ఈరోజు 2018-04-14న పల్లెప్రపంచంలో ఈ కీటోజెనిక్ డైట్ (కీటోడైట్ క్లుప్తంగా చెప్పాలంటే) పైన పుంఖానుపుంఖాలుగా వస్తున్న సమాచారాన్ని గురించి ఈ క్రింది వ్యాఖ్యను ఉంచాను:
శ్రీరామకృష్ణ గారు కాని, మీరు కాని వైద్యరంగనిపుణులు కారు. ముఖ్యంగా ఎండోక్రైనాలజీ రంగానికి సంబంధించిన పరిజ్ఞానం ఉన్నవారు కాదు.
మీరు ప్రచారం చేస్తున్న ఆహారవిధానాన్ని కీటోడైట్ అంటారు. సరే ఏదో ఒకటి. ఇది పాటించటం వలన కలిగే అద్భుతఫలితాల గురించి రామకృష్నగారు ఎలాగూ ఊదరగొడుతున్నారు. మీరూ ఆయనవిధానానికి ప్రచారకార్యకర్తృత్వం వహిస్తున్నారు. ఈ విధానం దీర్ఘకాలంలో ఎలాంటి ఫలితాలనిచ్చేదీ అన్నవిషయంపై ఇంకా కూలంకషంగా పరిశోధన జరగవలసి ఉంది.అది జరుగకుండా ఏదీ మా అమ్మగారు వాడారూ, మా స్నేహితులు వాడారూ మీరందరూ వాడండీ అని ప్రచారం చేయటం సరైనదిగా అనిపించదు. అది పధ్ధతి కూడా కాదు. అది శాస్త్రీయవిధానం అస్సలు కానేకాదు. కాని మీ దృష్టిలో అదే సరైన విధానం - ఎందుకంటే మీకు వైద్యపరిశోధనా విధానం గురించి అవగాహన లేకపోవటమే కారణం. దురదృష్టం ఏమిటంటే ఒకరంగంలో సాధికారికంగా మాట్లాడాలంటే ముందు ఆరంగంలో నైపుణ్యం ఉండాలన విషయం మీరు ఒప్పుకోరు. మీ నమ్మకాలే మి దృష్టిలో నిజాలు! అంతే.
రాబోయే కాలంలో ఏమైనా దుష్పరిణామాలు వెలుగులోనికి వస్తే, ముఖ్యంగా తీవ్రమైన పరిణామాలు ఎదురైతే ? వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి?
రామకృష్ణ గారే కాదు, మీలాంటి ప్రచారసారధులూ ఆ దుష్పరిణామాలకు సంపూర్ణంగా బాధ్యులే అన్నది మరవకండి. అప్పుడు మీరు ఎన్ని కొత్త వ్యాసాలు వ్రాసినా ఎంత దిద్దుబాటు ప్రచారం చేసినా జరిగిన నష్టం పూడ్చలేనిదే అవుతుంది. అది మరొక థలిడోమైడ్ ట్రాజెడీగా సంఘాన్ని దెబ్బకొట్ట వచ్చును! ఆలోచించండి.
మీ ప్రచారపుహోరులో వైద్యరంగం పైనా వైద్యులపైనా కూడా కొన్ని అనుచితవ్యాఖ్యలు - ముఖ్యంగా దొంగడాక్టర్లు వగైరా అంటూ - చూసాను. ఇదంత సరైన పధ్దతి కాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ కాదు.
మీ దృష్టిలో మీరు నూటికినూరుపాళ్ళు ప్రజాసేవకులమని భావిస్తున్నారని అనిపిస్తున్నది. కాని తమకు తెలియని రంగాల్లో వేళ్ళూ కాళ్ళూ పెట్టి జనానికి హితబోధలు చేయటం అంత హర్షణీయమైనది కాదు.
ఇలా వ్రాసినందుకు మీకు ఆగ్రహం కలుగవచ్చును. దానికి నేనేమీ చేయలేను. నా అభిప్రాయాన్ని నిర్మొగమాటంగా తెలియజేయాలనే తప్ప మీపైన ఏమీ దురుద్దేశంతో వ్రాయలేదని గమనించవలసినదిగా అభ్యర్థిస్తున్నాను.
శ్రీ కొండలరావు గారి నుండి సమాధానం ఇలా వచ్చింది:
మీ వైఖరి గతంలోనూ నాకు తెలుసుకనుక మీరిలా మాత్రమే చెప్పగలరు. జ్ఞానం కొందరికే తెలుసునన్న అహంకారపు వైఖరి అలా మాట్లాడిస్తుంది. అది మీరు కావచ్చు. ఇంకొకరు కావచ్చు. మీరు పూజించే దేవుడు రామాయణాన్ని మీవంటి అద్భుత మహా పండితులు కాకా బోయవాడైన వాల్మీకే వ్రాశాడంటారని మీ వంటి పండితులు చెప్తుండగా నేను విన్నాను. రామక్రుష్ణ కూడా బోయవాడిలాంటి వాడే. ఆయన డాక్టర్లను విమర్షించడం లేదా వారి పాత్రను తక్కువ చేయడం లేదు. నేను కూడా డాక్టర్లు దొంగలు అనలేదు. కొందరు దొంగ డాక్టర్లు అన్నాను. దానికి కట్టుబడి ఉన్నాను. డాక్టర్లలోనూ నీచులు, దుర్మార్గులు, దౌర్భాగ్యులు ఉన్నారు. వైద్యం పేరుతొ సమాజాన్ని ఎంత చిన్నా భిన్నం చేస్తున్నారో, బ్రతకలేక చావలేక సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో, పడ్డా వాలాది ఖర్మఫలమని వదిలేయాలనుకునే మీ వంటి ప్రబోధకులు ఆలోచించరు. అలా చేయడం పాపమనుకునే బాపతు కాదా మీరు. దయచేసి క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఫలాయనవాదం చేయకుండా..... నేను చర్చకు సిద్ధం.
1) ఫలితాన్ని మించిన శాస్త్రీయత ఏముంది?
2) ఇపుడు షుగర్ కు, గుండె జబ్బులకు వాడుతున్న మందుల వల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ కు సమాధానం ఏమి చెప్తారు మీలాంటి మహా విజ్ఞానులు?
3) ఇప్పటిదాకా కోడిగుడ్డు ఎల్లోని ఎవరు ఎందుకు తినోద్దన్నారు? ఫేట్ ని నెయ్యి, మీగడ వంటి వాటికి ఎవరు దూరం చేసారు?
4) మళ్ళీ ఇపుడు తూచ్ కోడిగుడ్డు ఎల్లో తినాలి అని చెప్తున్నదెవరు?
5) డాక్టర్లు సైతం వారి ఫెమిలీలను, స్వయంగా వారి శరీరాలను నాశనం చేసుకున్నారు. కేవలం వారు మెడికల్ గైడ్లిన్స్ ప్రకారమే నడుచుకుంటారు. వారికా పరిధి ఉంది. కాదంటారా? చదివింది బట్టీ పట్టి అప్పజెప్పడానికి, పరిశీలన ద్వారా కనుక్కొవడం సైన్సె అవుతుందని మీవంటి మేధావులు గుర్తించాలని మనవి. ప్రక్రుతిలో ఉన్నదానినే సైన్స్ కనుక్కోగలదు తప్ప సైన్స్ ప్రక్రుతిని స్రుష్టించలేదని గుర్తించాలి. మేధావులు, జ్ఞానులు మాత్రమే ఏదైనా చెప్పాలనుకునె మూర్ఖత్వం అంత మంచిది కాదు. మేధావులు, జ్ఞానులు సైతం సామాన్యులనుండీ, ప్రక్రుతినుండీ నేర్చుకోవలసిందే.
6) కొన్ని దశాబ్దాలపాటు కోడిగుడ్డు ఎల్లో తినోద్దన్న డాక్టర్లు, ఇపుడు తినమని చెప్తున్నారు. ఫేట్ వలన గుండె జబ్బులు రావని తేల్చారు. మరి అప్పటి గైడ్లైన్స్ ఎందుకలా చెప్పారు, మీరు మొత్తుకునే సైన్స్. ఇపుడు అదే సైన్స్ ఇపుడిలా ఎందుకు చెప్తున్నది? ఇందులో డాక్టర్ల ను తప్పు పట్టాల్నా? మెడికల్ గైడ్లైన్స్ ని తప్పు పట్టాల్నా? దీనివల్ల ఇన్నాళ్లూ కొన్ని కోట్లమంది బలయ్యారు. లక్షల కోట్ల మెడికల్ మాఫియా జరిగింది. దానికి మీరు ఏమి చెప్తారు శ్యామలీయం గారు.
7) అసలు మీకు జీవన విధానం కు , వైద్య విధానం కు తేడా తెలుసా?
8) రామకృష్ణ విధానం ను పూర్తిగా స్టడీ చేసారా?
9) రామకృష్ణ మందులు వాడకం గురించి చెప్తున్నారా? ఆహార నియమాలు గురించి చెప్తున్నారా? నేను స్టడీ చేసే ప్రచారం చేస్తున్నాను. మీవంటి వారి అనుమానాలను, జ్ఞానం కొందరి సొత్తే కావాలని ఆశించేవారి వైఖరిని నేను సమర్ధించను. భయపడను.
10) రామకృష్ణ సూచించిన ఏ పదార్ధం వలన ఏ అనర్ధం ఉంది? భవిష్యత్తులోనైనా అనర్ధం వచ్చే అవకాశం ఉందీ చెప్పగలరా? ప్రకృతి సిద్ధమైన ఆహారం మనిషికి ఎపుడూ కీడు చేయడాన్న ప్రాధమిక సత్యాన్ని సైతం మీరు ఒప్పుకోరు. ఎందుకంటే మీకు తెలిసిందే జ్ఞానం. మీరు చెపితే జ్యోతిష్యం కూడా శాస్త్రీయం అయి తీరాలి. లేకుంటే కూడదన్న మొండి వైఖరి మీది.
11) ఈ విధానం ను ప్రచారంలోకి తెచ్చింది రామకృష్ణ కాదు వైద్యులే నన్నది, ఇప్పటికే వైద్యులు దీనిని ఆమోదిస్తూ తమకు తమ పేషంట్లకు చక్కని ఫలితాలు రాబడుతున్నది గమనించారా? కెనడాకు చెందిన జాసన్ ఫంగ్ దీనిని బయటకు తెచ్చారు. ఆయన వైద్యుడే. కొన్ని వందల ఏళ్లుగా కీటో డైత్ గురించి తెలిసినా మెడికల్ గైడ్లైన్స్ ఎందుకు ప్రచారం చేయడం లేదు. వైజాగ్ కు చెందిన పి.వి.సత్యానారాయణ గారు ప్రముఖ వైద్యులే. ఆయన ఈ విషయంలో డాక్టర్లు అప్డేట్ కావాలని చెప్తున్నది మీరు గమనించారా? నాకు తెలిసి మీరు ఈ విషయాన్ని అధ్యయనం చేయకుండా ప్రతిభా పాఠవం కోసమె కావాలని విమర్షిస్తున్నారు. కాదంటారా? అద్యయనం చేస్తే ఈ విధానంలొ ఏమి తప్పు ఉంది చెప్పండి? దానినీ ప్రచారం చేస్తాను.
12) డాక్టర్ పి.వి.సత్యానారాయణ స్వయంగా పాటించి ఫలితం పొంది, పేషంట్లకు మంచి ఫలితాలు అందిస్తున్నారు ఈ విధానం తోనే నన్నది మీకు తెలుసా?
మంచిని ప్రచారం చేయడానికి నేను ఎపుడూ ముందే ఉంటాను. నేను వాడి ఫలితం పొందాను. నాకు తెలిసిన వందాలది మంది ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతున్నది. డాక్టర్లే ప్రిస్క్రిప్షన్లొ దిక్కుమాలిన మందులు బదులు ఆహారం గురించి వ్రాసేలా మంచి రోజులు రావాలని ఆశిద్దాం.
ఐతే ఆయన, తన వ్యాఖ్యను ఉపసంహరించుకొని మరలా ఇలా అన్నారు:
మీ ప్రశ్నకు కాస్త సమయం తీసుకుని సంయమనంతో సమాధానం చెప్తాను. ముందొక కామెంట్ వ్రాసాను. దానిని డిలీట్ చేసాను.
సరే, కొండలరావు గారు సంయమనంతో ఏదో చెబుతానన్నారు కాబట్టి వేచి చూడాలి. ఆయన తొలగించిన వ్యాఖ్యను ఎందుకు ప్రచురిస్తున్నట్లు నా బ్లాగులో? ఎందుకంటే అది ఆయన తన బ్లాగులో ఉంచిన వెంటనే కాక కొద్ది సమయం తరువాత తొలగించారు. అప్పటికే అది మాలికలో ప్రచురితం ఐపోయింది. ఈ సమయం (సా॥5గం.)లో కూడా అదింకా కనిపిస్తూనే ఉంది. చదివే వారు చదువుతూనే ఉన్నారు. కాబట్టి నేను దానిని ఎత్తి నా బ్లాగులో చూపటంలో దోషం లేదనే భావిస్తున్నాను. (గమనిక: కొండలరావు గారు తొలగించిన వ్యాఖ్య ఏప్రిల్ 15వ తారీఖున 9:45 ని. సమయంలొనూ కనిపిస్తూనే ఉంది మాలికలో. అంటే తొలగింపులను మన బ్లాగుల్లో చేసినా మాలిక పట్టించుకోదు! ఇది అందరమూ గమనించ వలసిన ముఖ్యవిషయం. ఒకసారి మాలికలోనికి వచ్చేసిన వ్యాఖ్య కొట్టుకుపోవాలంటే కొన్ని రోజులు పట్టవచ్చును!)
నా వ్యాఖ్యనూ కొండలరావుగారు (కొంత తక్కువ సంయమనంతోనే అనుకోండి) చేసిన ప్రతివ్యాఖ్యనూ చదివి ఎవరికి తోచిన అభిప్రాయానికి వారు రావచ్చును. నా వైఖరిలో ఉన్నదో ఆయన సమాధానంలో ఉన్నదో సవినయత అన్నది ఎవరి కళ్లతో వారు చదువుకొని ఎవరి మనస్సులో వారు నిశ్చయించుకొన వచ్చును.
ఈ కీటోడైట్ గురించి నేను గమనించిన కొన్ని వ్యాసాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.
(November 15, 2005) Ketogenic Diet Prevents Seizures By Enhancing Brain Energy Production, Increasing Neuron Stability
(November 17, 2015) Endurance athletes who 'go against the grain' become incredible fat-burners
(January 12, 2017) Melanoma mutation likes fat for fuel
(February 28, 2017) Could a ketogenic diet alleviate gout?
(February 27, 2017) Ketogenic diet shown safe, effective option for some with rare and severest form of epilepsy
(May 26, 2016) Fasting-like diet reduces multiple sclerosis symptoms
(Sep 5, 2017 ) Eat fat, live longer? Mouse study shows a high fat diet increases longevity, strength.
(Apr 14, 2016) Lower-carb diet slows growth of aggressive brain tumor in mouse models
నా వ్యాఖ్యనూ కొండలరావుగారు (కొంత తక్కువ సంయమనంతోనే అనుకోండి) చేసిన ప్రతివ్యాఖ్యనూ చదివి ఎవరికి తోచిన అభిప్రాయానికి వారు రావచ్చును. నా వైఖరిలో ఉన్నదో ఆయన సమాధానంలో ఉన్నదో సవినయత అన్నది ఎవరి కళ్లతో వారు చదువుకొని ఎవరి మనస్సులో వారు నిశ్చయించుకొన వచ్చును.
ఈ కీటోడైట్ గురించి నేను గమనించిన కొన్ని వ్యాసాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.
(November 15, 2005) Ketogenic Diet Prevents Seizures By Enhancing Brain Energy Production, Increasing Neuron Stability
(November 17, 2015) Endurance athletes who 'go against the grain' become incredible fat-burners
(January 12, 2017) Melanoma mutation likes fat for fuel
(February 28, 2017) Could a ketogenic diet alleviate gout?
(February 27, 2017) Ketogenic diet shown safe, effective option for some with rare and severest form of epilepsy
(May 26, 2016) Fasting-like diet reduces multiple sclerosis symptoms
(Sep 5, 2017 ) Eat fat, live longer? Mouse study shows a high fat diet increases longevity, strength.
(Apr 14, 2016) Lower-carb diet slows growth of aggressive brain tumor in mouse models
(February 17, 2010) High-fat ketogenic diet to control seizures is safe over long term, study suggests
(October 22, 2009) Low-Carb Diet Speeds Recovery From Spinal Cord Injury
(May 23, 2012) Reverse engineering epilepsy's 'miracle' diet
(Jul 6, 2017) How high-fat diet impacts colorectal cancer. Study lays the foundation for new therapeutics
(October 20, 2004) Mayo Clinic Finds Ketogenic Diet May Be Started As An Outpatient Treatment For Children With Epilepsy
(July 13, 2016) Your best diet might depend on your genetics. Mouse study shows the need for an individualized approach to nutrition.
( August 28, 2008) High Cholesterol Levels Drop Naturally In Children On High-fat Anti-seizure Diet, Study Show.
(December 17, 2015 ) High fat/low carb diet could combat schizophrenia
(December 6, 2012) How calorie restriction influences longevity: Protecting cells from damage caused by chronic disease
ఇంకా చాలానే పరిశోధనా పత్రాలున్నాయి పరిశీలించవలసినవి. వీలైనంత వరకూ దొరికిన వన్నీ కూడా ఇక్కడ పొందుపరుద్దామని అనుకుంటున్నాను. అందుచేత ఈటపా సమగ్రం కాదు. ఎప్పటికీ కాకపోవచ్చును. ఎప్పటికప్పుడు కొత్తలింకులు కలుపుతూ ఉంటాను కాబట్టి.
ఈ పరిశోధనాపత్రాలను గిరించి వీలైనంత సరళంగా తెలియజేయాలనే సంకల్పం ఐతే మంచిదే కాని అది నాకు వీలుపడక పోవచ్చును. ఇప్పటికే పనులవత్తిడి వలన ఊపిరి ఆడని పరిస్థితి. ఐనా ఉండబట్టలేక కొండలరావు గారికి ఒక ఉబోస ఇచ్చి చీవాట్లు తిన్నాను. ఇది ఒక పెద్ద చర్చ ఐతే నేను ఆఫీసుపనులు మానుకొని లేదా ఇంటిపనులు మానుకొని సమాధానాల మీద సమాధానాలు వ్రాస్తూ తప్పనిసరైన రక్షణాత్మకధోరణిలో వ్రాస్తూనే ఉండవలసి వస్తుంది. అలాంటి అవకాశం ఏమీ లేదు.
ముగించే ముందు ఒక మాట. కొండలరావు గారి రాబోయే సమాధానాన్నీ ఇక్కడ (అది వచ్చినప్పుడు) పొందుపరచటం అవసరం. అలా చేస్తాను కూడా. ఐతే ఈ వ్యవహారం పేరుతో ఆయనతో కాని మరొకరితో కాని చర్చలు చేస్తూ కూర్చోవటం కుదరదని చెప్పనవసరం లేదు.
పరిశోధకులు ఒకసారి అమ్మో కాఫి తాగితే ఆరోగ్యం బుచికోయమ్మ బుచికి అంటారు. ఇంకోసారి ఛి ఛీ. కాఫీ సుబ్బరంగా తాగండి ఒంటికి ఓటీ చేయదు అంటారు. అన్నిటికీ శాస్త్రం పనికిరాదేమో. ఇంతకీ రామకృష్ణ గారు ఏమి తినమంటున్నారో. అంతాకలిసి పేజానీకంతో కుచి కుచి కూనమ్మా ఆడుకుంటున్నారు.
రిప్లయితొలగించండికాఫీ మీద వచ్చిన ఈ పరిశోధనాపత్రాలు దాదాపు అన్నీ పాశ్యాత్యదేశాల నుండి వచ్చినవే. వాళ్ళు త్రాగే కాఫీ అంతా కేవలం డికాక్షనే. అదీ రెండు మూడువందల మి.లీ. తక్కువ ఉండదు. మనవాళ్ళు ఐతే మహా ఐతే ఒక పదిహేను మి.లీ. డికాక్షనుకు ఎనభై నుండి నూట ఇరవై మి.లీ. పాలూ ఒక పది గ్రా. పంచదారా కలిపి ఒక పాయసంలాగా చేసి మరీ సేవిస్తారు. అంటే ఒకడోసు కాఫీలో వాళ్ళది మూడువందల మి.లీ ఐతే మనది పదిహేను మి.లీ డికాక్షను. ఆమాత్రమూ మనం మహా ఇతే రోజుకు మూడు నాలుగుసార్లు తాగితే వాళ్ళలో అనేకులు అలా తాగుతూనే ఉంతారు రోజుకు పదిసార్లకి పైనా. వెరసి వాళ్ళు రోజులో చులాగ్గా మూడు నాలుగు లీ. కాఫీ డికాక్షను కానిచ్చేస్తే మనవాళ్ళు తాగేది అంతా కలిపి యభై మి.లీ మించదు. ఆమాత్రానికి మన కొంపేమీ మునగదు. ఆ పరిశోధనా ఫలితాలన్నీ వాళ్ళకే బాగా వర్తిస్తాయి. ఏమీ చింత పడకండి.
తొలగించండిరామకృష్ణ గారు రోజుకు డెబ్బై గ్రాముల నెయ్యి నూనె వెన్నపూస తీసుకోమ్మంటున్నారు. కుక్షిలో ఉపద్రవం అవుతుందేమో.
రిప్లయితొలగించండికావచ్చును.ఒకవేళ ఇబ్బంది వస్తే రామకృష్ణ గారి దగ్గరకే వెళ్ళాలి చికిత్స కోసం. కాని ఆయనకు వైద్యం చేయటం కుదరదు. ఆయన వైద్యులు కారు కదా అందుకని. వేరే వైద్యులు మిమ్లల్ని తప్పు పట్టవచ్చును. అలాగని సంకోచస్తే ఇబ్బంది ముదరవచ్చును. ఏం చేయాలో మీయిష్టం.
తొలగించండి