నటీమణి శ్రీదేవి గారి గురించి ఎవ్వరూ ఎవరికీ ప్రత్యేకంగా పరిచయవాక్యాలు చెప్పనవసరం లేదు.
పసిపిల్లగానే సినీతారగా మారిన శ్రీదేవి ఆసేతుశీతాచలమూ అభిమానప్రేక్షకలోకాన్ని సంపాదించున్నారు.
ఆవిడ బోనీకపూర్ వంటి వయోధికుణ్ణి పెళ్ళిచేసుకోవటం అప్పట్లో ఒక సంచలనం ఐతే ఇలా హఠాత్తుగా వెళ్ళిపోవటం ఇప్పుడు గొప్ప సంచలన వార్త. పత్రికల్లో రేపు వార్తలూ వివరాలూ వస్తాయి కానీ ఈరోజున టీవీ ఛానెళ్ళన్నీ హోరెత్తించేస్తున్నాయి.
ఆవిడతో నాకేవిధమైన పరిచయమూ లేదు.
నాకెవరూ అభిమాన నటీనటులూ లేరు.
ఐనా ఆవిడకు సంబందించిన ఒక విశేషం మాత్రం చెప్పగలను. అది ఆవిడ పైన మనదేశంలో ఉన్న విపరీతమైన అభిమానానికి సంబంధించినది.
ఒకప్పుడు అంటే మూడు దశాబ్దుల క్రితం వరకూ ఇసిఐయల్ సంస్థ కంప్యూటర్లను తయారు చేస్తూ ఉండేది. అప్పట్లో నేను ఆ సంస్థలో పని చేస్తూ ఉండేవాడిని.
అప్పట్లో మా సంస్థను కొనుగోలు దారు సంస్థల తరపు పెద్దలు తరచూ సందర్శించుతూ ఉండేవారు. వారికి మా కంప్యూటర్లను గురించిన వివరాలు మేము వివరించి వారి అవసరాలకు అవి ఎలా సరిపోతాయో అన్నది వారికి నచ్చచెపుతూ ఉండే వాళ్ళం.
అప్పట్లో ఇప్పటిలాగా కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేవి లేవు.
కొందరు కుర్రవాళ్ళు వాళ్ళకు చేతనైన కసరత్తులతో బొమ్మలు వేస్తూ ఉండేవారు.
మీకు పాతకాలం నాటి టైప్ మిషన్లు గుర్తున్నాయా?
ఐతే అప్పట్లో కొందరు ఆ మిషన్ల మీద X అక్షరంతోనో లేదా దానితోపాటు కీబోర్డుమీద ఉన్నమరికొన్ని అక్షరాల సాయంతోనూ వేంకటేశ్వరస్వామి బొమ్మనో మరొక బొమ్మనో వేయటం కూడా గుర్తుండాలి మీలో కొందరికైనా.
అప్పట్లో కంప్యూటర్ మీద ఇప్పటిలాగా A4 సైజు కాగితాలమీద ప్రింట్ చేయటం అనేది లేదు. లైన్ ప్రింటర్లు అని ఉండేవి. లైనుకు 132 అక్షరల దాకా ప్రింటు చేస్తూ పేజీకి అరవైపైన లైన్లు ప్రింటు చేసుకొనే సదుపాయం ఉండేది. పైగా అప్పట్లో వాటిపై అన్నీ ఇంగ్లీషు అక్షరాలే అదీ పెద్దబడి మాత్రమే. అంటే అన్నీ A B C....Z తప్ప a b c .. z వగైరాలు లేనేలే వన్నమాట. ఈ అక్షరాలు కాక కొన్ని గుర్తులు అంటే కామాలూ కోలన్లూ సెమీకోలన్లూ ఫుల్‍స్టాప్ వగైరాలు మాత్రం ఉండేవి.
కొందరు ఉత్సాహవంతలైన కుర్రాళ్ళు అ పరిమితమైన వాటితోటే లైన్ ప్రింటర్ కాగితంపైన వెంకటేశ్వరస్వామి బొమ్మ వేయగలిగారు. మరికొందరు దేవుళ్ళ బొమ్మలూ వేసారు వినాయకుడూ వంటివి.
మా సంస్థకు కష్టమర్ల తాలూకు పెద్దలు వస్తూ ఉండేవారని చెప్పాను కదా కంప్యూటర్ల సామర్థ్యాలను స్వయంగా తెలుసుకుందుకు.
అలాంటి కష్టమర్లు కంప్యూటరుకు అనుసంధానించి ఉన్న పరికరాల సామర్థ్యమూ వేగమూ గురించీ తప్పక అడిగి తెలుసుకునే వారు. లైవ్‍గా చూపించమనీ అడిగే వారు. అలాగే ఆ లైన్ ప్రింటర్ వేగం కూడా ఆలోచించే వారు. అంటే నిముషానికి ఎన్ని లైన్లు ప్రింట్ చేయగలదూ అన్నట్లు. అప్పట్లో సాధారణంగా నిముషానికి 300 లేదా 600 లైన్లు ప్రింటుకొట్టేవి ఆ ప్రింటర్లు. మరీ ఆధునికమైనవీ బాగా ఖరీదనవీ నిముషానికి 1200 లైన్లూ ప్రింటుకొట్టేవి. అప్పట్లో అది మహావేగం అన్నమాట.
అలాంటి ఒక కష్టమరుకు ప్రింటరును చూపుతున్నాడు మా ఇంజనీర్లలో ఒకబ్బాయి.
వేంకటేశ్వరస్వామి బొమ్మను వేగంగా ప్రింటుకొట్టి చూపాడు.
ఆ కష్టమరు తెగ ముచ్చటపడిపోయాడు.
శ్రీదేవి బొమ్మను ప్రింటు కొడుతుందా మీ కంప్యూటరూ? అలాగైతే వెంటనే ఆర్డరిస్తాను అన్నాడు.
ఈ సంఘటనను మేము చాలాసార్లు గుర్తుచేసుకొని నవ్వుకొనే వాళ్ళం అప్పట్లో.

కంప్యూటర్ కొనేటటువంటి ముఖ్య నిర్ణయానికి శ్రీదేవి బొమ్మ గియ్యగలగడం కండిషన్ గా పెట్టుకున్న ఆ కస్టమర్ - హ్హ హ్హ హ్హ. అఫ్కోర్స్ శ్రీదేవి అంటే అభిమానం కూడా ఆ స్ధాయిలోనే ఉండేదిగా.
రిప్లయితొలగించండికానీ ఏ మాటకా మాటే చెప్పుకోవాలి - ఆ నాటి Line Printers, Dot Matrix Printers మీద బొమ్మలు వేసిన ఔత్సాహికులది మెచ్చుకోదగిన నైపుణ్యం అంటాను నేను.
దివికేగిన శ్రీదేవి మీ జ్ఞాపకాల్లోంచి ఒక పాస్టు-పోస్టు-నిధి వెలికివచ్చేలా చేసింది. దివిలో ఆవిడ ఆత్మకి తప్పక శాంతి కలుగుతుంది.
రిప్లయితొలగించండిసర్జరీల గురించీ కుటుంబంలోని సమస్యల గురించీ అవే చావుకి కారణం అన్నట్టు చాలామంది మాట్లాడుతున్నారు.కానీ ఆ రెండు రకాల ఆందోళనలూ ఇవ్వాళ ఎవరికి లేవు?మధ్యతరగతి ఆడవాళ్ళు కూడా అందంగా ఉండాలని తాపత్రయ పడుతున్నారు.తన అందమో తన భర్త సంపాదనో గొప్పగా ఉండాలనీ ఇతరులు కుళ్ళుకు చచ్చేలా బతకాలనీ అనుకోని ఆడది ఉందా లోకంలో?
రిప్లయితొలగించండిఅప్పుడూ ఇప్పుడూ కూడా ముసలాణ్ణి చేసుకుందని దెప్పుతునారు - ఈడూ జోడూ చూసి చేసుకుంటున్న మన బతుకులు బాగున్నాయా!తనకి నచ్చాడు,తను అనుకూలవతియైన భార్యగానే బతికింది.అన్నిటినీ మించి పెద్దలు చెప్పిన వినా దైన్యేన జీవనం అనాయాస మరణం అన్నది తనకి దక్కింది - దారిద్ర్య బాధ లేదు,మంచాన బడి కృశించ లేదు.అంతవరకు అదృష్టమే!
'వయోధికుణ్ణి పెళ్ళిచేసుకోవటం అప్పట్లో ఒక సంచలనం' అన్నాను కాని నా నుండి దెప్పటం అనేది లేదు కదా. అనాయాసమరణం అన్నది ఎంతవరకో అన్నది పక్కన బెడితే 'మంచాన బడి కృశించ లేదు.అంతవరకు అదృష్టమే' అన్నది ఒప్పుకోక తప్పదు.
తొలగించండి