3, నవంబర్ 2014, సోమవారం

ఆన తీయవె నీ సేవ నమరియుండ





నోరు నీ నామముల్ నుడువు చుండును గాని
    మనసు వేరొక చోట మసలు చుండు

జపమాల నీ‌ వ్రేళ్ళు జరుపు చుండును గాని
    బుధ్ధి వేరొక చోట పొరలు చుండు

చేతులు పూజలే చేయు చుండును గాని
    చిత్తంబు మానక చెదరు చుండు

కనులు నీ మూర్తినే కాంచు చుండును గాని
    అంతఃకరణ మన్య  మరయుచుండు

భువనమోహన నీలీల నవును గాక
నింత యలసత గలుగనా కేమి కతము
సర్వలోకేశ యిట్లింక జరుగ నీక
ఆన తీయవె నీ సేవ నమరియుండ





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.