గురువంటే నాగురువే గురువు
పరమేశ్వరుడే నాగురువు
గురువులకే తొలిగురువై వెలసిన
పరమేశ్వరుడే నాగురువు
హరినామము నాచెవిలో చెప్పిన
పరమేశ్వరుడే నాగురువు
పరమపదమునకు దారిని చూపిన
పరమేశ్వరుడే నాగురువు
హరిజపమును నాకలవడ జేసిన
పరమేశ్వరుడే నాగురువు
హరికథలను గిరిసుతతో బలికిన
పరమేశ్వరుడే నాగురువు
హరిభక్తుల నాదరముగ జూచే
పరమేశ్వరుడే నాగురువు
హరేరామయని యనిశము పలికే
పరమేశ్వరుడే నాగురువు
హరిభక్తులలో నగ్రగణ్యుడగు
పరమేశ్వరుడే నాగురువు