కొంత వెదికిన తరువాత నాకు వ్యాసభారతం (సంస్కృతమూలం) ఆన్‌లైన్‌లో తెలుగులో చదువుకొనే అవకాశం కలిగించే సైట్ కనిపించింది.
మహాభారతం https://sanskritdocuments.org వారి పేజీల్లో ఒకటి. ఇక్కడకు వెళ్ళిన తరువాత మనకు Devanagari (and other Indian scripts from each sarga page) అని లింక్ కనిపిస్తుంది. దాన్ని తెరవండి.
మనకు పర్వాల పేర్లు దేవనాగరిలోనే కనిపిస్తాయి. మనకు కావలసిన పర్వం పేరు మీద ఉన్న లింక్‌ను క్లిక్ చేసి తెరవండి. నేను सभापर्वम् తెరుస్తున్నాను. ఇప్పుడు మనకు సభాపర్వం పేజీ దేవనాగరి లిపిలో తెరుచుకుని కనిపిస్తుంది.
ఇబ్బంది లేదు. ఆపేజీలో పైన కుడివైపున ఒక చిన్న డబ్బాలో మనం కావలసిన భాషను ఎన్నుకోవచ్చును. నేను తెలుగును ఎన్నుకున్నాను.
చక్కగా శ్లోకాలన్నీ అన్నీ తెలుగులిపిలో కనిపిస్తున్నాయి చదువుకుందుకు వీలుగా. మొత్తం సభాపర్వం అంతా మనకు ఒకే పేజీగా కనిపిస్తుంది!
ఇలాగే మనకు కావలసిన పర్వం తాలూకు మూల గ్రంథపర్వాన్ని చక్కగా చదువుకోవచ్చును.
ఇలా ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నది కేవలం మూలగ్రంథం మాత్రమే.
ఇదంతా తెలుగులిపిలో ఉన్నా, గ్రంథభాష సంస్కృతమే.
మూలగ్రంథం శ్లోకాలతో కావాలీ, తెలుగులిపిలో చదువుకోవాలీ. అంతేకాదు తెలుగులో అర్ధతాత్పర్యాలు కూడా కావాలీ అనుకొనే వారికి కూడా ఒక ఉపాయం ఉంది. గీతాప్రెస్ వారు అటువంటి విధంగా వ్యాసభారతాన్ని అచ్చుపుస్తకాలుగావేసి అమ్ముతున్నారు. ధర నాకు గుర్తున్నంతవరకూ ప్రస్తుతం రెండున్నరవేలు అనుకుంటాను. హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌లో గీతాప్రెస్ వారి విక్రయశాల ఉందని ఫోన్ ద్వారా మాట్లాడినప్పుడు చెప్పారు.
చాలా మంచి సమాచారం ఇచ్చారు.నేను ఆ సైటును చూస్తున్నాను.అక్కడ వేదసంహితలు కూడా ఉన్నాయి.ఋగ్వేదం రెండు అష్టకాలనూ డౌన్లోడ్ చేసుకున్నాను.
రిప్లయితొలగించండిచరిత్ర గురించీ, అందులోనూ మన దేశపు చరిత్రలో ఇతరులు దూర్చిన అబధ్ధాల గురించీ మన తరంలో నాకన్న ఎక్కువ ఎవరికీ తెలియదు."బదునాఱువది యైన భార్గవరామాకృతిని గుపితభావంబుఁ దాల్చి బ్రాహ్మణ ద్రోహు లయిన రాజుల నిరువదియొక్క మాఱు వధియించి భూమి నిఃక్షత్త్రంబు గావించె" అని పొర్తన భాగవతం చెప్తున్న పరశురాముడి నిక్షత్రం కధ యూరప్ నుంచి ఇక్కడి సంస్కృతిలోకి చిత్పవన్ల పేరున దూరిన యూదులు ఇరికించిన కధ అని మీకు తెలుసా!"నేకవింశతితమం బైన బుద్ధనామధేయంబునం గలియు గాద్యవసరంబున రాక్షస సమ్మోహనంబుకొఱకు మధ్యగయా ప్రదేశంబున జినసుతుండయి దేజరిల్లు"నని భాగవతం వర్ణించిన సుగత బుధ్ధుడు పూర్వ సామాన్య సకం 1800 నాడు జీవించినట్టు చారిత్రక సాక్ష్యాలు ఉన్న యదార్ధ వ్యక్తి అని మీకు తెలుసా!"Light of the Asia" అన్న పేరున ప్రపంచ ఖ్యాతిని గడించిన గౌతమ బుధ్ద్గుడికి ఆ పూర్వ సామాన్య శకం 600 నాడు జీవించి ఉన్నట్టు తిరుగు లేని భౌతిక సాక్ష్యం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని మీకు తెలుసా!
భారతం వేదవ్యాసుల వారి పదివేల శ్లోకాలు లక్ష శ్లోకాలకి పెరగడం గురుంచి నేను చెప్పినది శాసనాల సాక్ష్యం ఉన్న భోజరాజు తన రాజ్యంలో జరిగిన,జరుగుతున్న సంగతులను గుదిగుచ్చిన చరిత్ర.ఇతిహాసం అనే పదం యొక్క అర్ధం కూడా అదే.ప్రాచీనులు అప్పటికి తాము కూర్చగలిగిన చరిత్రని కూర్చి ఇతిహాసం అని పేరు పెట్టేశారు గాబట్టి అప్పటివాళ్లు ఇతిహాసం అని చెప్పిన రెండు మాత్రమే ఇతిహాసాలు అవుతాయి అనే మీ వాదన నాకు నచ్చలేదు. అందువల్ల కొంత కోపం వచ్చిన మాట వాస్తవం.
బ్రాహ్మణులు అందరూ మీలా నాలా సత్యనిష్ఠ ఉన్నవాళ్ళు కారు.1905ల నాడు సైతం అప్పటికి హిందువుల మత విషయాల మీద అదికారం చెలాయిస్తున్న శంకరపీఠాధిపతుల నుంచి శ్రీముఖాలు ఇప్పించి కమ్మవారికి ఉన్న దాసు అనే కులనామాన్ని నిషేధించిన అధములు కూడా ఉన్నారు.మీరు ఉదహరించిన గ్రంధాన్ని రచించిన వ్యక్తి సత్యనిష్ఠ ఉన్నవాడని తెలిశాకనే దాన్ని ప్రామాణికం కింద తీసుకుంటాను.
వయస్సులో మీకంటే చిన్నవాణ్ణి,చనువు చూపించానే తప్ప పెద్దలని అధిక్షేపించే కుసంస్కారిని కాను.
జై శ్రీ రాం!
నేనైతే సభాపర్వం పేజీని pdf ఫైలు రూపంలో భద్రపరచుకున్నాను. ప్రతిసారీ సైటుకు పోనవసరం లేకుండా.
రిప్లయితొలగించండి