21, ఫిబ్రవరి 2018, బుధవారం

ఈ రాముడే దైవ మెల్లవారికి


ఈ రాముడే దైవ మెల్లవారికి
చేరి కొలువగా రాదు వే రెవరిని

తొలుత ప్రతిజీవుడును పలుతిత్తుల దూరి
యలసి సొలసి తుదకు పొందు నయ్య నరదేహము
కలుగు నొక కొంత స్పృహ కష్టపెట్టు మాయ
తొలగించు కొనుటకై తోచు దేవుని వేడ

ప్రకృతి వీని వెడల నీక ప్రలోభములు చూపు
వికసించు వీని బుధ్ధి రకరకముల దైవములు
ప్రకటించు వరముల పాలుచేయ చూచు
ముకుతాడు వేయు దైవములను వేడరాదు

సూటిగా స్వస్వరూప జ్ఞానమిచ్చు రాముని
మేటి దైవరాయని గాటముగా నమ్మిన
చాటుపడు ప్రకృతిమాయ సందేహము లేదు
చేటుకాలమంతరించి సిధ్ధించు మోక్షము

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.