ముంచ కుండ కురియు వాన మంచి వాన మమ్ము
ముంచెత్తు నీకృప రామ మంచి వానపుడమికి గంధపు పూత మొదటి వాన మా
యెడదల మతి మలదు నీదు కరుణ వాన
తడయనేల కురియ వయ్య కరుణ వాన మా
యెడల నీకు ప్రేమ హెచ్చై యెగయు గాన
నదుల నీరు నించి బ్రోచు నయ్య వాన మా
మదుల మంచి నించు నీదు కరుణ వాన
మృదులహృదయ కురియ వయ్య కరుణ వాన మా
కధికప్రేమ జూపు వాడ వగుదు గాన
మెతుకులు పండించు వర్షఋతువు వాన మా
బ్రతుకులు పండించు నీదు కరుణ వాన
సతతము కురిపించ వయ్య కరుణ వాన మా
కతులప్రేమాస్పదుడగు పతివి గాన
చక్కని పద్య వర్షం కురిపించారు శ్యామల రావు గారూ!
రిప్లయితొలగించండిఅభినందనలు మీకు...
@శ్రీ
చాలా బాగుందండీ...మీ పద్యప్రతిభ తో వర్షం కురిపించేసారు...:)
రిప్లయితొలగించండితడిసి ఆనందించాను.
చాలా చాలా బాగుంది అండీ.... చక్కని రచన...
రిప్లయితొలగించండిbaagundi ... baagundi
రిప్లయితొలగించండిసూపర్
రిప్లయితొలగించండి