13, ఫిబ్రవరి 2018, మంగళవారం

వెఱచి పఱచునె రామవిభుని సేవకుడు


తఱచై శ్రీరామకృప తలగాచి యుండగ
వెఱచి పఱచునె రామవిభుని సేవకుడు

నిదురనైనను వాడు నీరేజనేత్రుని
సదమలనామమే జపియింప
హృదయాళువగువాని హృదయాలయంబున
విదితంబుగ రామవిభు డుండగను

సాకేతవిభు ధర్మసామ్రాజ్యమై యొప్పి
లోకముండుట బుధ్ధిలో నెఱిగి
శోకమోహరహిత సుస్థితి గొనియుండ
చేకొన రఘుపతి చిరునగవులను

కలి టక్కులేమియు వానికడ పనిచేయవు
కలవరపఱుచ లేడు కాలుడును
బలవంతులైన దుర్ఫలులైన హరికృప
కలిగియుండిరేని కలుగ దే భయమును



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.