ఎన్ని పూజలు నీవు తిన్నగా చేసినా దేవు
డెన్నుకొనిన్నాళ్ళె యిల మీద యునికి
పాతపద్దులు తీసి కొత్తలెక్కలు వేసి
మేతయింతని వ్రాసి మేదినికి పంపు
అతురతొ నీవెన్ని యర్జీలు పెట్టినా
ఆత డవి గైకొనడురా తెలుసుకో
పద్దులను చేర్ఛేవు ప్రతిదినంబును నీవు
వద్దన్న నవి వాడు వ్రాసి లెక్కించు
ముద్దుగా నినుపిలిచి పుస్తకంబును తీసి
దిద్దుకొమ్మని పంపు దినమను వచ్చు
పద్దులగోలయే వద్దని నీవంటె
ముద్దుగా శ్రీరామమూర్తినామము ము
ప్పొద్దులా పలుకరా బుధ్ధిగా నికమీద
పద్దులపుస్తకము వాడు చింపేను
ఈపద్దులగోల ఆపైనలేదురా
భూపతనములు లేక పోయేనురా
నీపాటికి నీవు నివసించవచ్చు
శ్రీపతిపదసీమ చేరి హాయిగను