ఈ క్రింది విపుల వ్యాసం తెలుగుభాషకు పుట్టిల్లు తెలంగాణా అన్న అక్షరసత్యాలు బ్లాగు టపాకు సమాధానంగా, విశదీకరణగా వ్రాస్తున్నాను. ఇది కేవలం తెలుగుభాషకు సంబంధించిన టపాయే కాని దీనిలో రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు.
చదువరులు దయచేసి ఒక్క విషయం గమనించాలి. నాకు అక్షరసత్యాలు బ్లాగు వారిపై ఏమీ కక్షా కార్పణ్యాలు లేవు. కేవలం తెలుగుభాషకు పుట్టిల్లు తెలంగాణా అన్న టపాలోని విషయానికి సంబంధించి మాత్రమే ఈ టపా ఉద్దేశించబడింది.
ఇది తెలుగుభాషకు సంబంధించిన విషయం కాబట్టి స్పందిస్తున్నాను కానీ, ఇందులో రాజకీయ కోణం వెతికి నన్ను అల్లరి పెట్టటానికి ప్రయత్నించకండి. ఎవరైన తెలిసో, తెలియకో అలాంటి ఉద్దేశంతో స్పందిస్తే జవాబు వచ్చే అవకాశం దాదాపు శూన్యం అని గ్రహించండి. అనవసర చర్చలలోకి తెలుగుభాషని ఈడవటానికి ప్రయత్నించవద్దు దయచేసి.
నాదీ అని తెలుగు వాళ్ళంతా గర్వపడే భాష తెలుగుభాష. అందులో తెలంగాణా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళని వెలివెయ్యా లనుకోవటం మంచిది ఆలోచన కాదు. సదరు టపా ఆ పని చేయటం బాధాకరం.
నిజానికి తెలుగుభాష స్వరూపం ఎక్కువగా మారింది ఫలాని చోట అని చెప్పలేం. వివిధప్రాంతాలలో వివిధ కారణాల వల్ల పరభాషా పదాలు తెలుగులో స్థానం సంపాదించుకున్నాయి. ఇందులో తప్పుపట్ట వలసినదీ, బాధపడ వలసినదీ ఏమీలేదు. తెలుగులో కవులు అన్ని ప్రాంతాలలోనూ ప్రభవించారు. మీరు కొన్ని ప్రాంతాల వాళ్ళే కవులు అని హ్రస్వదృష్టి ప్రదర్శించ కూడదు. అన్ని ప్రాంతాలలోనూ మాండలిక బేధాలు చిన్న పెద్దాగా ఉన్నా కూడా తెలుగు తేనెవాకయే కాని బాగుండక పోవటం లేదు. స్వచ్చమైన తెలుగు పలుకుబడి తెలంగాణాలోనే ఉంది అని అనుకోవటం కేవలం ప్రాంతీయాభిమానమే. అన్ని ప్రాంతాల్లోనూ తెలుగు స్వఛ్ఛంగా పలికే వారూ ఉన్నారు, తెలుగు మాట్లాడటానికి అవస్థపడే వారూ ఉన్నారు. దేశకాల పరిస్థితుల ప్రభావం అలాంటిది. మీరు తెలంగాణా వారు మాత్రమే వాడే స్వఛ్ఛమైన తెలుగు పదాలు అంటూఇచ్చిన పట్టీ చూదాం:
ఈ విధంగా ఎన్ని పదాలని విడమరచి చెప్పేది?
అక్షరసత్యాలు టపాలో మరో అరవై పదాలు కాబోలు ఉన్నాయి.
స్థాలీ పులాక న్యాయంగా మొదటి ఇరవై పదాలు కాబోలు విడమరచాను.
నిజానికి అన్ని పదాల సంగతీ విశదం చేయాలనుకున్నాను.
కాని ఈ మాత్రం చాలు అనిపించి ముగిస్తున్నాను.
పై విశదీకరణ చూసిన వారికి అక్షారసత్యాలు టపాలోని తొందరపాటు చక్కగా బోధపడుతుంది.
మరీ ఈ విషయాన్ని ఇంకా సాగదీసి చెప్పవలసిన అగత్యం కనిపించటం లేదు.
ఇది తొందరపాటులో జరిగిన పొరబాటు. ఆ టపా వ్రాసినవారికి నేను దురుద్దేశాలు ఆపాదించదలచుకో లేదు.
నిజానికి ఆ టపాలో, అసలు తెలుగంటే ఏదో గుర్తెరుగని అంధులను చూసివాడి అజ్ఞానానికి జాలిపడటం కంటే తెలంగాణా వాడేమీ అనలేడు అనే వాక్యం సీమాంధ్రులను ఉద్దేశించినదే కావచ్చునని స్పష్టంగానే ఉన్నా, ఇది అవగాహనాలోపమే కాబట్టి దానికి ఎక్కువ విలువ ఇవ్వనవుసరంలేదని భావిస్తున్నాను. పై పట్టికలోని వివరణ చూసాక వారు సరిగా అర్థం చేసుకోగలరని నా విశ్వాసం. వారు వారి వాదానికే కట్టుబడితే నేనేమి పట్టుబట్టను.
దయచేసి ఎవరూ అపార్థం చేసుకో వలదని నా విజ్ఞప్తి.

తెలంగాణా పలుకుబడి? | ఇతరప్రాంతాల పలుకుబడి? | వివరణ |
అంగడి | బజారు | అంగడి అన్నది అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగుపదమే సామెత: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లోశని అల్లరి [తెలంగాణం] దుకాణం [కోస్తా; తెలంగాణం; రాయలసీమ] bazaar: late 16th century: from Italian bazarro, from Turkish, from Persian bāzār 'market' see dictionary |
అమాస | అమావాస్య | అమావాస్య సంస్కృతపదం. అమాస : నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి) |
అయ్యా | ఆర్యా (సారు) | ఆర్యా అనేది సంస్కృతపదం. సర్ అనే ఇంగ్లీషు మాటకి ప్రాంతీయరూపంగా సారు అని వాడేది తెలంగాణాలోనే! మాస్టారు, టీచరు, మాస్టరు [కళింగ మాండలికం] పంతులు, సారు, అయ్యగారు [తెలంగాణ మాండలికం] అయ్యగారు, అయ్యవోరు, అయ్‌వోరు, అయ్యోరు [రాయలసీమ మాండలికం] |
అరుగు(అరగు) | వేదిక | వేదిక సంస్కృతపదం. వేదిక అనేది పండిత వ్యవహారంలోంచి సభాస్థలానికి వాదుకపదంగా ప్రచారం లోనికి వచ్చింది అరుగు (అరగు) అనేది ఆంద్ర్హ, తమిళ, కన్నడ భాషల్లో సమంగా కనిపించే పదం. అన్ని తెలుగు ప్రాంతాల్లోనూ వాడుకలో ఉన్నదే. |
ఆత్రం | ఆత్రుత | ఆత్రం అనేది తెలుగు, తమిళ, కన్నడాల్లో సమానంగా ఉంది. తెలుగువారు అన్ని ప్రాంతాల్లోనూ వాడుతున్నారు. ఆత్రుత అనేది ఆతురత అనే గ్రాంథికపదానికి వ్యావహారిక రూపం. |
ఆరతి | హారతి (నీరాజనం) | హారతి, నీరాజనం సంస్కృతపదాలు. ఆరతి అనేది హారతికి వికృతి పదం. కోస్తాజిల్లాల్లో ఈ పదం వాడరు నిజమే. నిజానికి ఆరతి అనే భ్రష్టరూపం ఉత్తరాది నుండి దిగుమతి పదంలా కనిపిస్తుంది. హిందీలో ఇదే ప్రసిథ్థం. |
ఆస | ఆశ | ఆశ సంస్కృతపదం. ఆస దానికి వికృతి. తధ్భవపదం. అంతే కాని అచ్చతెలుగుమాట కాదు. |
ఆసరా | ఆశ్రయం | ఆశ్రయం సంస్కృతపదం. ఆసరా అనేది తెలంగాణాలోనే ఎక్కువగా వాడుతారు. సకృత్తుగా కోస్తాంధ్రలోనూ వాడుక ఉంది. |
ఇంగలం | అగ్ని(అగ్గి) | అగ్ని సంస్కృతపదం కాగా ఆగ్గి అద్బవరూపం. ఇంగలం అనేది ఇంగాలో అనే ప్రాకృతభాషా పదంయొక్క దేశి రూపం. అచ్చతెలుగు కాదు. తెలంగాణాలో వాడుక హెచ్చు. కాని మనుచరిత్రలోనూ ఈ పదం వాడబడింది. |
ఈను, కాన్పు, నీల్ళాడు | ప్రసవం | ప్రసవం సంస్కృతపదం. ఈను, కను, కానుపు, నీళ్ళాడు అనే మాటలు తెలుగునాట అన్ని ప్రాంతాల్లోనూ వాడుతారు. |
ఉత్తగ | పుణ్యం | పుణ్యానికి అని ఊరికే దానంగా ఇవ్వటం అనే క్రియకు వ్యవహారంగా ఉన్న ఎత్తిపొడుపు మాట. ఉత్తినే, ఉత్తిగా అన్న తెలుగు మాటలు అదే అర్థంలో అన్ని ప్రాంతాల్లోనూ వాడుతారు |
ఎడ్దోడు | మూర్ఖుడు | మూర్ఖః అని సంస్కృతం. ఎడ్డి వాడు, ఎడ్డి మనిషి, ఎడ్డి వెధవ అనీ అని సీమాంధ్రలో వాడుతారు. ఎడ్డోడు అన్నది ఎడ్డివాడుకు సంక్షిప్తరూపం. |
ఎర్క | జ్ఞాపకం | జ్ఞాపకం అన్నది సంస్కృతపదం. ఎరుక అన్న మాట తెలుగునాట ఎల్లెడలా సుపరిచితమే |
ఏఱు | నది | నది సంస్కృతపదం ఏఱు అన్న తెలుగుమాట అన్ని ప్రాంతాల్లోనూ వాడుతారు. |
ఏర్పాటు | విభజన | విభజన సంస్కృతపదం. (division) ఏర్పాటు (arrangement) అన్నది దానికి సరియైన తెలుగుమాట కాదు. కాని ఏర్పాటు అనే మాట అన్ని ప్రాంతాల్లోనూ వాడతారు. |
ఒప్పుకొను | అంగీకారం | అంగీకారం అన్నది సంస్కృత ప్రయోగం ఒప్పుకొను అన్నది అంగీకరించు అన్న మాటకు సమానార్థకం. ఒప్పుకొను అన్న ప్రయోగం తెలుగునాట అన్ని చోట్లా ఉన్నదే. |
ఓకర, కక్కు | వాంతి | ఓకర, వాంతిలు అన్న మాట తెలుగు, తమిళ, కన్నడాల్లో ఒకే అర్థంలో ఉన్నాయు. కోస్తాలో ఓకర అని వాడటం వినలేదు. కక్కు అన్న మాట సీమాంధ్రలోనూ వాడుకలో ఉంది. |
ఓడు | పరాజయం | పరాజయం సంస్కృతపదం. ఓడు అన్నదానికి పరాజయము పొందు అని అర్థం. ఓడు అన్న మాట తెలుగునాట అన్ని చోట్లా వాడుతారు |
ఓపు | సహనం | సహనం సంస్కృతపదం. దీనికి తెలుగు మాట ఓపిక అన్నది తెలుగునాట అన్ని చోట్లా వాడుతారు. ఓపు అన్నదానికి సహనము చూపు అని అర్థం. ఓపు అన్నది నన్నయాదులు ప్రయోగించిన పదమే. |
కడుగు | శుభ్రం చేయు | శుభ్ర పదం సంస్కృతం. కడుగు దానికి తెలుగు మాట. కడుగు అన్న మాటను తెలుగునాట అన్ని చోట్లా వాడుతారు. |
కనికరం | కరుణ, దయ | కరుణ, దయ అన్నవి సంస్కృతపదాలు. కనికరం కరుణకు సమానార్థకమైన తెలుగుమాటగా తెలుగునాట అన్ని చోట్లా వాడుతారు |
ఈ విధంగా ఎన్ని పదాలని విడమరచి చెప్పేది?
అక్షరసత్యాలు టపాలో మరో అరవై పదాలు కాబోలు ఉన్నాయి.
స్థాలీ పులాక న్యాయంగా మొదటి ఇరవై పదాలు కాబోలు విడమరచాను.
నిజానికి అన్ని పదాల సంగతీ విశదం చేయాలనుకున్నాను.
కాని ఈ మాత్రం చాలు అనిపించి ముగిస్తున్నాను.
పై విశదీకరణ చూసిన వారికి అక్షారసత్యాలు టపాలోని తొందరపాటు చక్కగా బోధపడుతుంది.
మరీ ఈ విషయాన్ని ఇంకా సాగదీసి చెప్పవలసిన అగత్యం కనిపించటం లేదు.
ఇది తొందరపాటులో జరిగిన పొరబాటు. ఆ టపా వ్రాసినవారికి నేను దురుద్దేశాలు ఆపాదించదలచుకో లేదు.
నిజానికి ఆ టపాలో, అసలు తెలుగంటే ఏదో గుర్తెరుగని అంధులను చూసివాడి అజ్ఞానానికి జాలిపడటం కంటే తెలంగాణా వాడేమీ అనలేడు అనే వాక్యం సీమాంధ్రులను ఉద్దేశించినదే కావచ్చునని స్పష్టంగానే ఉన్నా, ఇది అవగాహనాలోపమే కాబట్టి దానికి ఎక్కువ విలువ ఇవ్వనవుసరంలేదని భావిస్తున్నాను. పై పట్టికలోని వివరణ చూసాక వారు సరిగా అర్థం చేసుకోగలరని నా విశ్వాసం. వారు వారి వాదానికే కట్టుబడితే నేనేమి పట్టుబట్టను.
దయచేసి ఎవరూ అపార్థం చేసుకో వలదని నా విజ్ఞప్తి.
చాలా బాగుంది. ఆ టపా చదివినప్పుడు నాకూ ఇలాగే అనిపించింది.
రిప్లయితొలగించండిశ్యామలరావుగారూ,
రిప్లయితొలగించండినాయకులు సృష్టించిన అభూత కల్పనలతో వారు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. ముందు ముందు ఉన్మాద స్థితికి చేరుకునే ప్రమాదంకూడా ఉంది. వారిని పట్టించుకోకండి.
"తెలుగువి" అనుకునే మాటల్లో ఇన్ని సంస్కృతపదాలున్నాయా? ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే నాకు తెలిసినంతవరకూ మన రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలవారిలోనూ చదువుకున్నవారి మాటల్లో మీరు చెప్పిన సంస్కృత పదాలు, మిగిలినవారి మాటల్లో మీరు చెప్పిన మాండలికపు పదాలు ఎక్కువగా దొర్లుతుంటాయి. ఏవో కొన్ని పదాలు ఒక ప్రాంతానికే పరిమితమయ్యాయేమోగాని, ఎక్కువపదాలు మాత్రం అందరి తెలుగులోనూ ఉండేవే. ఏది ఏమైనా మన ప్రాచీన కవులు అదృష్టవంతులు. ఇపుడు మనం తెలంగాణా, సీమాంధ్ర అంటూ గొంతు చించుకుంటున్నాంగాని, మన ప్రాచీన కవులకు ఈ భేదభావాలు తెలియవు. ఎంతైనా వారు అదృష్టవంతులు!
రిప్లయితొలగించండిసూర్యగారు, నిజంగా తెలుగులో లెక్కలేనన్ని సంస్కృతపదాలు కలగలసిపోయాయి.
తొలగించండిమాటవరుసకు దుప్పటి అనేది సంస్కృతపదం ఐన దుప్పటమ్ అనే మాట నుంది వచ్చిందని దాదాపుగా ఎవరికీ తెలియక పోవచ్చు. దుగ్+పటము => దుప్పటము => దుప్పటి. సంస్కృతంలో దుగ్ అనే ఉపసర్గకు ప్రశస్తమైన లేదా ప్రత్యేకమైన (special) అని అర్థం. పటము అంటే బట్ట అని అర్థం. పటము అనే పదం తెలుగుకవులు వాడినదే కూడా. ప్రసిధ్ధమైన కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి.. పద్యంలో 'పై నున్న పచ్చని పటము జార' అని కనిపిస్తుంది చూడండి.
అన్నం, భోజనం, సముద్రం, సంతోషం, విచారం, కోపం, ధనం, కర్మ, రూపం, తాపం, ఆలోచన, వేషం, చర్మం, మాంసం లాంటి సవాలక్ష నిత్యవ్యవహారంలో తెలుగునాట ఎల్లెడలా సంస్కృతపదాలు వాడుతూనే ఉంటాం కదా. ఇంకా బోలెడు రూపాంతరం చెందిన సంస్కృతపదాలు (తద్భవాలు) కూడా అందరం వాడుతూనే ఉంటాం.
కవులనూ కళాకారులనూ ప్రాంతాలవారీగా విభజించటాన్ని నేను ఎప్పుడూ తప్పుబడుతూనే ఉన్నాను. నేనేమీ లబ్ధప్రతిష్టుడను కాను కాబట్టి ఈ విషయంలో నేను పంపిన వ్యాసాలు ఒకటి రెండూ పత్రికలవాళ్ళు పట్టించుకోలేదు.
చక్కగా, వివరంగా రాసారు. ఆ టపాలోని పదాలు చూసాక, ఈ మాటలన్నీ మేమూ వాడేవేనే అని నాకూ అనిపించిందండి.
రిప్లయితొలగించండి’దుప్పటి’ వ్యుత్పత్తి తెలుసుకున్నాక ఆశ్చర్యపోయాను -ద్విత్వాక్షరాలతో కూడిన పదాలు చాలావరకూ తెలుగువే అనే సూత్రం ఒక్కటే తెలిసినవాణ్ణి లెండి.
"కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి.." పద్యం నాకు బాగా ఇష్టమైన, నేను ఎప్పుడూ పాడుకుంటూండే పద్యాల్లో ఒకటి సార్.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి"అక్షర సత్యాలు /సత్యమే జయించుగాక..........." లో వస్తున్న పరిశీలన లేని రాతలకేం గాని!
వేరు వేరు తెలుగు మండలాల్లోని పలుకుబళ్లు, అచ్చ తెనుగు మాటలు, ఇంకా సంస్క్రత పదాల నుండి యేర్పడిన తెనుగు రూపాలను వాడుకలో ఉంచుతూ కాపాడుకోవలసిన అవసరం మిక్కుటముగా ఉంది.
ఈ మధ్య పత్రికల్లో వచ్చింది. ఎంతవరకూ నిజమో! ఈ ప్రాంతంభాషకు తెలుగు అని పేరు పెడదాం - ఆ ప్రాంతం భాషకు ఆంధ్రం అని పేరు పెడదాం అని ఒక చోట తీర్మానం చేసారట. ఇలాంటి మేథావులు దేశాన్ని భ్రష్టుపట్టించటానికి తప్ప ఎందుకన్నా పనుకొస్తున్నారా అని?
రిప్లయితొలగించండి