12, మే 2019, ఆదివారం

వచ్చేపోయే వారితో వాదులెందుకు


వచ్చేపోయే వారితో వాదులెందుకు వారు
మెచ్చకున్న లోటేమి మేదిని మనకు

భూమిని పుట్టేరు బోధలేక పెరిగేరు
కామాదులు చెప్పినట్లు గంతులేసేరు
నీమాట యెత్తితేనె నిప్పులే చెఱగేరు
సామాన్యులు వారితో చాలులే వాదాలు

రాముడిదే తప్పని రావణుడే గొప్పయని
యేమేమో వదరేరు యెఱుక చాలక
రాముడే లేడనుచు రంకెలే వేసేరు
రాముడా నీవు లేక రావణు డున్నాడా

అవకతవక సిధ్ధాంతా లనుసరించి చెడేరు
శివకేశవబేధాలే చెప్పికుళ్ళేరు
భవమోచన వారితో వాదులు చేసేనా
యివల నవల నున్న నిన్నెన్నిపూజించేనా

1 కామెంట్‌:

  1. // "వచ్చేపోయే వారితో వాదులెందుకు వారు మెచ్చకున్న లోటేమి మేదిని మనకు" //

    అక్షరలక్షల విలువచేసే మాట చెప్పారు. మనసుకు క్లేశం తప్ప ఏం జరగదు వాదనల మూలాన.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.