9, నవంబర్ 2014, ఆదివారం

బంతిపూలమధ్య పాప








బంతిపూల మధ్యనున్న బాలికాముఖాంబుజం
బెంత ముగ్ధమోహనముగ నెసగుచున్నదో కదా
యింతులార గంటిరే మహీతలంబు నందు కే
రింతలాడు పిల్లదాని కేది సాటి చెప్పుడీ

పూలసొగసు గూర్చి యేమి పొగడ నుండు క్రొత్తగా
బాలసొగసు గూర్చి చెప్పవలెను నేడు చక్కగా
మేలు మేలు బంతిపూల మేలమాడు బాలికా
పోలలేవు నీనగవుల పూలకులుకు లెన్నగా

కొన్ని పూవు లిపుడు కోసి దేవుని సేవ
కర్పణంబు సేయు మపుడు విభుని
ముందు జన్మమందు ముద్దులపాపలై
పుట్టవలె నటంచు పూలు కోరు




(పై పద్యాలు  పద్యరచన - 729 సందర్భంగా ప్రకటించినవే.)