రానీ రానీ
రాముని నామము నోట
- నీనోట
పోనీ పోనీ
పోగైన పాపపు మూట
- నీమూట
మిక్కిలి సొగసైన మాట అది
మిక్కిలి విలువైన మాట
మిక్కిలి సులువైన మాట అది
మిక్కిలి సుఖమిచ్చు మాట
మిక్కిలి కుదురిచ్చు మాట అది
మిక్కిలి ఫలమిచ్చు మాట
మిక్కిలి తీయన్ని మాట అది
మిక్కిలి శుభమిచ్చు మాట
నూటికి కోటికి యొకనికి అది
నోటికి దొరకెడు మాట
నోటికి చిక్కిన పిమ్మట పొర
పాటున విడువని మాట
పాటలు కట్టుచు పాడుచు అది
వదలక నుడివే మాట
ఆటల పాటల మధ్యన అల
వాటుగ నుడివే మాట
ధారుణి సుజనులు నోటను అది
తీరుగ నిలచే మాట
తీరైన చక్కన్ని మాట అది
ఆరాట మణచే మాట
ఆరాట మణచి వేగమే ఒక
దారిని చూపెడు మాట
దారికి వచ్చిన వారికి సం
సారము తొలగే మాట
రాముని నామము నోట
- నీనోట
పోనీ పోనీ
పోగైన పాపపు మూట
- నీమూట
మిక్కిలి సొగసైన మాట అది
మిక్కిలి విలువైన మాట
మిక్కిలి సులువైన మాట అది
మిక్కిలి సుఖమిచ్చు మాట
మిక్కిలి కుదురిచ్చు మాట అది
మిక్కిలి ఫలమిచ్చు మాట
మిక్కిలి తీయన్ని మాట అది
మిక్కిలి శుభమిచ్చు మాట
నూటికి కోటికి యొకనికి అది
నోటికి దొరకెడు మాట
నోటికి చిక్కిన పిమ్మట పొర
పాటున విడువని మాట
పాటలు కట్టుచు పాడుచు అది
వదలక నుడివే మాట
ఆటల పాటల మధ్యన అల
వాటుగ నుడివే మాట
ధారుణి సుజనులు నోటను అది
తీరుగ నిలచే మాట
తీరైన చక్కన్ని మాట అది
ఆరాట మణచే మాట
ఆరాట మణచి వేగమే ఒక
దారిని చూపెడు మాట
దారికి వచ్చిన వారికి సం
సారము తొలగే మాట