17, ఏప్రిల్ 2018, మంగళవారం

నానా విధముల


నానా విధముల నేను భ్రష్టుడ
ఐనను నిన్నెఱిగితి నింక శిష్టుడ

నాదైన నాబ్రతుకు నా గొప్పదన మనుచు
నీ దయా లేశముగ నే నెఱుగనైతి
చేదోడుపడు నిన్ను చిన్నబుచ్చితి నని
లో దలపగ నీదు నీలోని దయాగుణము

భయపడుచు భయపడుచు పదిమందికిని
జయపెట్టుట మానితిని స్వామీ నీకు
దయగల దొఱవైన నీకు తప్పు తోచదే
రయమున నాకష్ట మెఱిగి రక్షించినావు

దీనుడ నను దయతోడ తీర్చిదిద్ది నావే
ఈ నాటికి మంచిదారి నెఱిగెడు దాక
దీనిని నీ దయాధర్మదివ్యబిక్ష మందు
నేనెఱిగితి రామచంద్ర నిన్నెఱిగితి నిటుల

2 కామెంట్‌లు:

  1. "నాదైన నాబ్రతుకు నా గొప్పదన మనుచు
    నీ దయా లేశముగా నెఱుగనైతిని"
    lll
    ఎంత మంచి భావం?
    ఎంత మంచి కూర్పు!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.