24, జులై 2012, మంగళవారం

పగబట్టి యున్నదీ ప్రకృతి నన్ను దిగలాగుచున్నదీ ప్రకృతి

పగబట్టి యున్నదీ ప్రకృతి నన్ను
దిగలాగుచున్నదీ ప్రకృతి

దేహబంధము వీడి దివ్యత్వమున నుండ
నూహ చేసెడివేళ సుడికించుచున్నది
ఐహికవాంఛల నిదే  యెగదోయుచున్నది
స్నేహ హస్తము జాచి చేదుకో రామ

ఈ నశ్వరములపై పోని నా బుధ్ధికి
లేని యాశల నెల్ల తాను  గ్రుచ్చేను
దాని దుందుడుకును పూని నీ వైనను
మానిపించుము నన్ను మన్నించి రామ

నీవు నే నొకటనే నిశ్చయంబున నుండ
కావు నా వాడవని గద్దించు చున్నది
ఏవిధి తొలగింతువో యిట్టి చీకాకును
కావ నీ వే దిక్కు కరుణించు రామ


3 కామెంట్‌లు:

  1. sir prakruthi manaku varam antaaru kadaa, meeru evariki nivedisthunnaru ee vedaani devunikaa?

    రిప్లయితొలగించండి
  2. ఫాతిమాగారూ, దేవుడు సత్యం. ప్రకృతి అనేది మాయతో కూడుకున్నది, జననమరణాలకు కారణమైనది. దీనినుండి విడివడి జీవుడు తనదైన శుద్ధమైన స్వరూపాన్ని తెలుసు కోవటం కష్టం. ప్రకృతి నుండి విడివడటాన్నే ముక్తి అంటాము. అసలు ఆమాట అర్థమే 'విడివడుట' అని కదా. ఆ క్రమంలో యేర్పడే చిక్కులు ఇన్నీ అన్నీ కావు. జీవుడికి ఇఛ్ఛ ఉన్నప్పటికీ విడివడటానికి శక్తి చాలదు. అందుకు దైవకృప అత్యావశ్యకం. అదే ఈ పాట సారాశం.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.