13, ఫిబ్రవరి 2018, మంగళవారం
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంటేను
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంటేను చిత్తశాంతి చేకూరేను ఆ
శ్రీరామ చంద్రుని దయచేత నీ చింతలన్ని దూరమయ్యేను
ఆ రామచంద్రుని దయ యుంటే అందరాని ఫల మేముంది
ఆ రామచంద్రుని చల్లని నీడ అందిచని సుఖ మేముంది
శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంటూ చిందులు వేసే భక్తికి
ఔరర ముల్లోకాల లోపల ఒదిగి యుండని దేముంది
శ్రీరాముని గాథ చెవులార వింటే చెదరని పాప మేముంది
శ్రీరాముని పూజ చేతులారగ చేయ చెందని పుణ్య మేముంది
శ్రీరాముని నిత్యసంస్మరణంబున జీవితమున కొద వేముంది
శ్రీరాముని కన్య మెఱుగని వానికి చేరువగా మోక్షమే యుంది
శ్రీరామ శ్రీరామ యనువారంతా శ్రీరామ సేవకు లైనటులే
శ్రీరామభక్తుల సేవించు వారలు శ్రీరామ సేవకు లైనటులే
శ్రీరామపూజను తిలకించు వారెల్ల శ్రీరామ సేవకు డైనటులే
శ్రీరామసేవకు లగువారు యముని ఛీకొట్టి పొమ్మని యన్నటులే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.