18, సెప్టెంబర్ 2013, బుధవారం

త్రికరణశుధ్ధిగ నిన్నే నమ్మితి

త్రికరణశుధ్ధిగ నిన్నే నమ్మితి దీనబాంధవ శరణు
చకితచిత్తుడను నీదు భక్తుడను జనకసుతావర శరణు

సురగణపోషణ సురరిపుశోషణ సుగుణవిభూషణ శరణు
కరుణాభరణ మునిజనశరణ ముక్తివితరణ శరణు   ॥త్రికరణ॥

పరమదయాకర పాలితకింకర భక్తవశంకర శరణు
పరమోదార మోహవిదూర పాపవిదార  శరణు    ॥త్రికరణ॥

అనిమిషమిత్ర దశరధపుత్ర పూతచరిత్ర శరణు
అంబుజనేత్ర శ్యామలగాత్ర విజితామిత్ర శరణు    ॥త్రికరణ॥

బుధజనభావిత హనుమత్సేవిత సీతాజీవిత శరణు
అమరప్రపూజిత కమలజసన్నుత జ్ఞానప్రదాత శరణు    ॥త్రికరణ॥

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.