27, అక్టోబర్ 2017, శుక్రవారం

మనసు నీ నామమునుమనసు నీ నామమును మరుగవకుండు గాక
తనువిది నీ సేవకు తప్పకుండు గాక

అన్నివేళలను నిన్నే యనుగమింతు గాక
అన్నిటికి నీయాదర మండ యగును కాక
మిన్ను మన్నేకమైన నిన్ను విడువ గాక
నన్ను నీవు విడువవని నమ్మియుందు గాక

లోకము ననుమెచ్చినా కాక మెచ్చకుండిన
శోకవ్యామోహములు లేకుండును కాక
చీకాకు పరచునట్టి సిరులు సంపదలకై
నీ కన్యుల నాశ్రయించ బో కుందును కాక

బ్రతుకు నీ కంకితమై వరలుచుండు కాక
మెతుకు నిన్ను తలపక  కతుక కుందు కాక
ప్రతిదినము నిన్ను గూర్చి పాడుచుందు కాక
ప్రతిగ శ్రీరామ మోక్షపద మిత్తువు కాక


7 కామెంట్‌లు:

 1. మనకు లక్ష్యాన్ని నిలపడం కోసం ఏర్పాటు చేసుకున్న అర్చామూర్తుల పట్ల మమకారాన్ని పెంచుకోవటం ఆధ్యాత్మికంగా తప్పు కదా!దేవుణ్ణి చూసినవారు ఎవరూ లేరు - ఆ రూపాని మనకు వర్ణించీ చిత్రించీ శిల్పించీ ఇచ్చిన యోగులూ శిల్పులూ కూడా చూసినవారు కాదు,అవి దైవాని గురించిన వారి జ్ఞానానికి ఇచ్చిన రూపం మాత్రమే.జ్ఞానం ద్వారా తెలుసుకోవలసిన విషయంలో రూపానికి ప్రాధాన్యత ఇవ్వటం అనే వైరుధ్యాన్ని ఎట్లా పరిష్కరించాలి?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆ రూపాని మనకు వర్ణించీ చిత్రించీ శిల్పించీ ఇచ్చిన యోగులూ శిల్పులూ కూడా చూసినవారు కాదు.

   మీ అభిప్రాయంతో విభేదిస్తున్నాను. రూపం అనేది కొంతమంది ఋషులు దర్శించినది. దానిని సామాన్య ప్రజలకు వారు అందివ్వటం జరిగింది. యొగ శాస్రాలలో సూచించిన విధంగా, నియమ యమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా మంత్ర జపం చేస్తున్నప్పుడు కొంత కాలానికి మంత్ర సిద్ది కలిగి దైవ సాత్ క్షాత్కారం కలుగుతుందని పెద్దలు చెపుతారు. ఇక్కడ సాత్ క్షాత్కారం అంటే దేవుడు ఒకరూపం లో కనిపిస్తారు. ఆ రూపాన్నే మనకు ఋషులు ఒక వినాయకుడిగా, ఒక ఒక నటరాజు గా అర్చామూర్తులను ఏర్పాటు చేశారు.

   ఈ అంశాన్ని ప్రస్తుత కాలం సైన్స్ కోణం లో చూస్తే, మంత్రం అనేది శబ్దం. ఈ శబ్దాన్ని మనం నియమానలను పాటిస్తూ క్రమం తప్పకుండా జపిస్తే, మన శరీరం ప్రకృతి లోని ఫ్రీక్వెన్సికి ట్యున్ అయ్యిపోతుంది.
   sound energy has been converted to light energy.దైవదర్శనం కలుగుతుంది. ఈ అనుభవం ఆ వ్యక్తి మాత్రం పరిమితం. ఐతే మన సమాజం లో, ఈ దర్శనం పొందిన ఋషులు, మునులు,ఆచార్యులు, గురువుల కి ప్రత్యేక స్థానం ఎందుకు వచ్చిందంటే, అటువంటి వ్యక్తుల ప్రభావం వారితో నివసించిన బంధు మిత్రులపై, ఆ కాలం లోని సమాజంపై ఎంతో ఉంది. ఉదా|| 1000 ఏళ్ల క్రితం రామానుజ చార్యులు చేసిన కృషి, వైష్ణవ మార్గంలో ప్రయాణించి 600 ఏళ్ల క్రితం అన్నమాచార్యులు రాసిన పాటలు, ఇవ్వన్ని చిరకాలం వర్ధిల్లుతునే ఉంటాయి.

   అర్చామూర్తుల పట్ల మమకారాన్ని పెంచుకోవటం ఆధ్యాత్మికంగా తప్పు కదా!

   తొలగించండి
  2. Why world's largest particle physics lab CERN has a statue of Lord Shiva

   Why does one of the world’s premier research institutes have a statue of Shiva?
   Unveiled on June 18, 2004, the two-metre-tall statue was a gift from the Government of India. A plaque next to the statue, with a quote by Fritjof Capra, explains its significance: “Hundreds of years ago, Indian artists created visual images of dancing Shivas in a beautiful series of bronzes. In our time, physicists have used the most advanced technology to portray the patterns of the cosmic dance. The metaphor of the cosmic dance thus unifies ancient mythology, religious art and modern physics.”


   http://www.dnaindia.com/india/report-maha-shivratri-why-cern-the-world-s-largest-particle-physics-lab-has-a-statue-of-lord-shiva-2186655

   http://www.fritjofcapra.net/shivas-cosmic-dance-at-cern/

   How does quantum physics work, you may ask, what is it, and where does it come from?

   http://www.krishnapath.org/quantum-physics-came-from-the-vedas-schrodinger-einstein-and-tesla-were-all-vedantists/

   తొలగించండి
  3. UG SriRam
   మీ అభిప్రాయంతో విభేదిస్తున్నాను. రూపం అనేది కొంతమంది ఋషులు దర్శించినది. దానిని సామాన్య ప్రజలకు వారు అందివ్వటం జరిగింది.

   hari.S.babu
   వారు దర్శించారని మీరు భావిస్తున్నది వారి జ్ఞానం మాత్రమే!వ్యక్తంలోని సమస్తమూ మాయావృతమే,మన దేహాలూ,ఆ దేహంలోని నేత్రాలు చూసే మనచుట్టూ ఉన్న సమస్తమూ మాయావృతమే కదా,ఇంక దైవాన్ని చూడటం ఎట్లా సాధ్యం?వేదమే వీటన్నిటినీ అసలైన ఒకే ఒక సూర్యుడు మీ వూరి చెరువులోనూ మావూరి చెరువులోనూ కనిపించే బింబరూపాలు మాత్రమేననీ అసలైన దైవాన్ని ఎవరూ చూదలేరనీ అంటున్నది,గమనించండి!

   తొలగించండి
  4. హరిబాబు గారూ,

   అన్ని రూపాల్లోనూ ఉన్నది అసలైన దైవం యొక్క విభూతియే కాదా? ఏకం సత్ విప్రా బహుథా వదంతి అన్నప్పుడు బహుథాగా చెప్పబడినవి అసత్యాలన్న వ్యాఖ్యానం చేయకూడదు. ఉపాధిని బట్టి భవద్విభూతి విభిన్నంగా గోచరించవచ్చును దానికేమి. నీటిలో చంద్రబింబంగా కనిపించేది చంద్రుడే కాదా? యథా చంద్రమా జలే చంచలత్వం తథా చంచలత్వం తవాపీహ విష్ణోః.

   అందుకే

   గరిమన్ స్వర్ణమనేక భూషణములన్ కన్పట్టు చందంబునన్
   పరమాత్ముం డఖిలప్రపంచమయుడై భాసిల్లు నట్లౌటచే
   సురసిధ్ధోరగయక్షకిన్నరనరస్తోమాది శశ్వచ్చరా
   చరరూపోజ్వల సర్వభూతములకున్ సద్భక్తితో మ్రొక్కెదన్

   అన్నారు పరశురామపంతుల లింగమూర్తి గురుమూర్తిగారు శ్రీసీతారామంజనేయ సవాదం గ్రంథాన్ని ప్రారంభిస్తూ.

   తొలగించండి
  5. అవ్యక్తంలో ఉన్న సమతాస్థితి చెదిరి ఏర్పడిన వ్యక్తం నిర్మించబడిన ధాతువులు అయిదూ మాయ వల్లనే ఏర్పడినప్పుడు దృష్టి,శ్రవణం,స్పర్స అన్నీ మాయ కాదా?దైవానికి ఉన్న ముఖ్యమైన నామాలు అగోచరుడు,అవ్యక్తుడు అంటూనే అతనికి రూపం ఉన్నదనడం కొందరు ఆ రూపాన్ని చూశారు అనడం ఎంతవరకు సమంజసం?కవిత్వంలో చెప్పే ప్రతి భావానికీ లక్ష్యలక్షణ సంబంధం ఉంటుంది.అట్లానే దైవభావనకి లక్ష్యలక్షణసమన్వితంగా ఏర్పరచినవే ఈ మూర్తులు - కాదా?ఈ మూర్తులు వాటిని తీర్చిదిద్దినవారి జ్ఞానానికి మాత్రమే రూపాలు - అది నా భావం.

   తొలగించండి
  6. చర్చలవలన పెద్దగా ఉపయోగం ఉండదు. ఇక్కడ బోధయంత పరస్పరం అన్నధోరణి కాక నేనే రైట్ అన్న ధోరణి బ్లాగులోకంలో. అందుచేత చర్చలు చేయను. మీ భావం సమంజసంగానే ఉంది. కాని అదే పరమం కాదు. ఇంద్రియవ్యాపారాలు ఈశ్వరుణ్ణి సంపూర్ణంగా సిధ్ధింపజేసుకోలేవన్నది నిజమే కాని ఇంద్రియవ్యాపారాలకు యోగ్యతానుసారిగా గోచరం కావటం ఈశ్వరునికి అసాధ్యం అన్న ధోరణి సరికాదు. ఈశ్వరుడు అణోరణీయాన్ మహతో మహీయాన్. ఋషులు దర్శించిన విభూతులు వారి ఊహలు మాత్రమే అనుకోనవసరం లేదు. పోనివ్వండి. మీ ఆలోచన మీది తప్పుపట్టటం లేదు. కాని మీ ఆలోచనకు అన్యంగానూ అతిశయించీ ఈశ్వరవిభూతులు ఉండవచ్చును అని సూచించ సాహసిస్తున్నాను.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.