ప్రతిలేని నీకు నేను ప్రతిబింబము నందువో ప్రతిబింబము నైతే నీకై వెతకులాడ నేల |
||
కనుగొన గగనాన నున్న కమలాప్తుని బింబమే జనులకు ప్రతి చెఱువులోన స్పష్టమై యున్నట్లులే యనుపమ శుభమూర్తి నీవె అందరివలె దోచి దనివారగ వినోదించ దలచుట జేసి |
ప్రతిలేని | |
జలముల ప్రతిబింబములను కలచు పవనచలనము నిలువ నీక జీవులను కలచు కాలచలనము తెలియగ నిజబింబమవు నిలకడగల వాడవు కలుగు మలుగు నట్టి నన్ను కరుణను గమనించి |
ప్రతిలేని | |
పరగ మూలబింబమవు భద్రాద్రిరాముడవు పరమశాంతుడవు మునిభావితశుభ చరణుడవు ఎఱుకలేక వీఱిడియై యీ భువి బడియున్న నాకు మరల సత్తువనిచ్చు మాట యొకటి తెలుపగా |
ప్రతిలేని | |
27, మార్చి 2015, శుక్రవారం
ప్రతిబింబము నైతే నీకై వెతకులాడ నేల
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.