దురదృష్టవశాత్తు మన ప్రియతమ భారత దేశంలోని వ్యవస్థలు అన్నీ మున్నెన్నడూ లేనంతగా పతనం అంచున దిగులుగా కూర్చున్నట్లు అనిపిస్తోంది.
ఈ దేశంలోని వ్యవస్థలు రాజకీయవ్యవస్థ అనండీ ఆర్థికవ్యవస్థ అనండీ, రక్షణవ్యవస్థ అనండీ, నైతికవ్యవస్థ అనండీ పారిశ్రామికవ్యవస్థ అనండీ అన్నీ కళాకాంతీ కోల్పోయి దయనీయమైన స్థితిలో ఉండటం మనస్సుని కలచి వేస్తుంది.
ఒకప్పుడు మనదేశాన్ని రెండువందల యేళ్ళు ఏలిన తెల్లదొరలు అరవైఏడేళ్ళ క్రిందట చక్కాపోయారు. వారి పోకడకు మన అహింసాయుత స్వాతంత్ర్యపోరాటం కారణమా లేక రెండవ ప్రపంచయుధ్ధంలో బ్రిటన్ చావు దెబ్బతిని చేతులెత్తేయటమా అన్నది ఇప్పటికీ ఒక చర్చనీయాంశమే. ఐతే, ఆభిజాత్యంకల మన భారత జాతీయులం గాంధీగారే పోరాడి స్వాతంత్ర్యం సాధించుకుని వచ్చారని చదువుకుంటాం, బాలల చేత చదివిస్తాం అన్నది నిజం. అప్పట్లో బ్రిటన్ ప్రధానిగా ఉన్న చర్చిల్ మహాశయుడు భారత దేశవాసులకు తమను తాము పరిపాలించుకుందుకు తగిన సమర్థత లేదని వాదించటం ముమ్మాటికీ భారతీయుల్ని అవమానించే ఉద్దేశంతో అన్న మాటలే అన్నది నిర్వివాదాంశం.
కాని ఇన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం చేస్తున్నాం? మనని మనం సమర్థంగా పాలించుకోలేమూ, దేశవ్యవస్థల్ని చక్కగా నిర్వహించుకోలేమూ అని ప్రపంచానికి ముక్తకంఠంతో చెబుతున్నట్లుగా ప్రవర్తిస్తున్నాం అని అనుమానం వస్తోంది నాకు.
స్వాతంత్ర్యం సాధించుకున్న కొత్తలో మహాత్మాగాంధీగారు కాంగ్రెసు సంస్థను రాజకీయ పార్టీగా మలచటాన్ని వ్యతిరేకించారని వింటూ ఉంటాం. మరి మన నాయకులకు అప్పటికీ ఇప్పటికీ ఆయన మార్గదర్శకుడూ స్ఫూర్తిప్రదాతా ఐనప్పుడు కాంగ్రెసు సంస్థకు అతిపెద్ద దిక్కు ఆయన ఆయన మాట ఎందుకు చెల్లలేదూ? కాంగ్రెసు సంస్థ కాస్తా, ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఎందుకు తయారయిందీ? గాంధీగారి పేరు చెప్పుకునీ, నెహ్రూగారి పరపతి చూపించీ, జాతీయపతాకానికి అతిదగ్గర నమూనాగా పార్టీజండా పెట్టి జనాన్ని ఎందుకు భ్రమపెట్టిందీ కాంగ్రసుపార్టీ? ఓట్ల కోసం విలువల్ని కొద్దో గొప్పో దిగజార్చటం కాదా? ఒకసారి దిగజారటం మొదలు పెట్టాక దానికి అంతం అంటూ ఉంటుందా?
కాంగ్రెసు పార్టీ తరపున భారత ప్రధానిగ పధ్ధెనిమిదేళ్ళు పాలించిన నెహ్రూగారు ఒకప్పుడు తన సోదరి కృష్ణహతీ సింగ్‌కు కూడా రాజకీయపదవి ఇవ్వాలని యోచించి అందరూ వ్యతిరేకిస్తే వ్యక్తిగతప్రతిష్ట తగ్గుతుందని భావించి ఊరుకున్నారని కథనాలు చదివాను. ఆయన కుమార్తె కావటం మినహా ఇందిరకు ప్రధాని కావటానికి అర్హతలు ఏ అర్హతలు ఉన్నాయో అవి ఎక్కడినుండి ఎలా వచ్చాయో చెప్పండి? కాలం గడచిన కొద్దీ ఇందిర ఒక నియంత అని తేలింది. ఇక ఆవిడ తరువాత ఆవిడ కుటుంబం రాజ్యం చేస్తోంది. రాజీవ్ గాంధీ పైలట్ ఉద్యోగానికి రాజీనామా చేయగానే ఏఐసిసి ప్రధానకార్యదర్శి ఐపోయాడు. ఆ పదవికి ఇంక సీనియర్లు ఎవరూ లేరన్న మాట. ఉన్నా పనికిరారన్న మాట. ప్రజాస్వామ్యంలో కుటుంబపాలనకు పరోక్షంగా నెహ్రూగారూ, ప్రత్యక్షంగా ఇందిరమ్మా కారణం. ఇదేం ప్రజాస్వామ్యం?
నెహ్రూ తరువాత ఏణ్ణర్థం పాటు లాల్ బహదూర్ శాస్త్రిగారు ప్రధానిగా ఉన్నారు, ఆయన తాష్కెంట్‌లో హఠాన్మరణం చెందేదాకా. ఆయన మరణం ఒక మిష్టరీ అని నమ్మేవాళ్ళకి కొరతలేదు. నిజానికి శ్రీమతి లలితాశాస్త్రి మాటల్తో పత్రికలలో వచ్చిన కథనాల ప్రకారం, ఆ అనుమానాలకు ఆథారాలు ఉండవచ్చును. శాస్త్రిగారు మచ్చలేని నిజాయితీ ఉన్న వ్యక్తి. అప్పట్లో ఆయన జీవిత చరిత్ర పాఠ్యాంశంగా ఉండేది. శ్రీమతి ఇందిర శాస్త్రిపట్ల చులకన భావం కలిగి ఉండేవారని ఒక అభిప్రాయం ఉంది. ఆవిడ శాస్త్రిగారికి ఎందుకంత గౌరవం ఇస్తారూ ఆయనేమంత గొప్పవాడూ అని విసుక్కున్న సందర్భం ఒకటి పత్రికలలో చదివాను.
కాంగ్రెసు తరపునే శాస్త్రిగారు ప్రధానిగా చేసారు. అంతకుముందు కాలంలో ఆయన రైల్వేమంత్రి గానూ చేసారు.బీహార్లో కాబోలు ఒకరైలు ప్రమాదం జరిగినప్పుడు నైతికబాధ్యత వహించి ఆయన రైల్వేమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసారు.
ఈ రోజున ఆర్థికశాస్త్రవేత్తగా పేరుబడ్డ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. ఆయన హయాంలో తొమ్మిదేళ్ళు గడిచాయి. అనేక ఆర్థిక కుంభకోణాలు దేశప్రజలను నివ్వెరపోయేలా చేసాయి కూడా. ఆయన వాటికి ఏమాత్రం బాధ్యతతోనూ స్పందిచిన దాఖలాలు లేవు వేటికీ. బొగ్గుగనుల కుంభకోణం అనే అతిపెద్ద వ్యవహారంలో ఆయన ఆధీనంలో ఉన్న ఆ శాఖకు సంబంధించిన ఫైళ్ళు కాలి బూడిదైపోయాయట - లేదా ఏమై పోయాయో కనబడటం లేదు. మన ఘనత వహించిన ప్రధానిగారి తాజా వ్యాఖ్య చూడండి, నాకేమీ బాధ్యత లేదని అట. ఇదా ప్రధాని కుర్చీలో ఉన్న వ్యక్తి నుంచి ఆశించే బాధ్యతాయుత మైన పదవీ నిర్వహణ?
రక్షణవ్యవస్థలో లోపాల గురించి బహుదీర్ఘకాలంగా ఆరోపణ లున్నాయి. బోఫార్స్ కుంభకోణాన్ని పట్టుకున్నదీ, వెలుగులోకి తెచ్చిందీ స్వీడిష్ రేడియోవాళ్ళు. దాన్ని మన వ్యవస్థ ఎంతా బాగా పరిశోధించిందో మనకందరికీ తెలుసు. నిజాల్ని వేయి నిలువుల గోతిలో పాతారు.
నైతికవ్యవస్థ గురించి ఏం చెప్పి ఏం లాభం? ఈ రోజున చట్టసభల్లో నేరారోపణలూ, కేసులూ ఉన్నవాళ్ళు చాలా పెద్ద శాతంలో ఉన్నారన్నది పచ్చినిజం. శిక్షలు పడ్డ వాళ్ళూ అప్పీళ్ళు చేసుకుని వాటి విచారణ అతీగతీ లేకుండా చూసుకుంటూ, కేంద్రంలో మంత్రి పదవులు సైతం వెలిగిస్తున్నారు. ఈ వ్యవహారాలకు ఇటివలి సుప్రీంకోర్టు తీర్పు చరమగీతం పాడితే, దొరలంతా నిస్సిగ్గుగా తగినట్లుగా చట్టసవరణకు సిధ్దం అవుతున్నారు. అలాగే సమాచార చట్టం క్రిందికి వస్తాం అని తేలగానే అన్ని రాజకీయ పార్టీలూ అధికార ప్రతిపక్ష పార్టీలన్న తేడా లేకుండా, సమాచార చట్టాన్ని సవరించి బయట పడటానికి సిధ్దంగా ఉన్నారు. చిన్నా చితకా ఎన్నికలలో కూడా కోట్లు ఖర్చు పెట్టే పెద్దమనుషులు ప్రజలకోసం పనిచేస్తారని ఎవరైనా నమ్ముతారా? చట్ట ప్రకారం ఎవరైనా పోటీ చేయచ్చును ఎన్నికల్లో కాని, కోట్లు ఖర్చు పెట్టలేని వాళ్ళు సోదిలోకి కూడా మిగలని తంతులో సామాన్యుడికి చట్టసభకు పోటీ చేసే అవకాశం ఉందా? వెనుకటి కాలంలో పాఠ్యాంశాల్లో నైతిక ప్రవర్తన గురించిన బోధనకూ స్థానం ఉండేది. ఈ రోజుల్లో రాముడి గురించో కృష్ణుడి గురించో పాఠం ఉంటుందా బడి పుస్తకాల్లో, ఉంటే ఎన్నెన్ని గొడవలౌతాయో!
పారిశ్రామికరంగంలో సంస్కరణల పేర తలుపులు బార్లా తెరిచేస్తున్నాం. దేశీయ పారిశ్రామిక వేత్తల్లో పెద్ద చేపలకే విదేశాల నుండి పోటీ వచ్చే రోజులు. చిన్నచిన్న దేశవాళీ పారిశ్రామిక వేత్తల పరిస్థితి అయోమయమే. దేశంలోని కొన్ని పారిశ్రామిక పవర్‌హౌస్‌లు ఎదిగిన క్రమం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిజాయితీగా ఆలోచించే వాడికి. అంబానీగారు అక్షరాలా పదివేల రూపాయల అప్పు తీసుకున్నారు స్టేట్‌బ్యాంక్ నుంచి. అచిర కాలం లోనే ఆయన వందలకోట్లకూ, చూస్తుండగానే లక్షల కోట్లకూ పడగలెత్తిన సంస్థలకు అధిపతి అయ్యాడంటే నా దృష్టిలో అది కేవలం మహామాయాజాలమే. నాకు తెలిసిన ఒక వ్యక్తి సైకిల్ మీద చీరలు అవీ తెచ్చి అమ్మే వాడు. ఉన్నట్లుండి పెద్ద బట్టల షాపు తెరిచాడు. అచిరకాలంలో అది పెద్ద చెయిన్ షాపు అయింది. ఇదంతా చాల కొద్ది కాలంలో ఎలా సాధ్యమైనదో తెలియదు. ఎక్కడా అవినీతి జరగటం లేదూ అనుకోవటం కళ్ళు మూసుకోవటమే.
న్యాయవ్యవస్థ మీదా ఇందిర కాలంలోనే దాడి మొదలయింది. సీనియారిటీని కాదని ఆవిడ, తనకు అనుకూలంగాఉండే వ్యక్తికి భారతప్రధానన్యాయమూర్తి పదవి కట్టబెట్టారన్నది చాల మంది దృష్టిలో పచ్చి నిజం.
విద్యావ్యవస్థను రాజకీయాలకు ఉపయోగించుకోవటం గాంధీగారి కాలంలోనే మొదలైందీ అనుకోవచ్చు నేమో. ఈ రోజున ప్రతి చిన్న పెద్ద రాజకీయమైన అలజడులకీ విద్యార్థులను రాజకీయులు ముందుకు తోస్తున్నారు. ఎలిమెంటరీ స్కూలు పిల్లల్నీ వదలరు. ఆచార్యులూ, అధ్యాపకులూ కూడా స్వయంగా రాజకీయ పార్టీలతోనూ రాజకీయ ఉద్యమాలతోనూ మమేకం అవుతారు. ఎవరికీ సర్వీస్ రూల్స్ అనేవి వర్తించవని అనుకోవాలి.
వైద్యవ్యవస్థ అనేది ఎంత అవ్యవస్థితంగా ఉందంటే ప్రభుత్వవైద్యశాలలు నాశనం ఐపోయాయి. అందరికీ కార్పొరేట్ వైద్యమూ దాని దోపిడీ తప్ప దిక్కులేదు. ప్రభుత్వ పథకాలు ప్రజల వైద్యం కోసం వచ్చినా వాటి ప్రయోజనం మాత్రం ఎక్కువగా కార్పొరేట్ రంగానికే. కాకపోతే అలాంటి పధకాలు ప్రభుత్వాలూ ప్రకటించవని అందరికీ అనుమానమే!
ఫోర్త్ ఎస్టేట్ అని ప్రశంసించబడే పత్రికా రంగం ఎంతఘోరంగా ఉందో చర్చించటం కూడా అనవసరం. దాదాపు అన్ని పత్రికలూ కేవలం పార్టీ కరపత్రాల స్థాయిలో నడుస్తూ ప్రజల విశ్వాసం దాదాపు కోల్పోయాయి. ఈ మాట ఎలక్ట్రానిక్ మీడియాకూ వర్తిస్తుంది నిర్మొగమాటంగా.
1948లో ప్రచురించబడిన భారతి రజతోత్సవ సంచికలోనే అవినీతికి సంబంధించిన కథలూ గట్రా ఉన్నాయి. ఈ రోజున ఎటు చూసినా అవినీతి అరాజకత్వం తప్ప ఏమీ కనిపించటం లేదు. చాలా కాలం క్రిందటే ఆ పుస్తకాన్ని నా దగ్గ రనుండి ఎవరో తస్కరించారనుకోండి, అది వేరే విషయం.
ఇక్కడ ఈ టపాలో మనం చేసింది కేవలం కొన్ని కొన్ని రంగాల మీద ఉపరిస్పర్శ మాత్రమే. వివరంగా అన్ని రంగాల గురించీ, అన్ని విషయాల గురించీ చర్చిస్తూ పోతుంటే ఎంత పెద్ద గ్రంథం ఐనా ఆశ్చర్యం లేదు.
ఇలా అన్ని రంగాల్లోనూ దేశవ్యవస్థలు భ్రష్టుపట్టి పోతుంటే మనం అంతా ఏం చేస్తున్నాం? అసలు మనం ఏం చెయ్యగలం? ఈ దేశం అసలు ఎటు పోతోంది? ఇవి ఆలోచించ వలసిన విషయాలు.

మంచి విశ్లేషణ. లాల్ బహదూర్ శాస్త్రి లాంటి నేతలతో సోనియా చెప్పు చేతాల్లో నడచే అసమర్ధ - అవినీతి పోషక మన్మోహన్ ను పోల్చలేము.
రిప్లయితొలగించండినవ్విపోదురుగాక నాకేటి సిగ్గని ఈయనగారిని అవినీతికి దూరంగా ఉండేవాడని పొగుడుతారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సంకీర్ణయుగం లో ఇవన్నీ తప్పడం లేదని సిగ్గు లేకుండా ఉద్ఘాటించిన ఘనుడీయన.
అన్ని వ్యవస్థలు పతనావస్థకు చేరుకోవడానికొ మన్మోహన్ ఆర్ధిక విధానాలు, విచ్చలవిడిగా సరళీకరణను అమలు చేయడమే ప్రధాన కారణం. క్రోనీ కేపిటలిజం పెరగడానికి ఈయన అతి దూకుడైన నిరర్ధక ఆర్ధికవిధానాలే అసలు కారణం.
కొండలరావుగారూ, మీకీ వ్యాసం నచ్చినందుకు సంతోషం. నాకు రాజకీయ విశ్లేషణలు చేసే ఆసక్తీ లేదు అలవాటూ లేదు. నిజానికి మనస్సులోకి వచ్చిన అనేక విషయాలు (ఉదాహరణకు మేధావులూ, శాస్త్రపరిశోధనారంగం వంటివి) వదిలేసాను కావాలనే. కొన్ని కొన్ని విషయాల గురించి ప్రస్తావిస్తే చాలును అనిపించించి అంతే. గొంగడిలో తింటూ వెంట్రుకలు లెక్కపెట్టటం ఎంతవరకూ అని. నిజంగా నాకు దేశం గురించి ఆందోళన కలుగుతోంది రోజురోజుకీ. యువకులు రంగంలో దిగి చక్కచేయవలసిందే. లేకుంటే ప్రమాదం అంచున ఉన్నాం!
తొలగించండిఅవినీతి సమస్య ఇప్పటిది మాత్రమే కాదని, స్వాతంత్ర్యానికి పూర్వం కూడా దేశం లో అవినీతి నిండుగా ఉందని నా అభిప్రాయం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంత కూడా లేని చిన్న దేశమైన ఇంగ్లండ్, భారత పాకిస్తాన్ లతో సహా ప్రపంచం లోని అనేక దేశాలని ఎలా ఏలగలిగింది? దానికి అంతమంది సిబ్బంది ఎలా దొరికారు? మన స్వతంత్ర పోరాటాన్ని అదుపుచేస్తూ వచ్చింది అప్పటి ప్రభుత్వం లో పనిచేసిన భారతీయులేకదా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండలేదు. ప్రపంచం లోని అన్ని రాజ్యాలకీ ఉచ్ఛ స్థితి నీచ స్థితి రెండూ కలిగాయి. మనకీ ఆ యోగం తప్పదేమో.
రిప్లయితొలగించండిఎక్కడికి పోతున్నాం మనం!?ఏమైపోతున్నాం మనం!?అవినీతిని జాతీయం చేశాం!మహాత్మాగాంధీ,లాల్ బహదూర్ శాస్త్రి ,గుల్జారీలాల్ నందా,స్థాయి వ్యక్తులు ఎవరు ఈనాటి ఎన్నికలలో నిలబడినా ఈ పరిస్థితులలో ధరావత్తు కోల్పోవడం ముమ్మాటికీ అక్షరాలా ఖాయం!అన్ని రంగాలలో విలువలు పూర్తిగా పతనం అయ్యాయి!మనమంతా చేతులు నులుముకుంటూ,నంగినంగిమాటలతో చూచీ చూడనట్లు ఏమీ పట్టనట్లు ఉండిపోతున్నాం!మనం చెయ్యగలిగిందేమని తమాష చూస్తూ ఉండిపోతున్నాం!మన జనం ఎన్నికలలో ఒక్కొక్కడు ఒక వెయ్యి రూపాయల నోటూ,ఒక మద్యం సీసా తో సరిపుచ్చుకుంటున్నారు!ఆ వెయ్యి లక్షకు పెరుగుతుంది ముందుముందు!ప్రజాస్వామ్యం ఒక అద్దం లాంటిది!మన ప్రజలముఖాలు దానిలో ప్రతిబింబిస్తాయి!ప్రజలు కూడా ఈ రోజుల్లో తిననివాడెవ్వడు!అని సమాధానపడి రాజీ పడుతున్నారు!రాజకీయాలు అన్నిటికంటే ఎంతో లాభసాటి వ్యాపారం!దోచుకున్నవాడికి దోచుకున్నంత!మన స్వాతంత్ర్యం మేడిపండు,మన దారిద్ర్యం రాచపుండు అని నిజం చెప్పి నిష్టూరమైనారు కవులు!శ్యామలీయం గారు ఆశిస్తున్నట్లు యువతరం అప్రమత్తమై శిరసెత్తితే,సమాజంలో మార్పు వస్తుందేమో!మనం ఆశాజీవులంకదా!ఉందిలే మంచికాలం ముందుముందునా అని పాడుకుంటూ మందుకు పోదాం!
రిప్లయితొలగించండిమీ ప్రతి మాట నా మనసులోంచి ఉరికినట్లుంది. కాదు ఇది సామాన్య దేశ పౌరుల ఆవేదన.
రిప్లయితొలగించండికడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుందంటారు. అందరూ యువత రావాలంటున్నారు, వచ్చే మార్గం చెప్పటం లేదు. నేనిక మార్పు చూస్తాననే నమ్మకంలేదు. ముందు తరాలయినా బాగుండాలని ఆశిస్తాను.
చక్కగా విశ్లేషించారు నేటి రాజకీయాల గురించి . స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నెహ్రూ గారికి పదవి దురద వున్నదన్నది అనుమానం లేని నిజం . అది ఆ వంశీయులకు ( సోనియాకు కూడా ) వారసత్వ హక్కుగా రూపు దిద్దుకొన్నది .
రిప్లయితొలగించండియువకుల భవిష్యత్తు పాడి చేస్తున్నారు అని అన్నారు . దానికి కారణం " నేతి బాలలే రేపటి పౌరులు " కదా ! వాళ్ళకు ఈ కుటిల రాజకీయాల్ని యిప్పటి నుంచే నేర్పకపోతే మరి ప్రమాదమన్న దుర్భావనలో వుండటమే యిందుకు ముఖ్య కారణం .
షుమారుగా 40 ఏళ్ళ క్రితం ఓ మహాకవి " ఎవరో వస్తారని , ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా ! నిజం మఱచి నిదురపోకుమా ! " అని " భూమికోసం " అనే సినిమాకి పాట రూపంలో ఆ నాటి పరిస్థితులలోనే వ్రాశారు .
ఇది ముందు తరాల వారు కూడా స్వర్ణాక్షరాలతో లిఖించబడ్డ శాసనంగా చూడవలసిన దుస్థితి ఏర్పడుతున్నది .
ఇక మార్పు రాదేమో ? కశ్టే ఫలి శర్మ గారు అన్నట్లు , మనమే కాదు ముందు తరాలవారు కూడా న్యాయాన్ని , ధర్మాన్ని చూసే అవకాశం లేదేమో ? మనమైతే వాటి రూపాన్ని ఉనికిని తెలుసుకోగలిగాము పాఠ్యాంశాల ద్వారా నైనా . మన ముందు తరాల వారికి ఆ పేర్లు కూడా తెలియవేమో ? ఈ సరికే పాఠ్యాంశాలలో లేకుండా పోతున్నాయి .
చరిత్రలో చెఱగని చరిత్రహీనులుగా మిగిలిపోతారు నెహ్రూ వారసులు , ఆ అనుయాయులు .
ఈ భారత దేశానికి వాళ్ళు తప్ప వేరే లేరన్నట్లు అయిపోయింది . ఎపుడైనా , ఎవరైనా ఆ పదవులలోకొచ్చినా , వాళ్ళు ఆ అన్యాయపు బాటనే పరమావధిగా చేసుకొంతున్నారు . " ఈ దేశం ఎటు పోతుందో " అనటం కంటే అటె , అలా అలా పోతోంది అనుకోవటంలో కనీసం పచ్చి నిజాన్ని ధైర్యంగా మనమైనా అక్షరాలలో చెప్పుకోగలుగుతున్నాం . ముందు ముందు ఈ అవకాశం కూడా వుండదేమో ? మనసులోని మాటలు / భావాలు నిర్భయంగా వ్యక్తీకరణకు అవకాశం వుండక పోవచ్చు యిలాంటి భారత దేశంలో .
వండర్ఫుల్ సార్. ఒక మంచి టప చదివాను ఈ రోజు. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికొన్ని తప్పులు దొర్లాయి. సవరించి మళ్ళీ ప్రచురిస్తున్నాను
రిప్లయితొలగించండిఇందిరా గాంధీ గద్దెనెక్కడానికి కామరాజ్ లాంటి వారి ప్రమేయం ఎంతోకొంత ఉందండీ. ఒక్కసారి చరిత్ర పుటలు తిరగేద్దాం.
నెహ్రూ తరువాత ఎవరు అనే ప్రశ్న కాంగ్రెస్ వారిలో చర్చలు జరిగే రోజులలో మొరార్జీ దేశాయి పేరు ముందుండేది. ఆయన వైఖరి కామరాజ్, నిజలింగప్ప, సంజీవరెడ్డి, ఎస్.కే. పాటిల్ లాంటి వారికి పడేది కాదు. ఎట్టి పరిస్తితులలో మొరార్జీని ఆపాలని వారు ఒక సిండికేటు తయారు చేసుకున్నారు.
సిండికేటు వ్యూహంలో మొదటి అస్త్రం కామరాజ్ ప్రణాళిక. ఒక్క వ్యక్తిని మాత్రమె టార్గెట్ చేసినట్టు కాకుండా, ముఖ్యనాయకులు అందరూ పదవులు వదిలి పార్టీలో పని చేయాలని కామరాజ్ కోరారు. మొరార్జీతో సహా ఎందరో కేంద్రమంత్రి పదవులు వదులుకున్నారు.
నెహ్రూ 1964లొ పోవడంతో, సిండికేటు లాల్ బహదూర్ శాస్త్రీని బలపరిచింది. ఆయన అజాతశత్రువు అవడం చేత సునాయాసంగా నాయకత్వ పోటీలో నెగ్గారు. అయితే శాస్త్రి ఆకస్మిక మరణం సిండికేటుకు కొత్త గండం తెచ్చింది.
అప్పటికే ఇందిరా గాంధీ రాజకీయాలలో చాలా రోజులు నుండి ఉన్నా ఆవిడంటే ఎందరికో చిన్న చూపు. డా. లోహియా సైతం ఆమెను గూంగీ గుడియాగా వర్ణించారు. ఆవిడను ప్రధాన మంత్రి చేస్తే తమ చెప్పుచేతుల్లో ఉంటుందని సిండికేటు భావించింది. చాచా నెహ్రూ కుమార్తె కాబట్టి ఆమెను గద్దెకెక్కించాలని ప్రచారం చేసి పంతం నెరవేర్చుకున్నారు.
ఏకయి వచ్చిన ఇందిరా మేకవ్వడానికి 1967 ఎన్నికలు తోడ్పడ్డాయి. కామరాజ్ & పాటిల్ ఓడిపోవడము, సంజీవరెడ్డికి పోటీగా బ్రహ్మానంద రెడ్డి ఎదగడమూ లాంటి పరిణామాలతో ఇందిరా గాంధీకి ఈ ప్రాంతీయ నాయకులతో అవసరం తీరిపోయింది. చివరికి సిండికేటు మొరార్జీతో చేరింది అయినా ఫలితం శూన్యం.
అవునండీ సిండికేత్ - ఇండికేట్ గొడవలూ, పాత(సంస్థాగత)కాంగ్రె - కొత్త కాంగ్రెస్ గొడవలూ అన్నీ గుర్తున్నాయి.
తొలగించండిAdem prasna...eedesam etu pothundi ITALY vaipu gaaka.......kaakapothe adhah paathaalaaniki
రిప్లయితొలగించండిhttp://newsinsight.net/Thegatheringstorm.aspx#page=page-1
రిప్లయితొలగించండి