23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

హాయిగా శ్రీరామభజన చేయగ రారే


హాయిగా శ్రీరామభజన చేయగ రారే
ఓ యమ్మలక్కలార ఓ అయ్యలారా

మీకు నాకు నందరకును మేలు గూర్చువాడు
సాకేతపతి కాక లోకమం దింకెవ్వడు
శ్రీకరుడును శుభకరుడును శ్రీరాము డొక్కడే
కాక వేరొక్క డనగ కలడా యెందైన గాని

దేవతలు సేవించు నట్టి దివ్యమైన నామము
జీవితము నిలబెట్టు నట్టి క్షేమకరమౌ నామము
భావమందు నిలిపి మీరు భజన గట్టిగ చేయరే
శ్రీవిభుని కరుణ మీరు చేకొని తరియించరే

ధ్యేయమైతే మీకు మోక్షము తెలియుడు శ్రీరాముడే
యీయ గలడయ్య దాని నితరులు లీయలేరు
తీయని శ్రీరామనామము దీక్షగైకొని పాడరే
పాయని ధృఢభక్తిగలిగి భజన మీరు చేయరే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.