12, మే 2020, మంగళవారం
బలే వాడవయ్యా నన్ను పంపిన దెందు కయ్యా
బలే వాడవయ్యా నన్ను పంపిన దెందు కయ్యా
యిలాతల మెల్ల దిఱిగి యిట్టే వెనుదిరుగుటకా
పిన్నలకు నిన్ను గూర్చి వివరింప బంపితివి
తిన్నగ నీగొప్ప నా తెలివిడికి
పన్నుగ నా బుధ్ధికి తెలియ వచ్చినంత పలుకక
కొన్నినాళ్ళిందున కులికి కూళ నగుదునా రామ
నీ నిజభక్తుల గలసి నివసించ బంపితివి
మానితమగు తెలివి మప్పి నీవు
కాన నీదు భక్తకోటి కలసి పాడుచుందు గాని
మాని యన్యదైవముల మరగుదునా రామ
నిన్ను గూర్చి పాడుటకై నియమించి పంపితివి
మన్నికైన బుధ్ధినిచ్చి మరి నీవు
యెన్నడైన నిన్ను మఱచి యితరుల పొగడుదునా
నన్ను గన్న తండ్రి శ్రీమన్నారాయణా రామ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
శ్రీ గురుభ్యోనమ:
రిప్లయితొలగించండిఅద్భుతమైన బ్లాగ్. ఇన్నాళ్లు చూడ్లెక పొయినందుకు విచారిస్తున్నాను.
లలిత సహస్ర నామాల గురించి వెతుకుతుంటే లభ్యమయింది.
మీకు శతకోటి నమస్కారములు.
దయ చేసి బ్లాగ్ శీర్షిక లో శ్లోకం అర్ధం వివరించగలరు.
"దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః"
ధన్యవాదములు
శ్రీనివాస రాజన్
అత్తాపూర్ , హైదరాబాద్
9492047128
ssr1220@gmail.com
https://vignanam.org/mobile/
రిప్లయితొలగించండిఈ వైదిక విజ్ఞానం అనే Link
అన్ని భాషలలో ఇంతవరకు మీరు చూసి ఉండరు
ఏ Book తో పని లేకుండా సమస్త దేవతల, దేవుళ్ళ స్తోత్రాలు, అస్త్రోత్రాలు , శతనామాలు, సుప్రభాతాలు, చాలీసాలు, హారతులు భగవద్గీత పతంజలి యోగ సూత్రాలు
ఒకటేమిటి మీరు ఉహించలేనివి
భారతమాత కు సంభందించిన
అన్ని వందేమాతరం జనగణమన సరేజహాసే అచ్చా మాతెలుగు తల్లికి దేశభక్తి ,జాతీయ గీతములు
సాయిబాబా అన్ని హారతులు అన్నమయ్య, రామదాసు త్యాగరాజు కీర్తనలు
ఇవి ఒక ఉదాహారణ మాత్రమే ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో....
ఇది మీకు జీవితాంతం మీతో ఉంచుకోతగిన Link .దీని కోసం ఎంతో శ్రమ పెట్టి ఇది తయారు చేసిన వారికి పాదాభివందనము.
ధన్యవాదాలండీ.
తొలగించండి