2, నవంబర్ 2014, ఆదివారం

ఇంత జేసితి వెందుకీ‌ చింత నీకు







భగవానునకు నీవు పరమప్రేముడి వేయి
    పేరులు తీయగా పెట్టినావు

భగవానునకు నీవు పరమప్రేముడి వేయి
    గుణగణంబులు సమకూర్చినావు

భగవానునకు నీవు పరమప్రేముడి వేయి
    దివ్యస్వరూపముల్ దీర్చినావు

భగవానునకు నీవు పరమప్రేముడి వేయి
    భంగుల కీర్తనల్ పాడినావు

ఇంత జేసితి వెందుకీ‌ చింత నీకు
తెలిసినది నీకు తృప్తియే‌ కలుగలేదు
ఈశ్వరున కన్న నీ భక్తి యిష్ట మాయె
మెచ్చి యాతడు నీయందె చొచ్చి యుండె





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.