16, నవంబర్ 2014, ఆదివారం

వివేచన - 26. బుధులమాట వినుచు పెరిగి ..







భూతంబు లన్నింటి పుట్టించి పోషింతు
వనెడు బుధులమాట వినుచు పెరిగి

సజ్జనులకు నీవు సంరక్ష సేసెద
వనెడు బుధులమాట వినుచు పెరిగి

దుర్జనులను నీవు తొలగించు చుండెద
వనెడు బుధులమాట వినుచు పెరిగి

నీకు సమానుడు నీ కధికుడును లే
డనెడు బుధులమాట వినుచు పెరిగి

ఎంతవారు నిన్ను సుంతయు తెలియలే
రనెడు బుధులమాట వినుచు పెరిగి
నిన్ను శరణు జొచ్చి యున్నాడ నీశ్వర
కరుణజూపి నన్ను కావవయ్య







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.