ఈ నెల 5 వ తారీఖు గురువారం.
నాటి రాత్రి ఇంచుమించు పదకొండున్నర సమయంలో ఆ రోజుకు వీడ్కోలు పలికి పడక మంచం మీదకు చేరటం జరిగింది.
రోజూ శయనించే ముందు కొంతసేపు రాములవారిని ధ్యానం చేసుకోవటం అలవాటు.
ఏ రోజున ఎంత సేపు అలా ధ్యానం కొనసాగుతుందీ అన్నది నా చేతిలో లేదు.
ఒక్కొక్క రోజున ఒక గంట సేపు నడుస్తుంది ధ్యానం.
అప్పుడప్పుడు రాత్రంతా కొనసాగటమూ జరుగుతుంది.
ఆ రోజు రాత్రికూడా యథావిధిగానే ధ్యానం చేసుకుంటున్నాను.
చాలా సేపే కొనసాగింది ఆ ధ్యానం.
ఉన్నట్లుండి ఒక్కసారిగా ఒక కుదుపు లాగా వచ్చింది.
ఆ వెంటనే ఎందుకో తెలియని ఆవేశం కలిగింది.
అది కోపం కావటానికి వీలు లేదు.
కోపానికి ఆధారంగా ఏదన్నా విషయం ఉండాలి కద.
ఆవేశం రాగానే కొంచెం భయం వేసిన మాట వాస్తవం.
ఇంత ఆవేశం ఎందుకో తెలియక పోవటమే భయహేతువు కావచ్చు.
ఒక పక్క ధ్యానం కొనసాగుతూనే ఉంది.
ఆవేశం తీవ్రతా హఠాత్తుగా పెరిగి పోయింది.
ఒళ్ళంతా బహులఘువుగా ఐపోయింది.
గాలిలో తేలుతున్న ఈకలాగా శరీరం కంపించటం స్పష్టంగా అవగాహనకు వచ్చింది.
ఉద్రేకం పట్టలేక నోటినుండి కేకలు బయటికి వచ్చాయి.
కొద్ది నిముషాలు కొనసాగిందీ స్థితి.
క్రమంగా శరీరం యథాస్థితికి వచ్చిందా లఘుత్వం నుండి.
ఆవేశమూ అలాగే క్రమంగా తగ్గి ప్రశాంతమైన మనఃస్థితి కలిగింది.
ఒక గొప్ప తుఫాను వెలసినట్లయింది!
మెల్లగా ఈ ప్రశాంతత కారణంగా కాబోలు ఆనందం కలిగింది.
అపరిమితమైన ఆనందం అది.
ఈ విచిత్రానుభవం కలుగుతున్నంత సేపూ ధ్యానానికి ఏమాత్రం ఆటంకం కలగక పోవటం విచిత్రం.
ఆ స్థితి చాలా సేపు కొనసాగింది.
మెల్లమెల్లగా సాధారణమైన పరిస్థితికి మనస్సు వచ్చింది.
పూర్తిగా ఈ అనుభవం నుండి తేరుకున్నాక, ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది.
ప్రక్కదిగి లైట్ ఆన్ చేసాను.
గోడగడియారం వంక చూసాను. సమయం రాత్రి గం.1:45ని॥
మంచినీళ్ళు తాగి పడుకున్నాను.
ధ్యానం మరికొద్ది సేపు కొనసాగాక నిద్రపట్టింది.

అయితే తమరికి కుండలిని స్పృహ కలిగిందంటారు..!
రిప్లయితొలగించండిఅది కుండలిని అనుభవం మాత్రం కాదు. మీకు ఈ అనుభవం భాగవతం సు స్పష్ట్టం గా అర్థం చేసుకోవటానికి ( ఇంచుమిచు ఫస్ట్ హండ్ యక్స్ పీరియన్స్ తో) ఉపయోగ పడుతుందందని అనుకొంటాను.
రిప్లయితొలగించండిSriRam
శ్యామలీయం గారు ,
రిప్లయితొలగించండిమీకు కలిగిన ఈ స్థితి శ్రీ ఆంజనేయస్వామి శక్తి లభించింది అన్నమాట ఆ కొద్ది క్షణాలు .
ఎందుకంటే మీరు రామాయణం గురించి విపులంగా , వివరంగా వివరిస్తున్నారు కదా !
రిప్లయితొలగించండిMay be your soul wanted to kick the bucket but came back again thinking time is not yet ripe to kick the bucket.
Do not talk nonsense, as if you know somethin about it.
తొలగించండిమీ మాటలలో వ్యంగ్యం, కసి,కార్పణ్యం కనపడుతున్నాయి,మీ ఆరోగ్యానికే మంచిది కాదు, గుర్తించండి, ఆయనంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, కాని మాటాడే విధానం బాగోలేదు.
తొలగించండి
రిప్లయితొలగించండిశ్యామలీయం వారు,
ఇదేమన్నా అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుం దంటా రా ? (ఆంగ్లం లో) OBE మీద చాలా రిసెర్చ్ జరుగు తోందని అనిపిస్తుంది ఈ మధ్య అమెరికా సైకియాట్రీ సర్కల్ లో .
జిలేబి
@జిలేబి,
తొలగించండిఆయన కి కలిగిన అనుభవం రాసుకొన్నాడు. చాలా మంది అటువంటి అనుభవాలను అద్యా అనుభవాలుగా పరిగణిస్తారు. మీరు అమేరికాలో కొంతమంది సైక్రియార్టిస్ట్ లు వీటి మీద పరిశొధన చేస్తున్నారని చెపుతున్నారు కదా! వాళ్లు ఆపరిశొధనలో కనుకొనేది ఎముంది? ఈ అనుభవం రోగమేమి కాదు, పరిశొధనలు చేసి మందులు కనుకోవటానికి. ముందర ఆ సైకియార్టి డాక్టర్ ల కు ఉన్నడబ్బు పిచ్చిపైన పరిశొధనలు చేయాలి. ఎందుకంటె రోగమేమి లేక పోయినా అవుట్ ఆఫ్ బాడి యక్స్ పిరియన్స్ గురించి చేయవలసిన అవసరమేమి వచ్చింది వారికి?
OBEమీద అక్కడ అమెరికాలో రిసెర్చ్ చేస్తే, ఇక్కడ ఈయన వాటిని తెలుసుకొని ఎమి చేయలి?
తొలగించండిఆది దైవిక, ఆది భౌతిక అనుభవాలు జరుగుతాయి, అప్పుడపుడు, వీటిని పదుగురితో పంచుకోవడం మంచిదికాదని నా ఊహ, అందరూ ఒకలా ఉండరుకదా.
రిప్లయితొలగించండిఅవును...
తొలగించండిమనసున్న మారాజులు తెలంగాణా సోదరులు....వీడియో చూడండి...అపార్ధాలు వీడండి...అప్రస్తుతమైతే క్షమించండి...
రిప్లయితొలగించండిhttp://nuvvusetty.wordpress.com/2013/09/08/save-andhra_satyavani/
అణిమ... లఘిమ...గరిమ... ?
రిప్లయితొలగించండిఇది రెండు విధములగా అనుభవములొకి వచ్చే అవకాసం వున్నది అని నా అభిప్రాయం...
రిప్లయితొలగించండి1) మానసిక పరిపక్వత
2) మానసిక బలహీనత
అయితే మీయొక్క ఆలోచనా గతి స్థితి మీద మీకున్న అవగాహనతో ఈ అనుభవం అనేది పరిపక్వతా లేక బలహీనత వల్ల కలిగినదా అన్నది
మీరు లేక మీకు అత్యంత ఆప్తులైనవారు మాత్రమే విసదీకరించగలుగుతారు.
కాకపొతే మీమీద మాకున్న కొద్దిపాటి అవగాహనతో (మీ బ్లాగ్ ద్వారా) ఇది పరిపక్వత వలన కలిగినదిగా భావించి ఆనందముతో కించిత్ నవ్వు విరిసెను పెదవుల పైన...
సంతోషం మీరు మీ అనుభవం పంచుకున్నందుకు....