4, నవంబర్ 2014, మంగళవారం

వివేచన - 14. వాదములకు జొచ్చి వీదినిబడ నేల


దేవుడే లేడని భావించు చుండెడి
వారితో వాదించి ఫలిత మేమి

మా దేవుడే గొప్ప మీ దేవుడే యల్పు
డను వారి తోడ వాదనలు సబబె

దేవు డుండును మాను తెలియ నేమిటి కను
ప్రజ్ఞానిధులతోడ పంతమేల

దేవుని సంగతి తెలియరు మా కన్యు
లను వారి జోలికి జనగ నేల

నీకు భక్తి యున్న నీ శక్తి మేరకు
కొలుచుకొనుము లోన తలచుకొనుము
వాదములకు జొచ్చి వీదినిబడ నేల
భక్తి చెడగ దాన ముక్తి చెడగ


3 కామెంట్‌లు:

 1. దేవుడు అనే భావన వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినది. భక్తి అనేది వ్యక్తిగతంగా ఉన్నంతవరకు లేదా ఇతర భక్తులను ఇబ్బంది పెట్టనంతవరకు ఫర్వాలేదు. దేవుడి పేరుతో మైకుల హోరు శృతిమించడం ఇబ్బందికరంగా ఉంటున్నది చాలా సందర్భాలలో. దేవుడు లేడని బలవంతంగా వాదించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం.

  రిప్లయితొలగించండి


 2. ప్రశ్న: దేవుడున్నాడా! లేడా ?
  జవాబు : తెలీదు .
  ప్రశ్న: వాదన అవసరమా!?
  జవాబు : అనవసరం !

  ప్రశ్న: దేవునిపై విశ్వాసం ?
  జవాబు: విశ్వాసం ఉన్న చోట దేవుడు ఉన్నాడు !
  ప్రశ్న : భక్తి ప్రకటనలు ఏ విధంగా ఉండాలి!?

  జవాబు: భక్తి ఉన్న చోట ప్రకటన ఉండదు !!

  ప్రశ్న వేయువాడు ఎవడు ? జవాబు ఇచ్చు వాడు ఎవడు?
  ఎవడు ప్రశ్న? ఎవడు జవాబు?
  ప్రశ్న ఏది? జవాబు ఏది ?

  అంతా విష్ణు మాయ !!

  జిలేబి

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.