితాలు గడిపే అశాశ్వతులైన మానవులు ఇచ్చేది ఏదైనా అశాశ్వతమే కదా. అటువంటి స్వల్పాలకోసం లబలబలు ఎందుకు నాకు. వద్దనే వద్దు మహాప్రభో. వద్దు కాక వద్దు.
ఇకపోతే లోకంలో అందరూ ఎవరెవరో దేవతలను ఆశ్రయించి వాళ్ళకు పూజాపునస్కారాలు చేసి మంచిమంచి ప్రతిఫలాలు పొందుతూ వాళ్ళకు ఊడిగం చేస్తున్నారు కదా, దేవతలిచ్చేవి మానవులిచ్చే వాటికన్నా శ్రేష్ఠమైనవే కదా అనవచ్చును. అవును నిజమే.
ఐనా ఆ దేవతలు మాత్రం శాశ్వతమైనది ఏదీ ఇవ్వలేరు కదా. మోక్షాన్ని వాళ్ళు ఇవ్వగలరా చెప్పు మరి.
ఈ ప్రపంచానికి నువ్వే ప్రభువుగా ఉన్నావు.
నువ్వే మోక్షం ఇవ్వగల వాడవు.
పరంధాముడవైన నీకు ఈ దేవతలంతా సేవకులే.
నేనూ నీ సేవకుణ్ణే - వాళ్ళూ నీ సేవకులే.
మరింకా వాళ్ళ గొప్ప ఏమీ లేదు.
వాళ్ళకు ఏదైనా గొప్పదనం ఉందీ అనుకుంటే ఆ గొప్పదనం వలన ఏమన్నా ప్రయోజనం ఎవరికైనా ఉంటే గింటే వారికి ఆ దేవతల గొప్పదనం కనబడవచ్చును. నిర్థారణగా చూస్తే మాత్రం ఏమీ లేదు. ఈ చరాచరసృష్టిలో నువ్వు తప్ప అందరూ సమానమేను దాసత్వంలో.
అందుకనే అందరికీ అన్నివేళలా ప్రభువు వైన శ్రీరామచంద్రుడా, నిన్నే నిత్యం భజిస్తున్నాను.
పాహి పాహి రామప్రభో. దయుంచు మరి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)