17, ఫిబ్రవరి 2018, శనివారం

మన సీతారాము లెంతో మంచివారండీ


అనయము మన వెన్ను కాచు అమ్మానాన్నలండీ
మన సీతారాము లెంతో మంచివారండీ

ఒడిదుడుకుల బ్రతుకులతో నూగిసలాడే
బడుగుజీవులమని బాధపడుదురండీ
చెడునడతలు మానరని ఛీకొట్టరండీ
అడుగడుగున మనబాగున కాత్రపడుదురండీ

ఘోరభవారణ్యమందు చోరుడు మారుని నమ్మి
దారితప్పు మనపైన దయచూపుదు రండీ
తీరైన ధోరణికి త్రిప్పజూతురండీ
పేరుపేరున నిరతము పిలుచుచుందు రండీ

మంచిచెడులు తెలుపువారు మనకు వేరెవరండీ
అంచితమగు వారి మాట లాలకించండీ
ఇంచుక యోచించిరేని యిట్టే బోధపడునండీ
మంచిబిడ్డ లగుటయే మనకు మంచిదండీ