5, మే 2019, ఆదివారం

చాలు చాలు నీ కృపయే చాలును మాకు


చాలు చాలు నీ కృపయే చాలును మాకు
కాలునిచే భయమింక కలుగదు మాకు

కాముడనే రాక్షసుడు కదిసి కడుధూర్తుడై
మామీద పరచ మోహమార్గణమ్ముల
నేమి సాధనము మాకు నెదిరించ వానిని
రామనామ బాణమే రక్షణ మాకు

తామసత్వము చేత తప్పులే కుప్పలై
పామరులము చేసితిమి పాపము లెన్నో
పాములై ప్రారబ్ధఫలములు పైకొన్నచో
రామనామ కవచమే రక్షణ మాకు

భూమిమీద కష్టములు పుట్టలే పుట్టలై
యేమి సుఖము లేదాయె నించుకైనను
యేమి యుపాయము లేని సామాన్య జనులము
రామనామ మంత్రమే రక్షణ మాకు

1 వ్యాఖ్య:

 1. కాముడనే రాక్షసుడు కదిసి కడుధూర్తుడై
  మామీద పరచ మోహమార్గణమ్ముల
  నేమి సాధనము మాకు నెదిరించ వానిని
  రామనామ బాణమే రక్షణ మాకు
  ఈ లైన్స్ చాల బాఉన్నాయి సర్ మీకు తెలుగు సాహిత్యం లిరిక్స్ కావాలంటే Telugu Lyrics ఈ వెబ్సైటు ను ఒక సారి చూడండి Visit Aarde Lyrics

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.