26, జులై 2012, గురువారం

విన్నవించితిని విషయము లన్నీ చిన్న మాటను దాచకను నన్ను కాచుటకు నాస్వామీ నీ కన్నను హితు లెవ రున్నారు

edited 11/14/19
విన్నవించితిని విషయము లన్నీ చిన్న మాటను దాచకను
నన్ను కాచుటకు నాస్వామీ నీ కన్నను హితు లెవరున్నారు

చన్న భవములను గావించినవి చిన్నతప్పులో పాపములో
యెన్నగ నేవో పున్నెములో నా కన్నను నీకే యెఱుకగదా 
అన్నియు గలసి తేపతేపకు నన్ను త్రిప్పురా యిల చుట్టూ
మన్నించర నే నలసితిరా బ్రతిమాలుదు రామా బ్రోవరా

సత్వము లేదే సర్వతీర్థములు శ్రధ్ధ మీర సేవించుటకు
తత్వసార విచారము చేయగ చదువును చాలదురా నా దీ
నత్వము నెఱిగిన కరుణామయుడవు నాకేమో నీదయయే
సత్వము తత్వము కావున నన్ను చప్పున రామా బ్రోవరా

తెలిసిన దొకటే నిన్నే నమ్ముట తెలిసీ తెలియని మనసునకు
తెలియని దొకటే మంచి దారిని తీరుగ నడిచే సద్విద్య
తలచుకొంటివా తక్షణమే నా తాపము లన్నీ తీరునయా
కలిసెద నీలో కల్మషముడిగి గ్రక్కున రామా బ్రోవరా

original 7/26/12
విన్నవించితిని విషయము లన్నీ చిన్న మాటను దాచకను
నన్ను కాచుటకు నాస్వామీ నీ కన్నను హితు లెవ రున్నారు

చన్న భవములను గావించినవి చిన్నతప్పులో పాపములో
ఎన్నగ నేవో పున్నెములో నా కన్నను నీకే యెరుకగదా 
అన్నియు గలసి తేపతేపకు నన్ను త్రిప్పురా యిల చుట్టూ
మన్నించర నే నలసితిరా బ్రతిమాలుదు రామా బ్రోవరా

సత్వము లేదు సర్వతీర్థములు శ్రధ్ధ మీర సేవించుటకు
తత్వసార విచారము చేయగచదువు చాలదు నా దీ
నత్వ మెరిగిన కరుణామయుడవు నాకేమో నీదయయే
సత్వము తత్వము కావున నన్ను చప్పున రామా బ్రోవరా

తెలిసిన దొకటే నిన్ను నమ్ముట యీ తెలిసీ తెలియని మనసునకు
తెలియని దొకటే మంచి దారిని తీరుగ నడిచే సద్విద్య
తలచుకొంటివా తక్షణమే నా తాపము నీవు దులిపెదవు
కలిసెద నీలో కల్మషముడిగి కాదన కయ్యా బ్రోవరా

7 వ్యాఖ్యలు:

 1. ఆ దేవదేవునికి నివేదన, చక్కగా రాశారు, అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఏమయ్యా శ్యామలీయా !

  నిన్ను కావడం కూడా నా పనేనా?

  నీ కిచ్చిన సంకల్ప బలం ఎందుకు మరి? అని స్వామీ వారు అడిగితే సమాధానం ఏమి చెబుతారు శ్యామలీయం వారు?

  జిలేబి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చాలునులే కికురింత మాటలు నా లావే మరి నీవుకదా
   చాలె నేని సంకల్పబలము నీ సాయము వలదని పలికెదనో
   చాలీ చాలని బలము కనుకనే చక్కగ నిన్నే వేడితిగా
   యీలాగున హసియించుట మాని యేలగ రావే యీశ్వరా

   తొలగించు
 3. nijame meeru enthati pandithulainaa devuni kataakshame kadaa adi maruvani mimmu aayana tappaka rakshistaadu. sir baagaa raasaaru

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పద్యం అందరు మర్చిపోతున్నారు.మీరు చక్కగా దేవుడిని
  తలుచుకుంటూ బాగా వ్రాసారు

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.