నిదురమ్మా రామనామం వదలలేనే నన్ను
వదలిపోవే ఓ నిదురమ్మా
నిదురన్నది సహజాతము నిన్ను నేనేమని
వదలిపెట్టి పోదునురా నిదురపోరా
వదలలేను రామనామం నిదురపోనే ఓ
నిదురమ్మా దండాలే వదలిపోవే
నిదురలో కలలు వచ్చు నిదురపోరా హరిని
సదయుని దరిసించవచ్చు నిదురపోరా
అది యెంత నిశ్చయమే హరిని కలగనుట ఓ
నిదురమ్మా దండాలే వదలిపోవే
నిదురలేక నీరసించి నీవు హరీ యందువురా
నిదురనైన హరిస్మరణ నిన్ను విడువదు
నిదురనైన హరిస్మరణ నిలచియుండునా భలే
నిదురమ్మా స్వాగతమే నీవిక రావే
వద్దు వద్దంటూనే నిదురను స్వాగతించడం బాగుంది.
రిప్లయితొలగించండి