11, జులై 2012, బుధవారం

తోడై యుండెడి వాడు లేడు వేరొకడు

తోడై యుండెడి వాడు లేడు వేరొకడు నే
నేడ బోవుదును మారాడ వేమి రామ

గడచిన జన్మంబుల నడచినట్టి కథలకు
పడిన కష్టంబులకు పరగ సాక్షివి నీవె
ఒడిదుడికుల కావలి యుత్తమం బగు స్థితికి
నడిపించు వారింక నా కెవ్వరున్నారు

ఉన్నది నీ వొక్కడవె యన్న సంగతి నమ్మి
యున్నందు కే ఫలము తిన్నగ నిచ్చితివి
నన్ను తిప్పలు బెట్టుచున్న ప్రకృతిమాయ
నన్నన్న తొలగించకున్నావు న్యాయమా

మనకు బేధము లేని మాట సత్యమె గాని
వినుము దేహభ్రాంతి నను వీడకున్నదే
తనువుల దూరి యిటు దారితప్పిన దాని 
గొనుము నీ ప్రతిబింబమును నీవు గొబ్బున

4 కామెంట్‌లు:

  1. కొంచెం నిందాస్తుతితో కలిసి...
    చాలా చక్కగా ఉంది శ్యామలరావు గారూ!
    అభినందనలు మీకు...
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  2. chaalaa baavundi.

    నడిపించు దిక్కు వేరు నా కెవ్వరున్నారు.. :)

    రిప్లయితొలగించండి
  3. మీ గీత రచన చాలా బాగున్నది .
    ఏడుగడ మున్నగు పదాల సొగసులు గొప్పవి.
    అన్నమాచార్య ఒరవడి చాల కష్టం,
    మీరు ఆ శైలిని సాధించారు శ్యామలీయం గారూ!
    ;
    ;

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.