ఏ నాడనగా మొదలైనదయా యీ నా దీర్ఘప్రయాణం ఇది
యే నాటికి కడతేరే నయ్యా యెన్నడు నీ దరి చేరుదు నయ్యా
ఎన్నడు జ్ఞప్తికి రానివి యెన్నెన్నో జన్మలు గడచినవి ఇం
కెన్ని జన్మ లీ దీర్ఘప్రయాణం యీశ్వర యెట్లా చేయా లయ్యా
ఏ దారిని పడి వచ్చితినో ఏ దారిన పడి పోవుచుంటినో
ఈ దారుణమగు దీర్ఘప్రయాణం యీశ్వర యిది నా కెందుకయా
ఎంతో దయగల వాడవు నీవని యీశ్వర నేను యెరుగుదును
అంతు లేని యీ దీర్ఘప్రయాణం పంతగించక నిలుపవయా
ఏ నాడును నిను వేరు భాగ్యములు నేను వేడినది లేదయ్యా
ఈ నా చేసిన దీర్ఘప్రయాణం ఇక నిను కలిసి ముగింతునయా
ఆర్తి చాలా ప్రస్ఫుటంగా ఉన్నదండి.
రిప్లయితొలగించండిచాలా బాగుంది.వైరాగ్యానికిది పరాకాష్ట.
రిప్లయితొలగించండిభగవంతునిలో లీనమవ్వాలనే భక్తుని కోరిక...
రిప్లయితొలగించండిచాలా చాక్కగా ఉందండి.....
అభినందనలు మీకు...
మీ బ్లాగ్ లుక్ బాగుందిపుడు...
@శ్రీ