14, ఫిబ్రవరి 2018, బుధవారం

శివశివ శివశివ అన్నావా


శివశివ శివశివ అన్నావా  చేతులు రెండూ జోడించావా
భువనేశ్వర ఓ భవనాశంకర పాహి పాహి అని అన్నావా

శంకరకైంకర్యమునకు మనసును సంతోషముగా నిచ్చావా
వంకరటింకర బుధ్ధుల హేతువాదుల మాటలు వినకుండ
శంకలన్నిటిని దూరము పెట్టి శంకరజపము చేసావా
శంకరజపము చేసావా జన్మానికి ఒక శివరాత్రి యని

జన్మానికి శివరాత్రియని సంబరముగ శివలీలలను
తన్మయత్వమున చిత్తములో తలచితలచి పులకించావా
మన్మథగురుడు జపియించే శివమంత్రము మనసున నించావా
తన్మే మనః శివసంకల్పమస్తని తలపున హరుని నించావా

రాముడు కొలిచిన శివదేవుని ఆరాధనమున తరియించావా
ఆముక్కంటికి పరమప్రీతిగా ఆత్మార్పణము చేసావా
కామవిరోధికి ప్రీతికరముగా కామాదులను విడచావా
ఏమయ్యా ఇంకేమయ్యా శివరాముల కృపనీ కబ్బెనయా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.