13, ఏప్రిల్ 2018, శుక్రవారం

ఇంతింతన రానట్టి దీతని మహిమఇంతింతన రానట్టి దీతని మహిమ
ఎంతవారి కైన భావ్య మీతని మహిమ

చెడుగు మీద పిడుగై చెలగెడు మహిమ అది
చెడినబ్రతుకు చిగురింప జేసెడు మహిమ
అడిగితే రాజ్యమిచ్చు నట్టిదా మహిమ అది
యడుగకయే రాజ్యమిచ్చు నట్టి దొడ్డమహిమ

యేవారి కైన సుఖమిచ్చెడు మహిమ అది
భావించిన భవరోగము బాపెడు మహిమ
సేవకుని బ్రహ్మనుగా జేసెడు మహిమ అది
దేవతలకు నిత్యసంభావనీయ మహిమ

ఇనకులేశుడు రాము డీతని పేరు ముక్తి
ధనము నిచ్చి ప్రోచు నీతని దివ్యమహిమ
మనుజుడై పుట్టిన మహావిష్ణు వితడు వీని
మనసార గొలువుడీ మంచి జరుగును