16, ఏప్రిల్ 2018, సోమవారం
చందురుని కంటె నీ వందగాడివే
చందురుని కంటె నీ వందగాడివే
యందు కింకేమి సందియము
శృంగారరామ నీ చేసిన సృష్టి నె
బ్భంగిని నినుమించు వాడుండును
అంగజగురుడా యందాల దేవుడా
బంగారు తండ్రి ఏ వంక నీకుండు
అందమైన యీ సృష్టి యందాల నీకళల
యం దొక్కకళ కాక యన్యము కాదే
యిందుగల చరాచరము లీనీచిత్కళలో
పొందెను తదంశలౌ నందచందములు
చందురున కున్న మచ్చలు నీకు లేవుగా
చందురుడు నీ కెటుల సాటివచ్చు
నందరిని చక్కగా నాదరించెడు రామ
చందురుడా నీకిదే సాగి మ్రొక్కేము
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గురువుగారు త్యాగరాజు స్వామి ఎందరో మహానుభావులు కీర్తనలో చందురు వర్ణుని అని ఎందుకు వ్రాశారు. రాముడు నీలవర్ణుడు కదా
రిప్లయితొలగించండిమీకు చిన్నగా సమాధానం వ్రాయట్ం కుదరక ఒకటపాయే వ్రాసాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి.
తొలగించండి(మీరు ఏమీ అనుకోకపోతే ఈబుచుకీ పిచికా అన్న పేర్లకు బదులు మీనిజనామధేయంతో వ్రాస్తే బాగుంటుందని నా సూచన.)
శ్యామలీయం కలం నుంచి కూదా సౌందర్యం,శ్రంగారం జాలువారుతున్నాయే!
రిప్లయితొలగించండిబుచికి అన్నమాట నాకు ఇష్టం. ఏ భావాన్ని చెప్పటానికయినా యిట్టె సరిపోతుంది. పైగా నా పేరుకు కూడా సరిపోతుంది. It is a harmless fun word which I like very much. మరీ serious గా ఉంటె నాకు బుచికి. బుచికిగా ఉంటుంది.
రిప్లయితొలగించండి