7, నవంబర్ 2014, శుక్రవారం

హాయిగా నుండుట కడ్డ మేమి


తాపత్రయంబుల తలనొప్పి లేదాయె
హాయిగా నుండుట కడ్డ మేమి

కామక్రోధాదుల గడబిడ లేదాయె
హాయిగా నుండుట కడ్డ మేమి

ఈషణత్రయముచే హింసయే లేదాయె
హాయిగా నుండుట కడ్డ మేమి

మూడుగుణములు నిన్ను ముట్టనే లేవాయె
హాయిగా నుండుట కడ్డ మేమి

కాని దేవుడా నా తల పైన నెక్కి
రే బవళ్ళును నివియెల్ల రెచ్చి యాడు
హాయిగా నుండ నీయక నడ్డుపడుచు
తరిమి వేయుము వాటిని కరుణ జూపి