9, ఏప్రిల్ 2018, సోమవారం
నరులకష్టము లన్ని నారాయణ
నరులకష్టము లన్ని నారాయణా నీవు
నరుడవై తెలిసితివి నారాయణా
పరమపురషుడ వయ్యు నారాయణా గర్భ
నరకమున జొచ్చితివి నారాయణా
దురితాత్ములను గూల్చ నారాయణా నీవు
ధరమీద కలిగితివి నారాయణా
పరిణయవేళనే నారాయణా నీకు
పరశురాముడు తగిలె నారాయణా
ధరనిచ్చుటకు మారు నారాయణా నిన్ను
తరిమిరే యడవులకు నారాయణా
అడవి నసురుల వలన నారాయణా నీకు
పడరాని పాట్లాయె నారాయణా
కడకొక్క తుంటరి నారాయణా సతికి
నెడబాపెనే నిన్ను నారాయణా
కడచి వారాన్నిధిని నారాయణా తుళువ
మడియించితివి నీవు నారాయణా
పుడమి నేలెడు వేళ నారాయణా సతిని
విడువవలసి వచ్చె నారాయణా
ఈ రీతిగా నీకు నారాయణా పుడమి
ఘోరాపదలు గలిగె నారాయణా
ధీరత్వమును జూపి నారాయణా ధర్మ
వీరత్వమును జూపి నారాయణా
ఆరాధ్యదైవమై నారాయణా మాకు
దారిచూపితి వయ్య నారాయణా
శ్రీరామచంద్రుడని నారాయణా నిన్ను
నోరార పొగడెదము నారాయణా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పనికిరాని(వాడి) సూచన:
రిప్లయితొలగించండిప్రతీ రెండో లైనులో ఉత్తి నారాయణ బదులు హరి నారాయణ అని ఉంటే బాగుండేది అనిపించిందండి.
ఉదా|| పరమపురషుడ వయ్యు నారాయణా గర్భ
నరకమున జొచ్చితివి హరి నారాయణా
దురితాత్ములను గూల్చ నారాయణా నీవు
ధరమీద కలిగితివి హరి నారాయణా
మీ ఉత్సాహం బాగుంది.కాని మరలా మీరు పాదం 'నిడివి' గురించే ఆలోచిస్తున్నారేమో అనిపిస్తోందండి. అదలా ఉంచండి. మీరు ఈకీర్తన అచ్చైన విధానం చూసి చరణానికి ఎనిమిది పాదాలనీ, సరి పాదాల్లో యతిని పాట్ంచలేదనీ భ్రమపడుతున్నారేమో అని కూడా ఒక చిన్న అనుమానం. ఈ చరణమనే కాదు అన్ని చరణాల్లోనూ ఈకీర్గనలో ప్రాసయతిని వినియోగించటం జరిగింది.
రిప్లయితొలగించండినిజానికి ఈపాదాల నిడివి ఎక్కువ కావటం వలన ఒక్కోపాదమూ రెండు లైనులుగా విడదీసి చూపటం జరిగింది అంతే. నిజానికి మొదటి చరణం ఇలా ఉంది:
పరమపురషుడ వయ్యు నారాయణా గర్భ నరకమున జొచ్చితివి నారాయణా
దురితాత్ములను గూల్చ నారాయణా నీవు ధరమీద కలిగితివి నారాయణా
పరిణయవేళనే నారాయణా నీకు పరశురాముడు తగిలె నారాయణా
ధరనిచ్చుటకు మారు నారాయణా నిన్ను తరిమిరే యడవులకు నారాయణా
ఐతే మీరన్నట్లు హరినారాయణా అని ముగిస్తే చరణాలకు మరింతగా దైర్ఘ్యం పెరగటమే కాక లయ కూడా కొంత ఇబ్బందికి గురి అవుతుంది.
అయ్యో నాకు అసలు యతి గతి అనేవి తెలియవండి. ఏదో పాడుకోవడానికి బాగుంటుందేమో అనిపించింది అంతే. నాకొచ్చిన ఒకేఒక పద్యం "ఏ.తె" (ఏమో తెలియదు). క్షమించాలి.
రిప్లయితొలగించండి