3, నవంబర్ 2014, సోమవారం

ఇంతకంటె విన్నవించలేను

నీ పైన నా ప్రేమ నా పైన నీ కృప
యను నవి నిత్యమై యలర నిమ్ము

నా యనురక్తియు నీ యనుమతమును
నొక్కటై నిత్యంబు నుండనిమ్ము

నీ వార లందరు నా వారలే నను
భావన సత్యమై పరగ నిమ్ము

నీ విచ్చు భాగ్యమే నే కోరు మోక్షమై
మన మధ్య నెడ మింక మాయ నిమ్ము

పరమపురుష నీకు భారమైన వరము
లడుగ లేదు గాన నాదరించి
చేరదీయవయ్య చేతులు జోడింతు
నింతకంటె విన్నవించలేను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.