18, మే 2020, సోమవారం
సేవజేసె పక్షిరాజు శ్రీరామునకు
సేవజేసె పక్షిరాజు శ్రీరామునకు
భూవలయమునకు వచ్చిన శ్రీవల్లభునకు
అతడు జటాయువట హరితండ్రికి మిత్రుడట
ప్రతిన జేసి యెదిరించె రావణాసురుని
యతని మిత్రధర్మమున కమితసంతుష్ఠుడై
అతులితమగు నపవర్గము నందించె విభుడు
అతడు జటాయువున కన్న యతడి పేరు సంపాతి
అతడు లంకలోన సీత నరసి చెప్పెను
ప్రతిగ రెక్కలను బొందె పక్షీంద్రుడు తక్షణము
ప్రతిలేని రామమహిమ ప్రకటించె నాతడిటు
పాడు నాగపాశములు పట్టు టెఱిగి ప్రభువును
కీడును తప్పించగ నక్షీణబలుడు గరుడుడు
వేడుకతో వచ్చి నిజవిభుని రక్షించి పలు
కాడెను నీ వాడననుచు అంజలించి ప్రేమతో
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీ పద్యాలు మాకు మద్యాల వలె ఉన్నాయి. మధ్య మధ్యలో కాస్త గద్యంతో కూడా సంధ్యలలో సందర్భ వివరణ కూడా అందించగలరు. రుచి ఎరిగిన నాలుక నంజునకు...ధన్యవాదాలు..👌👍🙏
రిప్లయితొలగించండి