21, మే 2019, మంగళవారం
చిక్కునో దొంగల చేతికి తాళాలు
చిక్కునో దొంగల చేతికి తాళాలు
మక్కువతో చేరునో మంచివారిని
తెలుగువారి యదృష్టము తెలంగాణ కొంతగ
తెలిపినది దానజేసి తెలియవచ్చె
తలరాత ప్రకారమే తలపులు జనులకని
కలిగినదే మేలను కలన వా రుందురని
సమయ మాసన్నమాయె సరిజూడ యాంద్రులకు
విమలోదారబుద్ధి విభవ మెట్టిదో
ప్రమత్తులై యాశపోతు రాయళ్ళను రప్పింతురొ
తమకు మేలు చేయు వారి తప్పక గమనింతురో
కర్మము నడిపించు రీతి కలుగు జనుల బుధ్ధులు
నిర్మమలై దైవముతా నెగడు గాక
ధర్మాధర్మములు వ్యత్యస్తమగునొ మానునో
మర్మ మెఱిగినది నీవె మహిని రామచంద్రుడా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రాజకీయాల గురించి మీ బ్లాగులో వ్యాఖ్యలు వ్రాయవద్దని మీరు అభ్యర్ధించారు.
రిప్లయితొలగించండిరామచంద్రునితో రాజకీయాలేవిటండీ ?
రామదాసుని జైలునుండి విడుదల చేసినట్లు దొంగలచేతికి ఆయనే తాళాలిస్తాడేమో ? హిందువుగా మతమార్పిడి చేయబోతున్నారట కదా ?
మీ రన్నది నిజం. 4/16న నేను రాజకీయాది విషయాలు రామకీర్తనల పేజీల్లో వలదని అన్నాను. ఇక్కడ ఈకీర్తనలో జనాంతికంగా జనుల అభిప్రాయాలు ఫలితాలూ వారివారి సంఘాతకకర్మఫలానుసారంగా ఉంటాయని ప్రస్తావించటం మాత్రమే చేసాను. కాని ఏ రాజకీయపార్టీకి సంబంధించి అనుకూల లేదా ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. కాబట్టి నా విధానాన్ని నేనే త్రోసిరాజన లేదని భావిస్తున్నాను. కాని చదువరులు వద్దు అన్న పక్షంలో ఈ కీర్తనను తొలగించాలని అనుకుంటున్నాను.
తొలగించండిఈ బ్లాగులో రాజకీయ వ్యాఖ్యలు చేయరాదన్న మీ అభ్యర్ధనని నేను గౌరవిస్తున్నాను. ఈ పోస్టు అనవసరం అన్నది నా అభిప్రాయం.
తొలగించండినీహారిక గారూ, ఈ కీర్తన కారణంగా అపోహ తల యెత్తటం విచారకరం. అందుచేత మీ సూచన మేరకు దీనిని తొలగిస్తున్నాను.
తొలగించండిమంచివారెవరూ లేనపుడు తాళాలు దొరికేది దొంగలకే. చింతించవలదు. ఏ రకమైన ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారో ఆ రకమైన ప్రభుత్వమే ఏర్పడుతుంది!
రిప్లయితొలగించండిఅవునండి.
తొలగించండి