దాదాపు ఒక నెల రోజుల నుండి చాలా తీవ్రమైన ఒత్తిళ్ళ మధ్యన ఉన్నాను.
అవి బహుముఖంగా ఉన్నాయి.
అందులో అసలు మనుష్యులంటేనే సర్వవిధాలా సంపూర్ణంగా నమ్మకం అనేది పోయిన పరిస్థితిని కల్పించిన సంగతీ ఉన్నది. మన్నించాలి. ఇప్పుడు వివరించలేను. ఎందుకంటే నా మనఃస్థితి అస్సలు బాగోలేదు కాబట్టి.
ఈ ఒత్తిళ్ళ ప్రభావం ఎంతగా ఉందంటే నా ప్రవర్తన నాకే సార్లు చిత్రంగా అనిపిస్తోంది. మాటల్లో తడబాటు వ్రాతలో అక్షరదోషాలూ పదాలు కొన్ని మనసులోనుండి కాగితంపైకి రాకుండా ఎక్కడికో ఎగిరిపోవటం. ఒకటి వ్రాయబోయి మరొకటి వ్రాయటం, ఏ పనిలోనూ ఏకాగ్రత కుదరక పోవటం. స్వభావవిరుధ్ధంగా తరచు అనేక విషయాలలో మరపుకు గురికావటం. స్థిరంగా ఉండలేక చేతిలో ఉన్న పనులు వాయిదా వేస్తూ పోవటం, చేసిన పొరపాట్లే పదేపదే వరసగా చేస్తూ ఉండటం.... ఇత్యాదులు.
ఆకాశంలో మబ్బులు ఎన్నిపట్టినా చివరకు అవన్నీపోయి అది నిర్మలం కావటం జరుగుతుంది.
అలాగే ఈ ఒత్తిళ్ళు దూరమై ఇతఃపూర్వస్థితికి వస్తానన్న నమ్మకం నాకుంది.
ఐతే వత్తిళ్ళను తగ్గించుకుందుకు నాకు వీలైన ప్రయత్నాలు నేను చేయాలి కదా.
అదే చేస్తున్నాను కూడా. కనీసం ఇంంతగందరగోళ స్థితిలోనూ సాధ్యమైనంతగా ప్రయత్నిస్తున్నాను.
అందులో తగ్గించుకోదగిన కార్యక్రమాలూ వ్యాపకాలూ తగ్గించుకోవటం ఒకటి.
ఈ బహుళమైన ఒత్తిళ్ళలో బ్లాగువ్యాసంగం కూడా ఒకటి అనిపిస్తోంది.
బ్లాగుటపాలు వ్రాసుకోవటంలో ఒత్తిడి ఏమీ లేదు. పోనీ ఒత్తిడి ఏమీ లేదని నేను అనుకుంటున్నాను.
కాని బ్లాగుల్లో వస్తున్న వ్యాఖ్యల ధోరణి వలన మాత్రం నాపై ఒత్తిడి చాలానే ఉంది.
ఈ వ్యాఖ్యలను నేను మాలిక వ్యాఖ్యలపుటలో చూస్తూ ఉంటాను.
ఈ మధ్యకాలంలో కొందరు చేసిన వ్యాఖ్యలను చదివి చాలా చాలా గ్లాని కలిగింది.
ఆవ్యాఖ్యలపైనా అలాంటి వ్యాఖ్యలను చేసిన, ఇంకా చేస్తూనే ఉండే వ్యాఖ్యాతలపైన నేను కూడా వ్యాఖ్యల రూపం లోనూ, కొన్ని సార్లు టపాల రూపంలోనూ స్పందించటం అందరూ గమనించే ఉంటారు.
ఇలా స్పందించవలసి రావటమూ స్పందించటమూ కూడా అసలే పలు ఒత్తిళ్ళ మధ్యన ఉన్న నన్ను మరింతగా ఒత్తిడికి గురిచేయటం జరుగుతోంది.
అసలు అలా స్పందించటం అవసరమా అనో స్పందించకపోతేనేం అనో అనుకోవలసింది. కాని నా బాధ్యత అని అనుకున్నాను. చాలా ఒత్తిడికి గురయ్యాను. స్పందించి ఒత్తిడిని మరింతగా పెంచుకున్నాను. ఇందువలన నేను సాధించినది ఏమన్నా ఉందో లేదో కాని నా మనశ్శాంతిని నేను మరింతగా చెడగొట్టుకున్నాను. అందుకే అలోచనలో పడ్డాను ఈవిషయంలో.
సభామర్యాదావిరుధ్దంగా ఉండటానికి ఏమాత్రం సంశయించని బ్లాగర్ల పేర్లతో పాటు శ్యామలీయం అన్న పేరు కూడా మాలిక వ్యాఖ్యలపుటలో కనిపించటం నాకు ఎంతమాత్రమూ ఇష్టం లేదు.
సభామర్యాదను పాటించని బ్లాగర్లను భళీభళీ అని ప్రశంసించే వారూ తెలుగుబ్లాగులోకంలో నాకు బాగానే కనిపిస్తున్నారు.
అందుచేత ఇకపైన నా పేరుతోకాని నా బ్లాగరు నామధేయం ఐన శ్యామలీయం పేరుతో కాని ఏవిధమైన వ్యాఖ్యలనూ చేయబోవటం లేదు. అంటే అనామకంగా వ్యాఖ్యలు వేస్తారా అని ఎవరైనా సంశయించ నక్కర లేదు. అలా ఇంత వరకూ చేసిందీ లేదు ఇకముందు చేసేదీ లేదు.
అలాగే మాలిక వ్యాఖ్యలపుటను చూడబోవటమూ లేదు.
బ్లాగువ్యాసంగం అంటే నేను వ్రాసుకొనే అథ్యాత్మికరచనలు నా ఒత్తిడిని తగ్గించేవే కాబట్టి వాటివల్ల నాకు ఇబ్బంది లేదు.
ఆ రచనలు కూడా చదివే వాళ్ళున్నారు కొంచెం మంది. వారికి మరొకసారి నా ధన్యవాదాలు. సరసవ్యాఖ్యలను ప్రచురించటానికి ఇబ్బంది ఉండదు. కాని స్పందించి సమాధానాలను ఇవ్వగలనని అనుకోవటం లేదు. అందుకు తగిన మనఃస్థితిలో లేను కాబట్టి అందరూ అర్థంచేసుకొన వలసిందిగా చదువరులకు వినమ్రంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.

ఆరోగ్యం జాగ్రత్తండి.ఇటువంటి పరిస్థితి నాకు వచ్చింది. మనం నమ్మిన విలువలను కొంతమంది పూర్తిగా దెబ్బతీయాలను కొంటారు. అది కొంతమంది తెలియక చేస్తారు. కొంతమంది కావాలనే చేస్తారు. బ్లాగులు సోషల్ మీడియాలో రాయటం కూడా ఒక విధమైన పోరాటమే.
రిప్లయితొలగించండిమీ స్వాంతనవాక్యాలకు అనేక ధన్యవాదాలండీ
తొలగించండికాలమేఘంబు లన్నియు కరగుదాక
నెప్పు డేమౌనొ తెలియగా నెవరి తరము
సకలకష్టంబు లా రామచంద్రమూర్తి
చెండు నందాక నోర్చుచు నుండు వాడ
బ్లాగు తో పోలిస్తే ఫెస్బుక్ లో ఎంతో మంది అడ్డుగోలు గా వాదించే వాళ్ళు తగులుతూంటారు. మనసుకు ఎదనిపిస్తే అది రాసేయటం. తెలిసిన విషయాలు చెప్పబోతే మొండిగా వాదిస్తూ తెలివిని ప్రదర్శిస్తూంటారు. వాళ్ల దృష్టిలో మీవంటి వారి సలహాలు జగదేకవీరుని కథ సినేమాలో పాతమంత్రిలా అనిపిస్తాయి. కొత్త మంత్రి వర్సెస్ పాత మంత్రి ల తెలివిని ప్రదర్శించటం ఎలా ఉంట్టుందో ఈ రెండు వీడీయోలు చూడండి మీకే అర్థమౌతుంది
తొలగించండిhttps://www.youtube.com/watch?v=RJeO8cFL0ew
https://www.youtube.com/watch?v=RJeO8cFL0ew
https://www.youtube.com/watch?v=AxPDMuml0QE
జగదేకవీరుని కథ సినిమా బాగుంటుంది. ఎన్నోసార్లు చూసాను దాన్ని. అవును. నేను జనదృష్టికి ఒక పాతమంత్రిలా కనిపిస్తుంటే ఆశ్చర్యం లేదు. ఇంక ఎవరితోనూ వాదించేందుకు ఆసక్తి లేదు. ఒక మిత్రురాలు బురదజోలికి పోనేలా అని సలహా ఇచ్చారు ఈ సందర్భంలో. అంతే మరి.
తొలగించండికొంతమంది బ్లాగు పోస్టుల వలన, కామెంట్ల వలన అందరూ ఇంచుమించు మీరు ఎదుర్కొనే పరిస్థితులను ఎదురుకుంటూనే ఉన్నారు. అయితే మీరు తీసుకున్న నిర్ణయం మంచిదేనని అనుకుంటున్నాను. కొన్నాళ్ల పాటు బ్లాగులోకానికి దూరంగా ఉండటం మరీ మంచిదని నా అభిప్రాయం మీరు కోలుకునే వరకూ!
తొలగించండిమరిన్ని పోస్టులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.@ K.S.చౌదరి
చౌదరి గారు,
తొలగించండిధన్యవాదాలు. తాత్కాలికనిర్ణయం కాదు.చెడు వాతావరణంలో ఇమడలేను.
బ్లాగులోకం అనే దానికి దూరంగానూ ఉండ దలచుకోలేదు, దగ్గరగానూ ఉండ దలచుకోలేదు. దాన్ని పట్టించుకొన దలచుకోలేదు. నా బ్లాగుల్లో నా కవిత్వనివేదనం నేను చేసుకుంటాను. ఎవరిని ఉద్దేశించి అన్నది అందరికీ తెలిసిందే కాబట్టి వివరణ ఇవ్వనవసరం లేదు. బ్లాగర్లలోనూ ఇతరులలోనూ దీనికీ పాఠకులున్నారు. వారి సంఖ్య అల్పమా అనల్పమా అన్నది అసంగతమైన ప్రశ్న కాబట్టి అది వదిలేద్దాం. ఇతరత్రా బ్లాగర్లలో ఎవరెవరి మాటలకో సమాధానాలు ఇవ్వటం పైనా చొప్పదంటు చర్చల్లో తలదూర్చటంపైనా ఆసక్తి లేదు. ఉన్న ఆసక్తి అంతా కవితావ్యాసంగం పైననే. ఎవరో ఏదో అంటారనో అనుకుంటారనో ఆలోచించబోవటంలేదు కాబట్టి నిబ్బరంగానే ఉండవచ్చును నేను. ఇలా ఉండటమే బ్లాగులోకానికి దూరంకావటం అంటారా, మంచిదే లెండి. అలాంటి దూరం తప్పకుండా మంచిదేను. ఇది మౌనమూ కొందరికి నిరుత్సాహం కలుగుతుందీ అంటారా, దానికి వినమ్రంగా మన్నించమని అడగటం తప్ప మరేమీ చేయలేను. అసమంజసమైన వాతావరణం ఏర్పడటానికి కారణభూతులైన వారూ, దాన్ని ఉపేక్షించిన చిన్నాపెద్దా అందరూ కూడా, కనీసం ఇలా మిగిలిన బ్లాగర్లలో మరికొందరు భవిష్యత్తులో మౌనం వహించకుండా జాగ్రత వహించుకొన వలసి ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ ఆటవిక రాజ్యంలో నేను ముందుముందు కనిపిస్తానని ఆశించకండి దయచేసి.
తొలగించండిమీరు అవసరమైనదానికన్నా ఎక్కువ sensitive శ్యామలరావు గారూ. ఇదివరలో కూడా ఒకసారి నేను ఇదే మాట చెప్పాను. చివరికి నేననేదేమిటంటే మనం పట్టించుకుంటున్న కొద్దీ మరీ రెచ్చిపోయే వ్యక్తులుంటారు కదా; మిమ్మల్ని సైడ్-లైన్ చేయగలిగాం అనే 'ఆనందం' అటువంటి వ్యక్తులకు మీరే కలగనీయకూడదు. కాబట్టి మరీ withdraw అయిపోకుండా మామూలుగా ఉండండని నేను చెప్పేది.
రిప్లయితొలగించండిఈ విధంగా రెచ్చిపోయే వ్యక్తుల్లో కొందరు మహానుభావులుగా కీర్తించబడే వా రుండవచ్చును. కొందరు మత్సరగ్రస్తమానసు లుండవచ్చును. కొందరు స్వయంప్రకటితసర్వాధికారు లుండవచ్చును. కొందరు తమతమ ఎజండాల ప్రకారం నీచప్రవృత్తినీ సమర్థించే వాళ్ళుండవచ్చును. అంతా ఒక పెద్ద రణరంగం. ఇది నాకు సరిపడదు. నా బ్లాగులు నేను వ్రాసుకోవటానికి నాకు మనస్కరించుతూ ఉన్నంత కాలమూ నాదారిన నేను వ్రాసుకుంటాను. ఆ విషయంలో ఎవరి అనుమతులూ అవసరం లేదు కదా. ఇకపోతే బ్లాగులోకం పేరిట నడుస్తున్న మిగిలిన విషయాలపై నాకు ఆసక్తి లేదు. కాబట్టి క్షమించండి. ఇందులో మీరు దయచేసి గమనించవలసింది ఒకటుంది. నేను నా వ్యాసంగం నుండి విరమించటం లేదు. ఇతరులను పట్టించుకోవటం అనే ప్రవృత్తినుండి మాత్రం విరమిస్తున్నాను. అంతకంటే మరేమీ లేదు. ఇదేదో తమవిజయం అనుకొనే వారుంటే ఉండనివ్వండి. వారిని కట్టడి చేయటం నా అవసరం కాదు. అలాంటి అవసరం ఉందనుకుంటే సమిష్టిగా ఈబ్లాగులోకమే ఏదన్నా ఆలోచించుకోవాలి.
తొలగించండి