22, మే 2020, శుక్రవారం

పెద్దపెద్ద వరము లిచ్చు దేవుడుపెద్దపెద్ద వరము లిచ్చు దేవుడు మన

      పెద్ద లెఱిగించినట్టి దేవుడు

పెద్ద పెద్ద కన్నులున్న దేవుడు బొల్లి

      గద్ద నెక్కి తిరుగుచుండు దేవుడుసురలైనను తుదకు శరణు జొచ్చునట్టి దేవుడు

నరుక కెల్ల నాయకుడై నడచినట్టి దేవుడు

పరమాత్ముడయ్యు వట్టి నరుని వలె మెలగిన

మరియాదాపురుషోత్తమ మహామూర్తి వీడువలరాజుకు మించి యంద మొలికించిన దేవుడు

తుళువలను ధరనుండి తొలగించిన దేవుడు

నలుగడల ధర్మమును నడిపించిన దేవుడు

కొలుచు నట్టి వారి కెల్ల  కొంగుబంగరు వీడుతన పేరే సుమా భవతారక మను దేవుడు

మునిముఖ్యుల తపము లరసి మోక్షమిచ్చు దేవుడు

వనజాక్షి సీతతోడ వసుధనేలు రాముడు

మనకు సదా సేవ్యుడైన మాధవుడే వీడు


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.