నేను నీ పక్షమున నిలచి వాదులాడేనో
పోనిమ్మని నీవలె కాననటు లుండేనో
చేరి కొలుచుచుండు వారు దూఱి నవ్వుచుండు వారు
సారెకు నిను తలచు వారు నౌర నిన్నెరుగని వారు
వీరందరు గూడ నీదు కారుణికమునకు తగిన
వార లగుచు కానబడుట బాగ విదిత మాయె రామ
జ్ఞానదృష్టి నెఱుగు వారు కాన లేక దిట్టు వారు
లోన నమ్మి నిలుచు వారు లేని శంక లేని వారు
మానక వీరెల్ల నీదు మంచి చూపు నోచు కొనగ
లేనిపోని తాపములకు లోనగు టేమిటికి రామ
వారి వారి ముందు గతికి వారి వారి పధ్ధతులని
మారు పలుకరాని గొప్ప మాట నీవు చెప్పి నావు
దారులన్నియును నీదు ధామమును చేరు గాన
తీరి పోయె వాదు లనుచు తెలియ వచ్చినది రామ
మంచి ఆధ్యాత్మిక దృష్టి కలిగిన మీకు, మీ దృష్టి ఎటుందో మీ "పదాలు" కూడా అటే సాగుతున్నాయి.అందరినీ ఆ దారినే రమ్మంటున్నాయి. శుభం..
రిప్లయితొలగించండిదారులెల్ల చేరునది నీ ధామమున కగుట వలన -- sarva deva namaskaram kesavam pratigacchati. om samti ssamti ssamtih
రిప్లయితొలగించండిచాలా బాగుంది శ్యామలరావు గారూ!
రిప్లయితొలగించండి@శ్రీ