నిఖిలేశ్వరుడ వీవు నిర్భాగ్యుడను నేను కాని నాతోడ సఖ్యంబు నీకు సర్వవేత్తవు నీవు జడుడ నల్పుడ నేను కాని నాతోడ సఖ్యంబు నీకు గుణవిశాలుడ వీవు కుత్సితుండను నేను కాని నాతోడ సఖ్యంబు నీకు సర్వసముడ వీవు గర్వాంధుడను నేను కాని నాతోడ సఖ్యంబు నీకు తప్పు లెన్నక నాయందు దయను కురిసి పరమమిత్రుండ వైతివో పరమపురుష నీవు చూపిన బాటలో నేను నడచి ఒక్క నాటికి చేరుదునోయి నిన్ను |
13, నవంబర్ 2014, గురువారం
ఏదో ఒక నాటికి..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రవీంద్రుని గీతాంజలిలోని గీతాన్ని చదివిన అనుభూతి కలిగించి. మంచి భావంతో మనోహరమైన పద్యాన్ని రచించారు.
రిప్లయితొలగించండిమిత్రులు శంకరయ్యగారికి ఈ పద్యం నచ్చినందుకు ధన్యవాదాలు.
తొలగించండిఈ రోజుల్లో పద్యాలంటే జనం అవేవో లేండ్ మైన్స్ అన్నట్లుగా తప్పుకుని తిరుగుతున్నారు. ఈ విషయం ఈ పద్యాల సందర్భంలోను నిర్ద్వందంగా నిజం అని ప్రస్తుత గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ 21 పద్యాలనూ చదవటానికి సాహసించిన వారు (విలోమక్రమంలో)
( 16 + 15 + 25 + 25 + 32 + 32 + 14 + 43 + 31 + 12 + 11 + 21 + 44 + 38 + 21 + 20 + 23 + 17 + 38 + 96 + 188 ) మొత్తం 762 మంది. అంటే సగటున ఒక్కో పద్యాన్నీ 36 మంది చదివారన్న మాట. ఇందులో కూడా మొదటి రెండు పద్యాలనే 188+96 = 284 మంది చదివారు. అంటే మిగిలిన పద్యాలకు సగటు చదువరులు 25 అన్నమాట.
ఈ లెక్కలతో నాకు నిమిత్తం లేదు. కేవలం చదువరుల్లో కొందరికి ఆసక్తి ఉండవచ్చును కాబట్టి తెలియజేసాను. ఈ వివేచనపద్యాలు ఆయన వ్రాయ మన్నన్నీ వస్తాయి వాటి దారిన అవి నిక్షేపంగా.
రిప్లయితొలగించండిఅయ్య వారలు పద్య ముల వ్రాయుట లో ను ;గణముల 'లెక్ఖ' బెట్ట గలరు !
వ్రాసిన తరువాయి వాటి ని చదివిన వారిని గూడా స్టాటిస్టికల్ మీన్ లెక్ఖ బెట్ట గలరు !!
అంతా 'లెక్ఖల మాయ !!
జిలేబి
చిత్తం.
తొలగించండిజిలేబీ గారు, మీ కోసం ఒక లెక్కల పద్యం చెప్పాను చదువుకోండి.
తొలగించండి