23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

రామభక్తి కుదరక రాదు మోక్షము


రామచరిత మెఱుగక రామవిభుని కొలువక
రామభక్తి కుదరక రాదు మోక్షము

కామదాసులకు నెపుడు కష్టములే కలుగును
భూమిమీద మరలమరల పుట్టిచావ వలయును
స్వామి యొకడున్నాడను జ్ఞానము లేకుండును
ఏమయ్యా యిట్టి బ్రతుకు లేల కోరవలయును

రామభక్తి కుదిరెనా రావు వారి కెట్టి వ్యధలును
భూమిమీద మరలమరల పుట్టిచచ్చు పనిలేదు
స్వామిదయ చేత మోక్షసామ్రాజ్య మబ్భును
ఏమయ్యా యెవరికైన నింకేమి కావలయును

కామిత మా మోక్షమని గట్టిగా నమ్మినచో
నీమనసును రామునిపై నిలిపి యుంచవలయును
స్వామి భక్తులందరకు సమకూరును మోక్షము
ఏమయ్యా యింతకన్న నేమి చెప్ప వలయును


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.