15, ఫిబ్రవరి 2018, గురువారం

రామభక్తుని కోర్కె రామబంటు తీర్చును


రామభక్తుని కోర్కె రామబంటు తీర్చు
మోమాటమేల నీ వేమడిగిన నిచ్చు

మధురానుభవసంపద లడుగ వచ్చు
నిధినిక్షేపములను నీవడుగ వచ్చు
విధినెదిరించ ధీవిభవమడుగ వచ్చు
విధిగా హనుమన్న వేమారు లవియిచ్చు

హనుమన్న యీయలేని దవని పైన లేదు
కనుక రామభక్తుడ మనవి చేసుకోవయ్య
తనివిదీర రాముని తలచి మరియు వేళల
పనవి లౌకికములను పలుచన కానేల

ఒక్క మోక్షము తక్క చక్కగా సర్వమును
నిక్కువముగ తానిచ్చు నీకు హనుమన్న
చక్కగా శ్రీరామచంద్రమూర్తి యొక్కడె
అక్కజంబైన యా మోక్ష మందిచు నీకు