18, నవంబర్ 2014, మంగళవారం

మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉందో ఈ ప్రశ్నావళి ద్వారా సులభంగా తెలుసుకోండి.

Harvard School of Public Health (HSPH) వారు ఒక మంచి ప్రశ్నావళితో కూడిన సర్వేను రూపొందించారు. దీని సహాయంతో మన ఎంత మంచి అరోగ్యవంతమైన ఆహారవిహారాలు కలిగి ఉన్నదీ చక్కగా అంచనా వేయవచ్చును.

ఈ క్రింది లింక్ ద్వారా మీ ఆరోగ్య పరిస్థితినీ, తెలుసుకోవచ్చును.  ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చే అవకాశం గురించి ఈ సర్వే చెబుతుంది.




ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాల్లో గుండెజబ్బుల గురించి అంచనాలకు రావటం అంత సులభం కాదు. ఈ సర్వే ఆ కొరత తీర్చుతోంది.

ముఖ్యంగా మధ్య వయస్కులైన స్త్రీపురుషులకు ఈ సర్వే ఫలితాలు మంచి దారులు చూపిస్తాయి. ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలో స్పష్టం చేస్తాయి.

61,025 మంది స్త్రీలనూ. 34,478 పురుషులనూ పరిశీలించారు ఈ సర్వే రూపొందించటం కోసం . 24 సంవత్సరాల పాటు జరిగిన పరిశీలనలో వీరిలో 3,775 మంది స్త్రీలలోనూ, 3,506 పురుషులలోనూ హృధయసంబంధమైన వ్యాధులు గమనించారు

సులభమైన ప్రశ్నలద్వారా మీ (గుండె) ఆరోగ్యపరిస్థితిని అంచనావేసే ఈ పరీక్షను మీకు మీరే ఇప్పుడే చేసుకోండి.  అవసరమైన ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోంది మీ జీవన శైలిలో.

(మూలవ్యాసం:New online calculator estimates cardiovascular disease risk)