16, మే 2019, గురువారం

ఆగండాగం డీ కాగితపు పడవల దుర్యోగ మేల రామనౌకా భోగముండగ


ఆగండాగం డీ కాగితపు పడవల దు
ర్యోగ మేల రామనౌకా భోగముండగ

ఇంతపెద్ద నౌకయుండ వింతవింత ప్రయాణము
చింతల పాలౌచు మీరు చేయనేల
ఎంతకాల మైన గాని ఎంతదూర మేగెదరో
యింతలో నంతలో నివి యెల్ల మునుగవో

ఈ నౌక నెక్కితే యెకాయెకీ గమ్యమే
కాని మజిలీల పేర కాలయాపన
లేనే లేదండి మీరు లేనిపోని శంకలకు
లోనుగాక రామనౌక లోన వచ్చిచేరండి

సదుపాయము లున్నది చాల పెద్ద నౌక యిది
ముదితులై వచ్చి మీరిది యెక్కుడు
పదేపదే పడవమారు పనిలేదు మీకింక
ఇదే మంచి యవకాశ మిదే మంచి ప్రయాణము

2 వ్యాఖ్యలు:

  1. రామనౌక అనే భావన చాలా బాగుంది. మీ అనేకానేక కీర్తనలలో ఇది అతి విశిష్టంగా తోస్తుంది. చదివినంతనే రామనౌక ఎక్కాలనిపిస్తుంది.

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.